అనిల్ జాదవ్
అనిల్ జాదవ్ | |||
| |||
పదవీ కాలం 3 డిసెంబర్ 2023 – ప్రస్తుతం | |||
ముందు | రాథోడ్ బాపూరావు | ||
---|---|---|---|
నియోజకవర్గం | బోథ్ నియోజకవర్గం | ||
పదవీ కాలం 2023- ప్రస్తుతం | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1971 రాజుర గ్రామం, నేరడిగొండ మండలం, ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ ఇండియా | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | రామారావు,యశోద బాయి | ||
జీవిత భాగస్వామి | హరి ప్రియా | ||
సంతానం | ఆర్యన్ జాదవ్, ఛత్రపతి జాదవ్ | ||
నివాసం | నేరడిగొండ,మండలం నేరడిగొండ,ఆదిలాబాద్ తెలంగాణ,ఇండియా | ||
మతం | హిందూ మతం |
అనిల్ జాదవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం బోథ్ ఎమ్మెల్యే, మాజీ నేరడిగొండ జెడ్పీటీసీగా పని చేశారు.అనిల్ జాదవ్ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బోథ్ శాసనసభ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ ఎమ్మెల్యే గా గెలిచాడు.[1][2]
జననం
[మార్చు]అనిల్ జాదవ్ 1971లో తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం,రాజురా (ధోబిగూడ) తాండాలో జాదవ్ రామారావు పోలిష్ పటేల్, యోశోద బాయి అను లంబాడీ గిరిజన దంపతులకు జన్మించారు.
రాజకీయ జీవితం
[మార్చు]అనిల్ జాదవ్ టీఆర్ఎస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలో చేరి బోథ్ నియోజకవర్గం నుండి 2009, 2014లో కాంగ్రెస్ అభ్యర్థిగా, 2018లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత బీఆర్‌ఎస్ పార్టీలో చేరి[3] 2019లో జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో నేరడిగొండ జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యునిగా గెలిచాడు.[4]
అనిల్ జాదవ్ 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీఆర్‌ఎస్ అభ్యర్థి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుపై 22800 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టాడు.[5][6]
అనిల్ కాంగ్రెస్ టికెట్‌పై 2009లో 33,900 ఓట్లు (29.2 శాతం ఓట్లు), 2014లో 35,877 ఓట్లు (25.90 శాతం ఓట్లు) సాధించగా, 2018లో స్వతంత్ర అభ్యర్థిగా 28,206 ఓట్లు (17.99 శాతం ఓట్లు) సాధించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (22 August 2023). "పాతకొత్తల మేళవింపుతో జాబితా". Archived from the original on 29 August 2023. Retrieved 29 August 2023.
- ↑ "ADB: జెడ్పీటీసీ పదవికి అనిల్ జాదవ్ రాజీనామా." Prabha News (in అమెరికన్ ఇంగ్లీష్). 2023-12-07. Retrieved 2024-05-01.
- ↑ Sakshi (21 March 2019). "ఆదిలాబాద్‌లో మారుతున్న రాజకీయ 'రంగులు'". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
- ↑ Sakshi (10 May 2019). "రసవత్తరంగా రెండో దశ!". Archived from the original on 7 September 2023. Retrieved 7 September 2023.
- ↑ Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
- ↑ News, Sira (2024-04-30). "Anil Jadhav: ఆధ్యాత్మికతో మానసిక ప్రశాంతత : ఎమ్మెల్యే అనిల్ జాదవ్". SIRA NEWS. Retrieved 2024-05-01.
{{cite web}}
:|last=
has generic name (help)