నార్నూర్ మండలం
నార్నూర్ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, నార్నూర్ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°23′39″N 78°47′08″E / 19.394068°N 78.785477°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | నార్నూర్ |
గ్రామాలు | 53 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 49,239 |
- పురుషులు | 25,789 |
- స్త్రీలు | 23,450 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 41.41% |
- పురుషులు | 55.73% |
- స్త్రీలు | 26.51% |
పిన్‌కోడ్ | 504311 |
నార్నూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1] నార్నూర్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఉట్నూరు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి
వ్యవసాయం, పంటలు
[మార్చు]నార్నూరు మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16528 హెక్టార్లు, రబీలో 672 హెక్టార్లు. మండలంలో ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[3]
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 49,239 - పురుషులు 25,789 - స్త్రీలు 23,450. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 201 చ.కి.మీ. కాగా, జనాభా 29,152. జనాభాలో పురుషులు 15,370 కాగా, స్త్రీల సంఖ్య 13,782. మండలంలో 5,813 గృహాలున్నాయి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 25 (ఇరవైఐదు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 120
సాహితీవేత్తలు
[మార్చు]రాథోడ్ శ్రావణ్ నార్నూర్ మండలంలోని సోనాపూర్ గ్రామానికి చేందిన రచయిత,పూర్వ అధ్యక్షులు ఉట్నూరు సాహితీ వేదిక, అధ్యాపకులుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి యందు విధులు నిర్వర్ధిస్తున్నారు.
రచనలు: దేశభక్తి కైతికాలు, పండుగలు ముత్యాల హారాలు,బంజారా జాతి రత్నం బానోత్ జాలం సింగ్, బంజారా భీష్మ అమర్ సింగ్ తిలావత్ మొదలగునవి.