సిరికొండ మండలం (ఆదిలాబాద్ జిల్లా)
సిరికొండ మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, సిరికొండ మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 19°26′09″N 78°33′44″E / 19.435878°N 78.562237°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఆదిలాబాద్ జిల్లా |
మండల కేంద్రం | సిరికొండ (అదిలాబాద్ జిల్లా) |
గ్రామాలు | 16 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 331 km² (127.8 sq mi) |
జనాభా | |
- మొత్తం | 16,503 |
- పురుషులు | 8,238 |
- స్త్రీలు | 8,265 |
పిన్‌కోడ్ | 504308 |
సిరికొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] సిరికొండ, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 47 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. ఇందులో 16 గ్రామాలున్నాయి.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[3] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు
[మార్చు]ఇంతకుముందు సిరికొండ గ్రామం అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోని ఇచ్చోడ మండల పరిధిలో ఉంది. 2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా సిరికొండ గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా,తిరిగి అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలోనే కొనసాగిస్తూ 1+15 (పదహారు) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[4] 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 16,503. జనాభాలో పురుషులు 8,238 కాగా, స్త్రీల సంఖ్య 8,265. మండలంలో 3,538 గృహాలున్నాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- వాయిపేట్
- లచింపూర్ (బి)
- రాంపూర్ (బి)
- కొండాపూర్
- లకంపూర్
- పోచంపల్లి
- లచింపూర్ (కె)
- సిరికొండ
- సుంకిడి
- సోన్‌పల్లి
- పొన్న
- నేరడిగొండ
- నేరడిగొండ (కె)
- నారాయణపూర్
ఇంద్రవెల్లి మండలానికి మారిన గ్రామాలు
[మార్చు]గతంలో ఈ మండల పరిధిలో ఉన్న మల్లాపూర్, ధర్మసాగర్ అనే రెండు గ్రామాలు ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలో చేర్చారు.[5][6]
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2020-01-28.
- ↑ "Four new mandals formed, total goes up to 589". The New Indian Express. Retrieved 2022-04-27.
- ↑ Singh, S. Harpal (2019-03-08). "Mallapur, Dharmasagar repatriated to Indervelli". The Hindu (in Indian English). ISSN 0971-751X. Retrieved 2022-04-27.