అక్షాంశ రేఖాంశాలు: 19°39′57″N 78°32′01″E / 19.665867°N 78.533649°E / 19.665867; 78.533649

ఆదిలాబాద్ గ్రామీణ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అదిలాబాద్ గ్రామీణ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ గ్రామీణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ గ్రామీణ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, అదిలాబాద్ గ్రామీణ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°39′57″N 78°32′01″E / 19.665867°N 78.533649°E / 19.665867; 78.533649
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం అదిలాబాద్
గ్రామాలు 38
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 40,743
 - పురుషులు 20,200
 - స్త్రీలు 20,543
పిన్‌కోడ్ 504001


అదిలాబాద్ గ్రామీణ మండలం, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని కొత్తగా ఏర్పరచారు.[2] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం, పూర్వపు "ఆదిలాబాద్ మండలం"లో భాగంగా ఇదే జిల్లాలో ఉండేది.[3] పునర్వ్యవస్థీకరణలో ఆదిలాబాదు మండలాన్ని విడదీసి, 3 గ్రామాలతో ఆదిలాబాద్ పట్టణ మండలాన్ని, 38 గ్రామాలతో ఆదిలాబాద్ గ్రామీణ మండలాన్ని, 4 గ్రామాలతో మావల మండలాన్నీ ఏర్పాటు చేసారు.[4] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో మొత్తం 38 రెవెన్యూ గ్రామాలున్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.

పునర్వ్యవస్థీకరణలో ఏర్పడిన ఈ మండల వైశాల్యం 296 చ.కి.మీ. కాగా, జనాభా 40,743. జనాభాలో పురుషులు 20,200 కాగా, స్త్రీల సంఖ్య 20,543. మండలంలో 9121 గృహాలున్నాయి.

నూతన మండల కేంద్రంగా గుర్తింపు

[మార్చు]
అదిలాబాద్ పోర్టులో ఒక భాగం

2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా 38 గ్రామాలుతో అదిలాబాదు నూతన మండల కేంధ్రంగా. అదిలాబాదు జిల్లా, అదిలాబాదు రెవెన్యూ డివిజను పరిధిలో ఈ మండలాన్ని చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[5]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 38 (ముప్పై ఎనిమిది) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మూడు నిర్జన గ్రామాలు ఈ విభాగంలో తొలగించబడ్డాయి.

గమనిక:నిర్జన గ్రామాలు 3 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-06-12. Retrieved 2018-05-29.
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  3. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  4. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  5. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016