అదిలాబాదు పట్టణ మండలం,తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఒక మండలం.[1]ఆదిలాబాద్, ఈ మండలానికి కేంద్రం. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం, పూర్వపు "ఆదిలాబాద్ మండలం"లో భాగంగా ఇదే జిల్లాలో ఉండేది.[2] పునర్వ్యవస్థీకరణలో ఆదిలాబాదు మండలాన్ని విడదీసి, 3 గ్రామాలతో ఆదిలాబాద్ పట్టణ మండలాన్ని, 38 గ్రామాలతో ఆదిలాబాద్ గ్రామీణ మండలాన్ని, 4 గ్రామాలతో మావల మండలాన్నీ ఏర్పాటు చేసారు. ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో మొత్తం 3 గ్రామాలు ఉన్నాయి.
మండల జనాభా: 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 1,98,338 - పురుషులు 1,00,054 - స్త్రీలు 98,284:పిన్ కోడ్ నం. 504001. పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 19 చ.కి.మీ. కాగా, జనాభా 117,167. జనాభాలో పురుషులు 59,448 కాగా, స్త్రీల సంఖ్య 57,719. మండలంలో 25,840 గృహాలున్నాయి.
2016 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఆదిలాబాదు జిల్లా, అందులో ఆదిలాబాదు మండల భౌగోళిక రూపం ఇలా ఉండేది.తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.