Jump to content

బేల మండలం

Coordinates: 19°44′08″N 78°40′47″E / 19.735684°N 78.679733°E / 19.735684; 78.679733
వికీపీడియా నుండి
బేల మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బేల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బేల మండలం స్థానాలు
తెలంగాణ పటంలో ఆదిలాబాద్ జిల్లా, బేల మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 19°44′08″N 78°40′47″E / 19.735684°N 78.679733°E / 19.735684; 78.679733
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా
మండల కేంద్రం బేల
గ్రామాలు 41
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 68,318
 - పురుషులు 34,475
 - స్త్రీలు 34,843
అక్షరాస్యత (2011)
 - మొత్తం 55.82%
 - పురుషులు 69.41%
 - స్త్రీలు 41.90%
పిన్‌కోడ్ 504309

బేల పట్నం, తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక పట్నం, మండలం.[1] బేల, ఈ మండలానికి కేంద్రం. ఇది మండల కేంద్రమైన బేల నుండి 0 కి. మీ. దూరం లోను, సమీప పట్టణమైన ఆదిలాబాద్ నుండి 31 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.బేల పట్టణం తెలంగాణ రాష్ట్రంలోని ఉత్తరాన ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. బేల నివాసితులలో 72% మంది హిందూ మతాన్ని, 18% మంది ఇస్లాంను, 8% మంది బౌద్ధమతం, జైనమతం మరియు క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారు. బేల పట్టణంలో 60% కంటే ఎక్కువ మంది మరాఠీ భాష మాట్లాడతారు మరియు 20% మంది తెలుగు భాష మాట్లాడతారు మరియు 10% మంది హిందీ మరియు ఉర్దూ మాట్లాడతారు.[2] ప్రస్తుతం ఈ మండలం ఆదిలాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో మొత్తం 47 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 6 నిర్జన గ్రామాలు.

2016 లో పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త ఆదిలాబాదు జిల్లాలో మండల స్థానం

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 420 చ.కి.మీ. కాగా, జనాభా 68,318. జనాభాలో పురుషులు 34,475 కాగా, స్త్రీల సంఖ్య 34,843. మండలంలో 13,521 గృహాలున్నాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 47 (నలభై ఏడు) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.నిర్జన గ్రామాలు ఐదు ఉన్నాయి.

గమనిక:నిర్జన గ్రామాలు 6 పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=బేల_మండలం&oldid=4767321" నుండి వెలికితీశారు