రమేష్ రాథోడ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రమేష్ రాథోడ్
రమేష్ రాథోడ్


పదవీ కాలం
2009 – 2014
ముందు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
తరువాత గోడం న‌గేశ్
నియోజకవర్గం ఆదిలాబాద్

పదవీ కాలం
1999 – 2004
ముందు అజ్మీర గోవింద్ నాయక్
తరువాత అజ్మీర గోవింద్ నాయక్
నియోజకవర్గం ఖానాపూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1966-10-20)1966 అక్టోబరు 20
తడిహదప్నూర్, నార్నూర్ మండలం ఆదిలాబాద్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం 2024 జూన్ 29(2024-06-29) (వయసు 57)
ఆదిలాబాద్, తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు * తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు మోహన్ రాథోడ్, కమలాబాయి
జీవిత భాగస్వామి సుమన్ రాథోడ్
సంతానం కొడుకు : రితేష్, డా.రాహుల్, కూతురు : సోనాలి
నివాసం సేవాదాస్ నగర్, ఉట్నూర్, ఆదిలాబాద్ జిల్లా

రమేష్ రాథోడ్ (1966 అక్టోబరు 20 - 2024 జూన్ 29) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు లంబాడీ సామాజిక వర్గం.తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి (1999-2004) శాసనసభ్యుడిగా ఆదిలాబాద్ లోకసభ నియోజకవర్గం నుండి (2009-2014) 15వ పార్లమెంటు సభ్యుడిగా ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ (2006-2009), టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడిగా పని చేశాడు.[1]

బాల్యం

[మార్చు]

రమేష్ రాథోడ్, తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలోని తడిహదప్నూర్ కు చెందిన లంబాడీ గిరిజన దంపతులైన మోహన్ రాథోడ్, కమలబాయ్ లకు 1966 అక్టోబరు 20లో జన్మించారు[2].

విద్య

[మార్చు]

ప్రాథమిక విద్య తన స్వంత గ్రామం నార్నూర్ మండలంలోని జిల్లా పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల తాడిహడప్నూర్ లో గురువు లక్ష్మీకాంతం వద్ద చదువు కున్నాడు.[3] వీరి విద్యాభ్యాసం ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉట్నూర్ ఆదిలాబాదు జిల్లాలో ఇంటర్మిడియట్ పూర్తి చేసి,ప్రభుత్వ డిగ్రీ కళశాల ఆదిలాబాద్ లో బి.ఎ.డిగ్రీ చదివారు.

కుటుంబము

[మార్చు]

వీరిది వ్యవసాయ కుటుంబము.సుమన్ బాయితో వివాహాం జరిగింది.సమన్ రాథోడ్ ఖానాపూర్ ఎమ్మెల్యే సేవాలందించారు.వీరికి ఒక కూతురు పేరు సోనాలి ఇద్దురు కుమారులు పెద్దా కొడుకు పేరు రితేష్ రాథోడ్ బిటెక్ చదివి ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నారు. చిన్న కొడుకు పేరు డా.రాహుల్ రాథోడ్ యంబిబిఎస్ పూర్తి చేసి యుపిఎస్సి ద్వారా అఖిల భారతీయ సర్వీస్ లో ఆదిలాబాద్ జిల్లా నుండి ఎంపికైన తొలి లంబాడీ గిరిజన యువకుడు.ఇతను న్యూ ఢిల్లీలో అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ ఉప పాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. [4]

రాజకీయ జీవితం

[మార్చు]

రమేష్ రాథోడ్‌ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నార్నూర్ జడ్పీటిసిగా ఎన్నికయ్యాడు. ఆయన ఆ తరువాత 1999లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఖానాపూర్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎల్. బక్షి నాయక్ పై 20016 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు.

రమేష్ రాథోడ్‌ ఆ తరువాత 2004లో శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి తిరిగి జెడ్పీటీసి సభ్యుడిగా ఎన్నికై 2006 నుండి 2009 వరకు ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేశాడు. ఆయన 2009లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాద్ నుండి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి కోట్నాక్ రమేష్ పై 115087 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.[5] రమేష్ రాథోడ్ తెలంగాణ  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాద్ నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు. ఆయన ఆ తరువాత 2017లో టీడీపీని వీడి భారత రాష్ట్ర సమితి లో చేరాడు.[6][7]

రమేష్ రాథోడ్ 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుండి పోటీ చేసేందుకు టీఆర్‌ఎస్ టికెట్ నిరాకరించడంతో, ఆయన 2018 సెప్టెంబర్ 21న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇంచార్జి ఆర్.సి ఖుంటియా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరి[8][9] 2018లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి అజ్మీరా రేఖ నాయక్ చేతిలో 20,710 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. రమేష్ రాథోడ్ 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.

రమేష్ రాథోడ్ జూన్ 2021లో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరి[10] 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఖానాపూర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.[11]

మరణం

[మార్చు]

రాథోడ్ రమేశ్ 2024 జూన్ 28న రాత్రి ఉట్నూరులోని తన నివాసంలో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి వెళ్ళగా పరిస్థితి విషమించింది. గుండె పోటుతో 2024 జూన్ 29న హైదరాబాదు కు తీసుకోవెళ్తుండగా మార్గ మధ్యలో ఇచ్చోడ సమీపంలో తుదిశ్వాస విడిచాడు. ఆయన వయసు 58 సంవత్సరాలు.[12][13][14]

మూలాలు

[మార్చు]
  1. "Lok Sabha". web.archive.org. 2013-03-13. Archived from the original on 2013-03-13. Retrieved 2024-04-09.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Velugu, V6 (2024-06-29). "ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత". V6 Velugu. Retrieved 2024-06-29.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Service, Express News (2021-06-15). "Telangana: Ex-Adilabad MP Ramesh Rathod joins BJP". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2024-04-12.
  4. Eenadu (15 November 2023). "అనుభవం.. అనుబంధం అడుగులుగా". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  5. ఈనాడు, తాజావార్తలు (18 March 2019). "ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం". www.eenadu.net. Archived from the original on 18 ఏప్రిల్ 2020. Retrieved 18 April 2020.
  6. Sakshi (28 May 2017). "టీడీపీకి రమేశ్‌ రాంరాం". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  7. Deccan Chronicle (2 April 2019). "Adilabad: ‘Big hearted’ Naresh Jadhav To support Ramesh Rathod" (in ఇంగ్లీష్). Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  8. "టీఆర్ఎస్‌కు గుడ్ బై.. కాంగ్రెస్‌లో చేరిన రమేష్ రాథోడ్". Samayam Telugu. Retrieved 2024-04-12.
  9. The Times of India (21 September 2018). "TRS leader Ramesh Rathod joins Congress". Archived from the original on 29 June 2024. Retrieved 29 June 2024.
  10. ABN (2021-06-12). "బీజేపీలోకి రమేష్ రాథోడ్..?". Andhrajyothy Telugu News. Retrieved 2024-04-12.
  11. "Who Is Ramesh Rathod? BJP Candidate Running From Khanapur In Telangana Elections 2023". TimesNow (in ఇంగ్లీష్). 2023-11-23. Retrieved 2024-04-12.
  12. Velugu, V6 (2024-06-29). "ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ కన్నుమూత". V6 Velugu. Retrieved 2024-06-29.{{cite web}}: CS1 maint: numeric names: authors list (link)
  13. "బీజేపీలో విషాదం.. మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కన్నుమూత". Samayam Telugu. Retrieved 2024-06-29.
  14. "మాజీ ఎంపీ రమేష్‌ రాథోడ్‌ కన్నుమూత telangana ex mp ramesh rathod passed away | Sakshi". sakshi.com. Retrieved 2024-06-29.