అజ్మీర గోవింద్ నాయక్
| అజ్మీర గోవింద్ నాయక్ | |||
| |||
ఎమ్మెల్యే
| |||
| పదవీ కాలం 1985 - 1989 | |||
| ముందు | అంబాజీ | ||
|---|---|---|---|
| తరువాత | కోట్నాక భీమ్‌రావు | ||
| నియోజకవర్గం | ఖానాపూర్ | ||
| పదవీ కాలం 1994 - 1999 | |||
| ముందు | కోట్నాక భీమ్‌రావు | ||
| తరువాత | రమేష్ రాథోడ్ | ||
| నియోజకవర్గం | ఖానాపూర్ | ||
| పదవీ కాలం 2004 - 2009 | |||
| ముందు | రమేష్ రాథోడ్ | ||
| తరువాత | సుమన్ రాథోడ్ | ||
| నియోజకవర్గం | ఖానాపూర్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
| జననం | 07 జూలై 1942 లింగాపూర్, దండేపల్లి మండలం, మంచిర్యాల జిల్లా, తెలంగాణ[1] | ||
| మరణం | 16 మార్చి 2026 | ||
| జాతీయత | |||
| రాజకీయ పార్టీ | తెలంగాణ రాష్ట్ర సమితి | ||
| ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ | ||
| జీవిత భాగస్వామి | నిర్మల నాయక్ | ||
| సంతానం | అరవింద్,మిలాన్, చందన్ | ||
అజ్మీర గోవింద్ నాయక్( జననం: 07 జూలై 1942 - మరణం: 16- మార్చి 2026)తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[2][3]
రాజకీయ జీవితం
[మార్చు]ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద నాయక్ తొలిసారిగా తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. 1985 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం ఎస్టీ నియోజకవర్గం నుండి పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.అనంతరం అదే ఖానాపూర్ నుండి పోటీ చేసి 1989లో ఓటమి పాలయ్యారు. 1994 ఎన్నికల్లో మళ్ళీ తెలుగు దేశం పార్టీ తరపున పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. అనంతరం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సమయంలో తెలుగుదేశం పార్టీ ని రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. 2004 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ తరపున పోటీ చేసి గెలుపొందారు. ఆ సమయంలో వై.యస్. రాజశేఖరరెడ్డి హయాంలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి నిధులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. 2009 తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఆయన ప్రాభవం తగ్గినా, భారత రాష్ట్ర సమితి పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగారు.
మరణం
[మార్చు]ఖానాపూర్ శాసనసభ నియోజకవర్గం మాజీ శాసన సభ్యులు అజ్మీర్ గోవింద్ నాయక్ వృద్ధాప్యం తో బాధ పడుతు 16 మార్చి 2026 న తన స్వంత గ్రామంలో లింగాపూర్ లో తుది శ్వాస విడిచారు[4][5][6].
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (10 November 2018). "దండేపల్లి ఘనత రాజకీయ చరిత". Archived from the original on 9 November 2023. Retrieved 9 November 2023.
- ↑ Namasthe Telangana (11 November 2023). "Telangana Khanapur". Archived from the original on 11 November 2023. Retrieved 11 November 2023.
- ↑ Sakshi (26 October 2023). "అప్పట్లో ఎన్నికల ఖర్చు పది వేలే..! కానీ ఇప్పుడు కోట్లలో." Archived from the original on 27 October 2023. Retrieved 27 October 2023.
- ↑ "ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతి". Mudra News (in అమెరికన్ ఇంగ్లీష్). 2026-03-16. Retrieved 2026-03-19.
- ↑ "ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే అజ్మీర గోవింద్ నాయక్ కన్నుమూత". EENADU. Retrieved 2026-03-17.
- ↑ Nallavelli.Anjaneyulu (2026-03-16). "ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతి". www.dishadaily.com. Retrieved 2026-03-17.