నిర్మల్ శాసనసభ నియోజకవర్గం
నిర్మల్ | |
— శాసనసభ నియోజకవర్గం — | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
దేశము | భారత దేశం |
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | ఆదిలాబాదు |
ప్రభుత్వం | |
- శాసనసభ సభ్యులు |
నిర్మల్ జిల్లాలోని 2 శాసనసభ నియోజకవర్గాలలో నిర్మల్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. మరో ఆరు శాసనసభ నియోజకవర్గాలతో కలిపి అదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న ఈ నియోజకవర్గం 1962 నుండి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులే విజయం సాధిస్తున్నారు. 1962 నుండి 6 సార్లు కాంగ్రెస్, కాంగ్రెస్ (ఐ) అభ్యర్థులు విజయం సాధించగా, 4 సార్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందినారు. 2009 ఎన్నికలలో పొత్తులో భాగంగా మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి పోటీ పడుతున్నాడు.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- దిలావర్ పూర్
- నిర్మల్
- లక్ష్మణ్చందా
- మామడ
- సారంగాపూర్
- నిర్మల్ టౌన్
- నిర్మల్ రూరల్
- నర్సాపూర్(జి)
- సోన్
నియోజకవర్గ భౌగోళిక సమాచారం[మార్చు]
పశ్చిమ అదిలాబాదు జిల్లాలో ఉన్న నిర్మల్ నియోజకవర్గానికి దక్షిణాన గోదావరి నది నిజామాబాదుజిల్లాతో విడదీస్తున్నది. తూర్పున ఖానాపూర్ నియోజకవర్గం ఉండగా, పశ్చిమాన ముధోల్ నియోజకవర్గం, ఉత్తరాన బోధ్ నియోజకవర్గం సరిహద్దులుగా ఉన్నాయి. వాయువ్యాన కొంతభాగం మహారాష్ట్రతో సరిహద్దును కలిగి ఉంది. ఈ నియోజకవర్గం మధ్య నుండి దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి వెళ్తున్నది.
ఎన్నికైన శాసనసభ్యులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ 1957 కె.ముత్యంరెడ్డి ఇండిపెండెంట్ పి.రెడ్డి కాంగ్రెస్ పార్టీ 1962 పి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ పి.రెడ్డి ఇండిపెండెంట్ 1967 పి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎల్.ప్రభాకర్ రెడ్డి ఇండిపెండెంట్ 1972 పి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక 1978 పి.గంగారెడ్డి కాంగ్రెస్ - ఐ పి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ 1983 ఏ.భీంరెడ్డి తెలుగుదేశం పార్టీ పి.గంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ 1985 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ జి.వి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ 1989 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ ఏ.భీంరెడ్డి తెలుగుదేశం పార్టీ 1994 ఎస్.వేణుగోపాలచారి తెలుగుదేశం పార్టీ పి.నరసారెడ్డి కాంగ్రెస్ పార్టీ 1999 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎన్.ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ 2004 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.సత్యనారాయణ గౌడ్ తెలుగుదేశం పార్టీ 2009 ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 2014 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి బి.ఎస్.పి. కె.సింహారి రావు తె.రా.స 2018 అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తె.రా.స ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 ఎన్నికలు[మార్చు]
2004లో జరిగిన శాసనసభ ఎన్నికలలో నిర్మల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన వి.సత్యనారాయణ గౌడ్‌పై 24578 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. ఇంద్రకరణ్ రెడ్డి 70249 ఓట్లు పొందగా, సత్యనారాయణ రెడ్డికి45671 ఓట్లు లభించాయి.
- 2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు సాధించిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య | అభ్యర్థి పేరు | అభ్యర్థి పార్టీ | సాధించిన ఓట్లు |
---|---|---|---|
1 | ఏ.ఇంద్రకరణ్ రెడ్డి | కాంగ్రెస్ పార్టీ | 70249 |
2 | వి.సత్యనారాయణ గౌడ్ | తెలుగుదేశం పార్టీ | 45671 |
3 | టి.రాజేశ్వర్ | బహుజన్ సమాజ్ పార్టీ | 3258 |
4 | ఎస్.రామచంద్రా రెడ్డి | ఇండిపెండెంట్ | 1878 |
5 | వంజరి విజయ్ | ఇండిపెండెంట్ | 1727 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎ.ఇంద్రకరణ్ రెడ్డి పోటీ ప్రజారాజ్యం పార్టీ తరఫున కొత్తగా పార్టీలో చేరిన ఏల్లేటి మహేశ్వర్ రెడ్డికి టికెట్ లభించింది. మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థి పోటీలో ఉన్నాడు. భారతీయ జనతా పార్టీ తరఫున రావుల రాంనాథ్ పోటీపడుతున్నాడు.ఈ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున బరిలో నిలిచిన మహేశ్వర్ రెడ్డి గెలుపొందారు.కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ పార్టీల అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. తెలంగాణ ప్రాంతంలో మొదటిసారిగా ప్రజారాజ్యం నిర్మల్ నుంచే బోణీ కొట్టింది.
ఇవి కూడా చూడండి[మార్చు]
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)
- తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)
- ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా