ఏలేటి మహేశ్వర్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఏలేటి మహేశ్వర్ రెడ్డి
ఏలేటి మహేశ్వర్ రెడ్డి


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2009 - 2014
ముందు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
తరువాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
పదవీ కాలం
2009 - 2014
నియోజకవర్గం నిర్మల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం సెప్టెంబర్ 21
గాజుల్‌పేట్, నిర్మల్ మండలం, నిర్మల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ Hand INC.svg కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు పద్మనాభ రెడ్డి
జీవిత భాగస్వామి కవిత
వృత్తి రాజకీయ నాయకుడు

ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009లో నిర్మల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

ఏలేటి మహేశ్వర్ రెడ్డి 1968లో తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, నిర్మల్ మండలం, గాజుల్‌పేట్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి 1990లో బిఏ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం[మార్చు]

ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2009లో రాజకీయాల్లోకి వచ్చి 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరపున నిర్మల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పై 2545 ఓట్లతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2014లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి మూడో స్థానంలో నిలిచాడు.

ఏలేటి మహేశ్వర్ రెడ్డి అనంతరం ఆదిలాబాద్‌ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో 9271 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.[1] ఏలేటి మహేశ్వర్ రెడ్డి 2021 జూన్ 26న తెలంగాణ రాష్ట్రంలో ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్‌గా నియ‌మితుల‌య్యాడు.[2]

మూలాలు[మార్చు]

  1. Business Standard (2018). "Nirmal Election Result 2018: Nirmal Assembly Election 2018 Results | Nirmal Vidhan Sabha MLA Result". Archived from the original on 6 February 2022. Retrieved 6 February 2022.
  2. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ ఏఐసీసీ కార్య‌క్ర‌మాల అమ‌లు క‌మిటీ చైర్మ‌న్‌గా ఏలేటి మహేశ్వర్ రెడ్డి". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.