నల్ల ఇంద్రకరణ్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నల్ల ఇంద్రకరణ్ రెడ్డి

ఎమ్మెల్యే
పదవీ కాలం
1996 - 1999
ముందు సముద్రాల వేణుగోపాలాచారి
తరువాత అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి
నియోజకవర్గం నిర్మల్

వ్యక్తిగత వివరాలు

జననం 1965
నిర్మల్ జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తెలుగుదేశం పార్టీ
నివాసం నిర్మల్, భారతదేశం
మతం హిందూ

నల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1996లో నిర్మల్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.[1][2]

రాజకీయ జీవితం[మార్చు]

నల్ల ఇంద్రకరణ్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో నిర్మల్ నియోజకవర్గం కు జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి స్వతంత్ర అభ్యర్థి అరుగుల కమాలాధర్ పై ఓట్లు 11927 మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[3][4] ఆయన ఆ తరువాత 1999లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు.

నల్ల ఇంద్రకరణ్‌ రెడ్డి ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరి 2023 అక్టోబర్ 29న హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు.[5]

మూలాలు[మార్చు]

  1. Sakshi (19 October 2023). "నిర్మల్‌". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.
  2. Sakshi (4 November 2023). "నిర్మల్‌ క్షేత్రంలో రెడ్డిలదే హవా". Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  3. Eenadu (28 October 2023). "రాజులకోట.. ఉద్ధండుల బాట". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  4. "Election Commission of India - 1996 Nirmal Bye - Election". 1996. Archived from the original on 28 December 2023. Retrieved 28 December 2023.
  5. ABP (29 October 2023). "నిర్మల్ లో బీఆర్ఎస్ కు షాక్, బీజేపీలో చేరిన ఇంద్రకరణ్ రెడ్డి". Archived from the original on 30 October 2023. Retrieved 30 October 2023.