పి.నర్సారెడ్డి
పి.నర్సారెడ్డి | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు, 9వ లోక్‌సభ | |
In office డిసెంబర్ 1989 – మార్చి 1991 | |
అంతకు ముందు వారు | సి.మాధవరెడ్డి |
తరువాత వారు | అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి |
నియోజకవర్గం | ఆదిలాబాదు |
శాసనసభ సభ్యుడు, 5వ అసెంబ్లీ | |
In office మార్చి 1972 – మార్చి 1978 | |
అంతకు ముందు వారు | పి.నర్సారెడ్డి |
తరువాత వారు | పి.గంగారెడ్డి |
నియోజకవర్గం | నిర్మల్ |
శాసనసభ సభ్యుడు, 4వ అసెంబ్లీ | |
In office మార్చి 1967 – మార్చి 1972 | |
అంతకు ముందు వారు | పి.నర్సారెడ్డి |
తరువాత వారు | పి.నర్సారెడ్డి |
నియోజకవర్గం | నిర్మల్ |
శాసనసభ సభ్యుడు, 3వ అసెంబ్లీ | |
In office మార్చి 1962 – మార్చి 1967 | |
అంతకు ముందు వారు | కోరిపల్లి ముత్యంరెడ్డి |
తరువాత వారు | పి.నర్సారెడ్డి |
నియోజకవర్గం | నిర్మల్ |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1931 సెప్టెంబరు 22 నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా (తెలంగాణా) |
మరణం | 2024 జనవరి 29 హైదరాబాదు, తెలంగాణ | (వయసు 92)
జాతీయత | India |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | కౌసల్యాదేవి |
సంతానం | 3 కుమారులు & 1 కుమారె. |
తల్లిదండ్రులు | పి.గంగారెడ్డి (తండ్రి) |
నివాసం | ఆదిలాబాద్ & న్యూ ఢిల్లీ |
కళాశాల | ఉస్మానియా విశ్వవిద్యాలయం |
నైపుణ్యం | వ్యవసాయవేత్త, న్యాయవాది & రాజకీయవేత్త |
సభలు | అనేక కమిటీలలో సభ్యుడు |
పొద్దుటూరి నర్సారెడ్డి (1931 సెప్టెంబరు 22 - 2024 జనవరి 29) భారత జాతీయ స్వాంతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త, పార్లమెంటు సభ్యుడు. ఇతడు ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గంనుండి 9వ లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు.[1][2]
ప్రారంభ జీవితం, విద్యాభ్యాసం
[మార్చు]ఇతడు ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ పట్టణంలో 1931, సెప్టెంబర్ 22వ తేదీన జన్మించాడు. ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదివి బి.ఎ., ఎల్.ఎల్.బి. పట్టాలు పొందాడు. వృత్తి రీత్యా ఇతడు వ్యవసాయదారుడు, న్యాయవాది.[1]
రాజకీయ జీవితం
[మార్చు]స్వాతంత్ర్యానికి ముందు
[మార్చు]ఇతడు నిజాం నిరంకుశ పరిపాలన నుండి హైదరాబాదు విముక్తి కోసం పోరాడిన స్వాతంత్ర్య సమర యోధుడు.
స్వాతంత్ర్యం తర్వాత
[మార్చు]ఇతడు 1940వ దశకం ప్రారంభం నుండి క్రియాశీల రాజకీయాలలో పాల్గొన్నాడు. ఇతడు మూడు పర్యాయాలు నిర్మల్ శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ సభ్యుడిగా[3], ఒక పర్యాయం శాసన మండలి సభ్యునిగా, ఒక పర్యాయం ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైనాడు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా కూడా పనిచేశాడు[1][4][5][6]
పదవులు
[మార్చు]# | నుండి | వరకు | హోదా | వ్యాఖ్య |
---|---|---|---|---|
01 | 1962 | 1967 | సభ్యుడు, 3వ అసెంబ్లీ | |
02 | 1962 | 1964 | చైర్మన్, తెలంగాణ అభివృద్ధి కమిటీ | |
03 | 1967 | 1972 | సభ్యుడు, 4వ అసెంబ్లీ | |
04 | 1968 | 1968 | సభ్యుడు, నిబంధనల కమిటీ | |
05 | 1972 | 1978 | సభ్యుడు, 5వ అసెంబ్లీ | |
06 | 1973 | 1978 | కేబినెట్ మంత్రి, నీటి పారుదల శాఖ (రాష్ట్ర ప్రభుత్వం) | |
07 | 1974 | 1978 | కేబినెట్ మంత్రి, రెవెన్యూ & శాసన సభా వ్యవహారాలు (రాష్ట్ర ప్రభుత్వం) | |
08 | 1981 | 1985 | సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ శాసనమండలి | |
09 | 1982 | 1985 | సభ్యుడు, ప్రభుత్వ హామీల కమిటీ | |
10 | 1989 | 1991 | సభ్యుడు, 9వ లోక్‌సభ | |
11 | 1990 | 1991 | సభ్యుడు, విజ్ఞాపనల కమిటీ | |
12 | 1990 | 1991 | సంప్రదింపుల కమిటీ, కార్మిక మంత్రిత్వశాఖ | |
14 | 1990 | 1991 | సంప్రదింపుల కమిటీ, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ |
మరణం
[మార్చు]అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 92 ఏళ్ల పి. నర్సారెడ్డి 2024 జనవరి 29న హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.[7]
ఇవి కూడా చూడండి
[మార్చు]- 9వ లోక్‌సభ
- ఆదిలాబాదు లోక్‌సభ నియోజకవర్గం
- ఆంధ్రప్రదేశ్ శాసనసభ
- భారత ప్రభుత్వం
- భారత జాతీయ కాంగ్రెస్
- లోక్‌సభ
- నిర్మల్ శాసనసభ నియోజకవర్గం
- భారత పార్లమెంటు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Member Profile". Lok Sabha website. Archived from the original on 24 సెప్టెంబరు 2014. Retrieved 17 January 2014.
- ↑ "Election Results 1989" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 18 జూలై 2014. Retrieved 17 January 2014.
- ↑ Sakshi (14 October 2023). "నిర్మల్ నుంచి 'పొద్దుటూరి, 'సముద్రాల'." Archived from the original on 29 January 2024. Retrieved 29 January 2024.
- ↑ "Third Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 7 డిసెంబరు 2013. Retrieved 17 January 2014.
- ↑ "Fourth Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 3 August 2012. Retrieved 17 January 2014.
- ↑ "Fifth Andhra Pradesh Legislative Assembly". Andhra Pradesh Legislature. Archived from the original on 13 మార్చి 2013. Retrieved 17 January 2014.
- ↑ "కాంగ్రెస్ సీనియర్ నేత పి.నర్సారెడ్డి కన్నుమూత |". web.archive.org. 2024-01-29. Archived from the original on 2024-01-29. Retrieved 2024-01-29.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)