పట్లోళ్ల రామచంద్రారెడ్డి
పట్టోళ్ల రామచంద్రారెడ్డి | |||
పట్టోళ్ల రామచంద్రారెడ్డి | |||
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ స్పీకర్, మంత్రి
| |||
నియోజకవర్గం | సంగారెడ్డి నియోజకవర్గం | ||
---|---|---|---|
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | సంగారెడ్డి జిల్లా, కొండాపూర్ మండలం, మారేపల్లి గ్రామం | 1929 డిసెంబరు 3||
మరణం | 2018 ఏప్రిల్ 28 హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లో | (వయసు 88)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
నివాసం | కొండాపూర్ మండలం, మారేపల్లి గ్రామం | ||
మతం | హిందూ |
పట్లోళ్ల రామచంద్రారెడ్డి నిజాం వ్యతిరేక ఉద్యమకారుడు, రాజకీయనాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి.[1]
జీవిత విశేషాలు
[మార్చు]రామచంద్రారెడ్డి 1929 డిసెంబరు 3న సాధారణ వ్యవసాయ కుటుంబంలో సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మారేపల్లి జన్మించాడు.[2] హైదరాబాదు సంస్థానం విమోచనోద్యమంలో పాల్గొని రామచంద్రారెడ్డి మొత్తం 13 సార్లు జైలుకు వెళ్ళాడు. విమోచన అనంతరం ఇంటర్, డిగ్రీ పూర్తిచేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పొంది 1956లో న్యాయవాద వృత్తి చేపట్టి రాజకీయాలలో కూడా ప్రవేశించాడు. 1959లో పటాన్‌చెరు పంచాయతి సమితి అధ్యక్షులుగా కొంతకాలం పనిచేసాడు. పల్లెసీమల అభివృద్ధికి విశేషంగా కృషిచేసినందుకు నాటి ప్రధాని నెహ్రూ చేతుల మీదుగా అవార్డును అందుకున్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి కాంగ్రెస్ తరఫున ఐదుసార్లు శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహించాడు. 1962లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు.[3] 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కూడా పాలుపంచుకున్నాడు. 1972లో రెండోసారి శాసనసభకు ఎన్నికై[4] కొంతకాలం రాష్ట్ర మంత్రిగానూ పనిచేశాడు. అతడు పటాన్‌చెరు ఫారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి చాలా కృషిచేశాడు. తరువాత 1983,[5] 1985,[6] 1989[7] లోనూ గెలిచాడు. 1990 జనవరి 4 నుంచి డిసెంబరు 22 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌గా పనిచేశాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కేబినెట్‌లో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశాడు. పారిశ్రామిక అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా కొనసాగాడు. 1999లో కాంగ్రెస్ నుంచి బయటకొచ్చాడు. 2004లో మెదక్ లోక్‌సభ స్థానానికి పోటీచేసి ఓడిపోయాడు.[8]
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ ఎస్సార్‌నగర్‌లోని స్వగృహంలో 2018 ఏప్రిల్ 28న కన్నుమూసాడు.
మూలాలు
[మార్చు]- ↑ Eenadu (15 November 2023). "చేజారిన సీఎం పదవి". Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
- ↑ మెదక్ జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు (రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 86)
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1962". www.elections.in. Archived from the original on 2018-04-14. Retrieved 2018-04-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1972". www.elections.in. Archived from the original on 2016-03-04. Retrieved 2018-04-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1983". www.elections.in. Archived from the original on 2016-03-03. Retrieved 2018-04-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1985". www.elections.in. Retrieved 2018-04-30.
- ↑ "Andhra Pradesh Assembly Election Results in 1989". www.elections.in. Retrieved 2018-04-30.
- ↑ "మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి కన్నుమూత -". www.andhrajyothy.com. Retrieved 2018-04-30.[permanent dead link]
- All articles with dead external links
- తెలంగాణ విమోచనోద్యమం
- తెలంగాణ విమోచనోద్యమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా వ్యక్తులు
- 1929 జననాలు
- 2018 మరణాలు
- భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు
- సంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు
- మొదటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సంగారెడ్డి జిల్లా వ్యక్తులు
- సంగారెడ్డి జిల్లాకు చెందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు
- సంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు