బద్దం ఎల్లారెడ్డి
బద్దం ఎల్లారెడ్డి (జ.1906, గాలిపల్లి గ్రామం,[1][2] మ. 1979[3]) తెలంగాణ రాష్ట్రానికి చెందిన భారతీయ కమ్యూనిష్టు నాయకుడు. ఆయన తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.
జీవిత విశేషాలు[మార్చు]
ఆయన కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం గాలిపల్లి గ్రామంలో 1906 లో జన్మించారు. ఆయన భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఆశయాలకు ప్రభావితుడైనాడు.[4] ఆయన 1930 నుంచి కమ్యూనిజం వైపు ఆకర్షితులైనారు.[5] 1938లో సత్యాగ్రాహానికి పూనుకున్నారు.[6] సాయుధ పోరాటంలో ఆయన జైలుకు కూడా వెళ్లారు.[7] 1939లో కమ్యూనిస్టు పార్టీ హైదరాబాదులో శాఖను ప్రారంభించగా దానిలో రావి నారాయణరెడ్డి లాంటి వారితో కలిసి బద్దం ఎల్లారెడ్డి పనిచేశారు.[5][8]
ఆంధ్ర మహాసభ, తెలంగాణ పోరాటం[మార్చు]
ఆయన 1941లో ఎల్లారెడ్డి ఆంధ్రమహాసభకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికోబడ్డారు. తెలంగాణ సాయుద పోరాటంలో కీలకపాత్ర వహించారు. తర్వాత రాజకీయాలలో చేరి లోకసభకు, రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యారు.
ఉద్యమాలు[మార్చు]
ఎల్లారెడ్డి విద్యార్థి దశలోనే పోరుబాట పట్టారు. 1930లో కాకినాడ ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని 7 మాసాలు జలి శిక్షకు గురయ్యారు. తెలంగాణ సాయుధ పోరాటం సమయంలో అగ్రనాయకులలో ముఖ్యులుగా మారారు. సాయుధ పోరాట కాలంలోనూ అరెస్ట్ అయి 3 సంవత్సరాలు జైలుశిక్ష అనుభవించారు.
రాజకీయ ప్రస్థానం[మార్చు]
యుక్తవయస్సు నుంచే కమ్యూనిజం వైపు ఆకర్షితుడైన ఎల్లారెడ్డి 1952లో పీపుల్స్ డెమొక్రటిక్ ప్రంట్ తరపున కరీంనగర్ లోకసభ నియోజకవర్గం నుంచి పి.వి.నరసింహరావుపై విజయం సాదించారు. 1956లో సిపిఐ కేంద్ర కార్యవర్గ సభ్యులయ్యారు. 1958లో బుగ్గారం అసెంబ్లీ నియోజకవర్గం:నుంచిaశాసనసభకు ఎన్నికయ్యారు. 1964లో రాజ్యసభకు ఎన్నికైనారు. 1972లో ఇందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికై శాసనసభలో రెండోసారి ప్రవేశించారు.
మరణం[మార్చు]
ఆయన 1978 డిసెంబరు 27న మరణించారు.
గుర్తింపులు[మార్చు]
కరీంనగర్లో ఆయన విగ్రహం 2006 లో ప్రతిష్టించబడింది
మూలాలు[మార్చు]
- ↑ The Hindu. `Projects will change face of Karimnagar'
- ↑ New Age. CPI Padayatra in Karimnagar Archived 2011-04-04 at the Wayback Machine
- ↑ Indian Institute of Applied Political Research. The Annual Register of Indian Political Parties, Volume 1991, Edition 2. New Delhi: Michiko & Panjathan [etc.], 1979. p. 500
- ↑ Narotham Reddy, K. Freedom Struggle in Erstwhile Nizam State: With Special Reference to Karimnagar District, 1920-1948 A.D. Hyderabad, A.P., India. p. 172
- ↑ 5.0 5.1 Ramakrishna Reddy, V. Economic History of Hyderabad State: Warangal Suba, 1911-1950. Delhi: Gian Pub. House, 1987. p. 709
- ↑ V.V. Giri National Labour Institute. Agrarian Structure, Movements & Peasant Organisations in India. Noida, Uttar Pradesh: V.V. Giri National Labour Institute, 2004. p. 118
- ↑ Innaiah, N. Politics for Power: The Role of Caste and Factions in Andhra Pradesh, 1880-1980. Hyderabad [India] (1-1-180/15, Chaminar X-Roads, Hyderabad-500020): Scientific Services, 1981. p. 74
- ↑ New Age. Remembering Ravi Narayana Reddy Archived 2012-03-25 at the Wayback Machine
ఇతర లింకులు[మార్చు]
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- తెలంగాణ సాయుధ పోరాట యోధులు
- 1906 జననాలు
- 1979 మరణాలు
- 1వ లోక్‌సభ సభ్యులు
- 2వ లోక్‌సభ సభ్యులు
- 5వ లోక్‌సభ సభ్యులు
- జగిత్యాల జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు
- రాజన్న సిరిసిల్ల జిల్లా రాజకీయ నాయకులు
- కరీంనగర్ జిల్లా (సంయుక్త ఆంధ్రప్రదేశ్) నుండి ఎన్నికైన లోక్‌సభ సభ్యులు
- రాజన్న సిరిసిల్ల జిల్లా స్వాతంత్ర్య సమర యోధులు