ఎం.ఆర్. కృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.ఆర్. కృష్ణ
పార్లమెంట్ సభ్యుడు
In office
1962 – 1967, 1967 - 1971
తరువాత వారువి. తులసీరామ్
నియోజకవర్గంపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం
పార్లమెంట్ సభ్యుడు
In office
1952 – 1957, 1957 - 1962
అంతకు ముందు వారుబద్దం ఎల్లారెడ్డి
తరువాత వారుఎం. శ్రీరంగారావు
నియోజకవర్గంకరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం1924
తిరుమలగిరి, హైదరాబాదు జిల్లా, తెలంగాణ
మరణం2004, మే 12
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీషెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్.సి.ఎఫ్.)
భారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిసరస్వతీ బాయి
సంతానం1 కుమారుడు, 1 కుమార్తె
తల్లిదండ్రులుకంగస్వామి

ఎం.ఆర్. కృష్ణ (జ. 1924) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు.[1] కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 1976 నుండి 1982 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నాడు.

జననం

[మార్చు]

కృష్ణ 1924లో తెలంగాణ రాష్ట్రం, హైదరాబాదులోని తిరుమలగిరిలో జన్మించాడు. తండ్రపేరు కంగస్వామి. కృష్ణ కొంతకాలం వ్యవసాయం, వ్యాపారం చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

కృష్ణకు సరస్వతీ బాయితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.

రాజకీయ జీవితం

[మార్చు]

బి.ఆర్ అంబేద్కర్కు చెందిన షెడ్యూల్డ్ కాస్ట్స్ ఫెడరేషన్ (ఎస్.సి.ఎఫ్.) రాజకీయ పార్టీలో పనిచేశాడు. తరువాత రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీలోకి మారాడు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. రజాకార్ల పాలనలో సాయుధ పోలీసులకు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ యువకులను నియమించడం ద్వారా భారత ప్రభుత్వానికి సహాయం చేశాడు. రజాకార్ల పాలనను కూలదోయడానికి సమావేశాలు నిర్వహించినందుకు అరెస్టు చేయబడ్డాడు.

కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 1వ లోక్‌సభకు (1952-1957),[2] 2వ లోక్‌సభకు (1957-1962)[3] ఎన్నికయ్యాడు. తరువాత పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గం నుండి 3వ లోక్‌సభకు (1962-1967),[4] 4వ లోక్‌సభకు (1967-1971)[5] ఎన్నికయ్యాడు.[6] 1967 నవంబరు నుండి 1970 జూన్ నెల వరకు కేంద్ర రక్షణ శాఖ డిప్యూటీ మంత్రిగా, 1970 1971 జూన్ మార్చి వరకు పారిశ్రామిక అభివృద్ధి, అంతర్గత వాణిజ్య డిప్యూటి మంత్రిగా పనిచేసాడు.

నిర్వహించిన పదవులు

[మార్చు]
  • నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ చైర్మన్
  • ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ స్పోర్ట్స్ సభ్యుడు
  • 1962లో విద్యాశాఖ మంత్రికి పార్లమెంటరీ కార్యదర్శి
  • అంచనాల కమిటీ సభ్యుడు
  • పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడు
  • ఆల్ ఇండియా స్టేట్స్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి

ఇతర వివరాలు

[మార్చు]

మరణం

[మార్చు]

కృష్ణ 2004, మే 12న హైదరాబాదులో మరణించాడు.[7]

మూలాలు

[మార్చు]
  1. "Shri M.R. Krishna MP biodata Peddapalli-SC | ENTRANCEINDIA". www.entranceindia.com (in అమెరికన్ ఇంగ్లీష్). 2018-12-26. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.
  2. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-10. Retrieved 2021-11-22.
  3. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-09. Retrieved 2021-11-22.
  4. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-19. Retrieved 2021-11-22.
  5. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-05. Retrieved 2021-11-22.
  6. "Lok Sabha Members Bioprofile-". Retrieved 19 December 2017.
  7. "LOK SABHA DEBATES". www.indiankanoon.org. Archived from the original on 2021-11-22. Retrieved 2021-11-22.