ఎం. శ్రీరంగారావు
Jump to navigation
Jump to search
ఎం. శ్రీరంగారావు | |
---|---|
పార్లమెంట్ సభ్యుడు | |
In office 1957 - 1962 | |
అంతకు ముందు వారు | బద్దం ఎల్లారెడ్డి |
తరువాత వారు | జె. రమాపతిరావు |
నియోజకవర్గం | కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం |
In office = | |
వ్యక్తిగత వివరాలు | |
జననం | 1918, ఆగస్టు 14 అంతర్గావ్, , జగిత్యాల మండలం, జగిత్యాల జిల్లా, తెలంగాణ |
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ |
జీవిత భాగస్వామి | రాధమ్మ |
తల్లిదండ్రులు | ధర్మారావు |
ఎం. శ్రీరంగారావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. 1957లో 2వ లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.
జననం, విద్య
[మార్చు]శ్రీరంగారావు 1918, ఆగస్టు 14న తెలంగాణ రాష్ట్రం, జగిత్యాల జిల్లా, జగిత్యాల మండలం, అంతర్గావ్ గ్రామంలో జన్మించాడు. తండ్రిపేరు ధర్మారావు. శ్రీరంగారావు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సీ, న్యాయవిద్యను చదివాడు.[1]
వ్యక్తిగత జీవితం
[మార్చు]శ్రీరంగారావుకు 1943, మే 15న రాధమ్మతో వివాహం జరిగింది. 1943 మే 15;
రాజకీయ జీవితం
[మార్చు]భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి 2వ లోక్‌సభకు (1957-1962) పోటిచేసి పి.డి.ఎఫ్. పార్టీ అభ్యర్థి బద్దం ఎల్లారెడ్డిపై 10,127 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2]
ఎన్నిక వివరాలు:
- మొత్తం ఓటర్లు: 7,48,201 (ద్వంద్వ-సభ్య నియోజకవర్గం)
- ఎం. శ్రీ రంగారావు.. 1,41,680
- బద్దం ఎల్లారెడ్డి .. 1,31,553
- గోపాల్ రావు .. 71,341
- శ్రీపతి సాయిరెడ్డి .. 56,225
నిర్వర్తించిన పదవులు
[మార్చు]- కరువు సహాయక చర్యలు (1938-39)
- కార్యదర్శి, తాలూకా కాంగ్రెస్ కమిటీ (1951-54)
- అధ్యక్షుడు, తాలూకా కమిటీ (1954-57)
- కార్యదర్శి, తాలూకా వ్యవసాయ సహకార సంఘం (1954-57)
- సభ్యుడు, తాలూకా అద్దె కమిషన్ (1954-56)
మూలాలు
[మార్చు]- ↑ "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-11-23. Retrieved 2021-11-23.
- ↑ "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-10-09. Retrieved 2021-11-22.