వి. తులసీరామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వి. తులసీరామ్

మాజీ లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
1985 - 1989
ముందు ఏ.ఆర్.మల్లు
తరువాత ఏ.ఆర్.మల్లు
నియోజకవర్గం పెద్దపల్లి నియోజకవర్గం & నాగర్‌కర్నూల్ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 2 అక్టోబర్ 1938
శివరాంపల్లి , రంగారెడ్డి జిల్లా
మరణం 16 ఏప్రిల్ 2020
శివరాంపల్లి , రంగారెడ్డి జిల్లా
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ , తెలంగాణ ప్రజా సమితి
తల్లిదండ్రులు నారాయణస్వామి
జీవిత భాగస్వామి భారతి దేవి
సంతానం 3 కుమార్తెలు, 2 కుమారులు

వి. తులసీరామ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు మాజీ ఎంపీ. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్దపల్లి & నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.

జననం[మార్చు]

వి. తులసీరామ్ 2 అక్టోబర్ 1938లో తెలంగాణ రాష్ట్రం, రంగారెడ్డి జిల్లా , శివరాంపల్లి గ్రామంలో జన్మించాడు.

రాజకీయ ప్రస్థానం[మార్చు]

వి. తులసీరామ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1959 నుంచి 1971 వరకు కాటేదాన్ సర్పంచ్‌గా, రాజేంద్రనగర్ పంచాయితీ సమితి ప్రెసిడెంట్‌గా పని చేశాడు. ఆయన తెలంగాణ ఉద్యమ సమయంలో 1971లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజా సమితి తరపున పెద్దపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి పార్లమెంటుకు తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యాడు.

వి. తులసీరామ్ 1977లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యాడు. ఎన్‌టీ రామారావు 1982లో స్థాపించిన తెలుగుదేశం పార్టీ లో చేరి 1985లో టీడీపీ తరపున నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచాడు. ఆయన తరువాత రంగారెడ్డి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కూడా పని చేశాడు.

మరణం[మార్చు]

వి. తులసీరామ్ అనారోగ్యంతో బాధపడుతూ 16 ఏప్రిల్ 2021న రంగారెడ్డి జిల్లా, శివరాంపల్లి లోని తన స్వగృహంలో మరణించాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు (వీటి ప్రకాష్, వీటి విజయ్ కుమార్),[1] ముగ్గురు కూతుళ్లు ఉన్నారు.[2][3][4]

మూలాలు[మార్చు]

  1. V6 Velugu (26 August 2022). "బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త విజయ్ కుమార్". Archived from the original on 27 August 2022. Retrieved 27 August 2022.
  2. Nava Telangana (16 April 2020). "మాజీ ఎంపీ వి.తులసీరామ్ మృతి". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
  3. Andrajyothy (16 April 2020). "మాజీ ఎంపీ తులసీరామ్ సేవలను గుర్తు చేసుకున్న కొండా విశ్వేశ్వర్ రెడ్డి". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.
  4. The New Indian Express (16 April 2020). "Former MP Tulasiram passes away". Archived from the original on 31 July 2021. Retrieved 31 July 2021.