నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం
తెలంగాణ లోని 17 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 శాసనసభ నియోజకవర్గములు ఉన్నాయి. నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం ఇది ఎస్సీలకు రిజర్వ్ చేయబడింది. పునర్విభజన ప్రకారము ఈ నియోజకవర్గంలో కొత్తగా వనపర్తి, గద్వాల శాసనసభ నియోజకవర్గములు వచ్చిచేరాయి. పునర్విభజనకు పూర్వమున్న జడ్చర్ల, షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గములు మహబూబ్ నగర్ లోక్‌సభ నియోజకవర్గానికి, పరిగి శాసనసభ నియోజకవర్గము చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గానికి తరలిమ్చబడింది.
దీని పరిధిలోని శాసనసభ నియోజకవర్గములు[మార్చు]
- వనపర్తి అసెంబ్లీ నియోజక వర్గం
- గద్వాల అసెంబ్లీ నియోజక వర్గం
- ఆలంపూర్ అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- నాగర్‌కర్నూల్ అసెంబ్లీ నియోజక వర్గం
- అచ్చంపేట అసెంబ్లీ నియోజక వర్గం (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
- కల్వకుర్తి అసెంబ్లీ నియోజక వర్గం
- కొల్లాపూర్ అసెంబ్లీ నియోజక వర్గం
నియోజకవర్గపు గణాంకాలు[మార్చు]
- 2001 లెక్కల ప్రకారము జనాభా: 17,72,086.
- ఓటర్ల సంఖ్య: 14,54,517.
- ఎస్సీ, ఎస్టీల శాతం: 19.04%, 8.16%
నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు[మార్చు]
లోక్‌సభ కాలము గెలిచిన అభ్యర్థి పార్టీ నాల్గవ 1967-71 జె.బి. ముత్యాలరావు భారత జాతీయ కాంగ్రెస్ ఐదవ 1971-77 ఎం. భీష్మదేవ్ తెలంగాణా ప్రజాసమితి ఆరవ 1977-80 ఎం. భీష్మదేవ్ భారత జాతీయ కాంగ్రెస్ ఏడవ 1980-84 మల్లు అనంత రాములు భారత జాతీయ కాంగ్రెస్ ఎనిమిదవ 1984-89 వి. తులసీరామ్ తెలుగుదేశం పార్టీ తొమ్మిదవ 1989-91 మల్లు అనంత రాములు భారత జాతీయ కాంగ్రెస్ పదవ 1991-96 మల్లు రవి భారత జాతీయ కాంగ్రెస్ పదకొండవ 1996-98 మంద జగన్నాథం తెలుగుదేశం పార్టీ పన్నెండవ 1998-99 మల్లు రవి భారత జాతీయ కాంగ్రెస్ పదమూడవ 1999-04 మంద జగన్నాథం తెలుగుదేశం పార్టీ పదునాల్గవ 2004-09 మంద జగన్నాథం తెలుగుదేశం పార్టీ 15వ లోక్‌సభ 2009-2014 మంద జగన్నాథం కాంగ్రెస్ పార్టీ 16వ లోక్‌సభ 2014-2019 నంది ఎల్లయ్య కాంగ్రెస్ పార్టీ 17వ లోక్‌సభ 2019- ప్రస్తుతం పి.రాములు తెలంగాణ రాష్ట్ర సమితి
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికల ఫలితాలను తెలిపే "పై" చిత్రం
2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి చెందిన అభ్యర్థి మంద జగన్నాథ్ తన సమీప ప్రత్యర్థి ఇండెపెండెంట్ అభ్యర్థి అయిన కె.ఎస్.రత్నంపై 99650 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు.
భారత సాధారణ ఎన్నికలు,2004:నాగర్ కర్నూలు | |||||
---|---|---|---|---|---|
పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
తెలుగుదేశం పార్టీ | మందా జగన్నాథం | 405,046 | 45.85 | -7.26 | |
Independent | కె.ఎస్.రత్నం | 305,396 | 34.57 | ||
Independent | పి.భగవంతు | 119,813 | 13.56 | ||
బహుజన సమాజ్ పార్టీ | పి.లాలయ్య | 27,247 | 3.08 | ||
Independent | డా.జి.రాఘవులు | 25,848 | 2.93 | ||
మెజారిటీ | 99,650 | 11.28 | +3.04 | ||
మొత్తం పోలైన ఓట్లు | 883,350 | 68.16 | -1.36 | ||
తె.దే.పా గెలుపు | మార్పు | -7.26 |
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో మహాకూటమి తరఫున తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన గువ్వల బాలరాజు పోటీ చేయగా[1] భారతీయ జనతా పార్టీ తరఫున టి.రత్నాకర్[2] కాంగ్రెస్ పార్టీ టికెట్టు 2004లో తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే స్థానం నుండి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన మంద జగన్నాథం[3] ప్రజారాజ్యం పార్టీ తరఫున డిసతీష్ మాదిగ[4] పోటీచేశారు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన మంద జగన్నాథం తన సమీప ప్రత్యర్థి, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన గువ్వల బాలరాజ్ పై 47,767 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినాడు.
2019 ఎన్నికలు[మార్చు]
2019 ఎన్నికల్లో తెరాసకు చెందిన పి.రాములు గెలుపొందాఅడు.
నియోజకవర్గంనుంచి గెలిచిన ప్రముఖులు[మార్చు]
- మల్లు రవి
- ప్రస్తుతం జడ్చర్ల శాసనసభ్యుడిగా ఉన్న మల్లురవి గతంలో రెండు సార్లు ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందినాడు. ఇతడు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకుడు.
- మంద జగన్నాథం
- తెలుగుదేశం తరఫున మూడు సార్లు విజయం సాధించిన మంద జగన్నాథం ఇటీవల మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానం సందర్భంగా పార్టీ విప్‌ను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటువేసి తెలుగుదేశం పార్టీ నుండి బహిష్కృతుడైనాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 2009 ఎన్నికలలో మళ్ళీ నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచే కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో ఉన్నాడు.