జె.బి. ముత్యాలరావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జె.బి. ముత్యాలరావు
జె.బి. ముత్యాలరావు
మాజీ పార్లమెంట్ సభ్యుడు
In office
1962-1967, 1971-1977
అంతకు ముందు వారుపులి రామస్వామి
తరువాత వారుజానంపల్లి రామేశ్వరరావు
నియోజకవర్గంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం
మాజీ శాసన సభ్యుడు
In office
1957-1962
నియోజకవర్గంగజ్వేల్ శాసనసభ నియోజవర్గం
మాజీ పార్లమెంట్ సభ్యుడు
In office
1967-1971
తరువాత వారుఎం. భీష్మదేవ్
నియోజకవర్గంనాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1921-08-15)1921 ఆగస్టు 15
సికింద్రాబాదు, తెలంగాణ
మరణం2000 జూలై 26(2000-07-26) (వయసు 78)
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిఅన్నమ్మ
సంతానంనలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.

జె.బి. ముత్యాలరావు తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు. గజ్వేల్ శాసనసభ నియోజవర్గం నుండి 1957 నుండి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్య[మార్చు]

ముత్యాలరావు 1921, ఆగస్టు 15న తెలంగాణ రాష్ట్రం, సికింద్రాబాదులోని తిరుమలగిరిలో జన్మించాడు. తండ్రిపేరు బాబురావు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

ముత్యాలరావుకు 1943, మార్చి 23న అన్నమ్మతో వివాహం జరిగింది. వారికి నలుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు.

ఉద్యమ జీవితం[మార్చు]

నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆర్యసమాజ్ ప్రారంభించిన ఆందోళనలో పాల్గొన్నందుకు 1938లో జైలు శిక్ష అనుభవించాడు. 1947లో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ప్రారంభించిన నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొన్నాడు.

రాజకీయ జీవితం[మార్చు]

1952 నుండి 1957 వరకు హైదరాబాద్ రాష్ట్ర శాసనసభ సభ్యుడిగా, 1957 నుండి 1962 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడిగా పనిచేశాడు. 1952 నుండి 1961 వరకు హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ విప్ గా పనిచేశాడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1962 నుండి 1967 వరకు 3వ లోక్‌సభకు[2] మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి, 1967 నుండి 1971 వరకు 4వ లోక్‌సభకు[3] నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి, 1971 నుండి 1977 వరకు 5వ లోక్‌సభకు[4] మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు. మూడవ లోక్‌సభలో 1962 నుండి 1967 వరకు ప్రభుత్వ డిప్యూటీ చీఫ్ గా, 1967లో పార్లమెంటరీ వ్యవహారాల డిప్యూటీ మంత్రిగా పనిచేశాడు.[5] 1969 వరకు వివిధ ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోలను నిర్వర్తించాడు.

నిర్వర్తించిన ఇతర పదవులు[మార్చు]

  • బొల్లారం టౌన్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు (1948)
  • సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి (1953—1955)
  • సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ వ్యవస్థాపక సభ్యుడు
  • ఆల్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ సభ్యుడు (1948)
  • ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యుడు (1957)
  • సికింద్రాబాదు సివిక్ బోర్డ్ సభ్యుడు
  • 1958 నుండి ఉస్మానియా యూనివర్సిటీ సెనేట్ సభ్యుడు
  • 1962లో ఐక్యరాజ్య సమితికి భారత ప్రతినిధి బృందం సభ్యుడు

మరణం[మార్చు]

ముత్యాలరావు తన 79 ఏళ్ళ వయసులో 2000, జూలై 26న హైదరాబాదులో మరణించాడు.[6]

మూలాలు[మార్చు]

  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2021-12-05. Retrieved 2021-12-05.
  2. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-24. Retrieved 2021-12-05.
  3. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-23. Retrieved 2021-12-05.
  4. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-22. Retrieved 2021-12-05.
  5. "JB MuthyalaRao" (PDF). www.cabsec.gov.in. Archived (PDF) from the original on 2021-09-16. Retrieved 2021-12-05.
  6. "Lok Sabha Debates". www.indiankanoon.org. Archived from the original on 2021-12-05. Retrieved 2021-12-05.