ఎం. భీష్మదేవ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం. భీష్మదేవ్
ఎం. భీష్మదేవ్
మాజీ పార్లమెంట్ సభ్యుడు
In office
1971-1980
అంతకు ముందు వారుజె.బి. ముత్యాలరావు
తరువాత వారుమల్లు అనంత రాములు
నియోజకవర్గంనాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం
వ్యక్తిగత వివరాలు
జననం(1928-01-28)1928 జనవరి 28
హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిగాయత్రీ దేవి
సంతానంఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు
కళాశాలపంజాబ్ విశ్వవిద్యాలయం

ఎం. భీష్మదేవ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, మాజీ పార్లమెంట్ సభ్యుడు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున నాగర్ కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి వరుసగా రెండుసార్లు (1971 నుండి 1980 వరకు) పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1]

జననం, విద్య

[మార్చు]

భీష్మదేవ్ 1928, జనవరి 28న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో జన్మించాడు. తండ్రిపేరు సర్వయ్య. పంజాబ్ విశ్వవిద్యాలయంలో చదివాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

భీష్మదేవ్ కు 1959 జూన్ నెలలో గాయత్రీ దేవితో వివాహం జరిగింది. వారికి ఐదుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు.

ఉద్యమ జీవితం

[మార్చు]

1942 నుండి కాంగ్రెస్‌ పార్టీతో అనుబంధమున్న భీష్మదేవ్ 1942 భారత స్వాతంత్ర్య పోరాటంలో, 1948 నిజాం పాలనకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 1957లో పంజాబ్ హిందీ అనవోలన్‌లో పాల్గొని మూడు నెలల శిక్ష అనుభవించాడు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఐదు నెలలపాటు జైలు శిక్ష అనుభవించాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

1960 నుండి 1970 వరకు హైదరాబాదు మున్సిపల్ కౌన్సిలర్గా పనిచేశాడు. 1971లో తెలంగాణ ప్రజా సమితి పార్టీ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి భారత జాతీయ కాంగ్రెస్ అభ్యర్థి పి. మహేంద్రనాథ్ పై 45,400 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2][3] 1977లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం స్థానం నుండి పోటిచేసి భారతీయ లోక్‌దళ్ అభ్యర్థి పుట్టపాగ రాధకృష్ణపై 122763 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[4][5]

నిర్వర్తించిన పదవులు

[మార్చు]
  • గవదన్ బోధ్ వచనాలయ చైర్మన్
  • ఓల్డ్ సిటీ డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్ చైర్మన్
  • శాస్త్రిపూర్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్
  • నవభారత్ యువజన సంఘం అధ్యక్షుడు
  • ఆంధ్రప్రదేశ్ దళిత జాతి సంఘం కోశాధికారి
  • హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ సభ్యుడు
  • వర్క్స్ ఆక్ట్రాయ్ కమిటీ డిప్యూటీ చైర్మన్
  • ఆల్-ఇండియా కాంగ్రెస్ కమిటీకి ప్రతినిధి (1971-1977)

మూలాలు

[మార్చు]
  1. "Members Bioprofile". loksabhaph.nic.in. Archived from the original on 2020-11-29. Retrieved 2021-12-04.
  2. "5th Lok Sabha elections 1971 Jammu and Kashmir: Full winners list". NewsX (in ఇంగ్లీష్). 2019-05-23. Archived from the original on 2021-12-04. Retrieved 2021-12-04.
  3. "Members : Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-22. Retrieved 2021-12-04.
  4. "Nagarkurnool Lok Sabha Election Result - Parliamentary Constituency". resultuniversity.com. Retrieved 2021-12-03.
  5. "Members : 6th Lok Sabha". loksabha.nic.in. Archived from the original on 2021-11-22. Retrieved 2021-12-04.