సంభాని చంద్రశేఖర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సంభాని చంద్రశేఖర్

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
1985 - 1989 1989 - 1994
1999 - 2004
2004 - 2009
నియోజకవర్గం పాలేరు నియోజకవర్గం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2004 - 2009

వ్యక్తిగత వివరాలు

జననం 1960
ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ
తల్లిదండ్రులు జగన్నాధం
జీవిత భాగస్వామి శబరి రాణి
సంతానం పూజ, ఇంద్రజ

సంభాని చంద్రశేఖర్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా,రెండు సార్లు మంత్రిగా పని చేశాడు. 1989 నుండి 1994 వరకు మరిఘు 2004 నుండి 2009 వరకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశాడు.

రాజకీయ జీవితం

[మార్చు]

సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1983లో పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాయడు. అయన 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా పని చేశాడు. సంభాని చంద్రశేఖర్ 26 జూన్ 2021లో తెలంగాణ పీసీసీ ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యాడు.[1]

సంభాని చంద్రశేఖర్ 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో పాలేరు టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఆయనను ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర కలిసి బీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించగా, ఆయన 2023నవంబర్ 10న ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2]

సంవత్సరం నియోజకవర్గం గెలిచిన అభ్యర్థి పార్టీ ప్రత్యర్థి పార్టీ
1983 పాలేరు నియోజకవర్గం భీమపాక భూపతిరావు సీపీఐ సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ
1985 పాలేరు నియోజకవర్గం బాజీ హన్మంతు సీపీఎం సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ
1989 పాలేరు నియోజకవర్గం సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బాజీ హన్మంతు సీపీఎం
1994 పాలేరు నియోజకవర్గం సండ్ర వెంకటవీరయ్య సీపీఎం సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ
1999 పాలేరు నియోజకవర్గం సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ సండ్ర వెంకటవీరయ్య సీపీఎం
2004 పాలేరు నియోజకవర్గం సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ
2009 సత్తుపల్లి నియోజకవర్గం సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ
2014 సత్తుపల్లి నియోజకవర్గం సండ్ర వెంకటవీరయ్య తెలుగుదేశం పార్టీ సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (26 June 2021). "టీపీసీసీ అధ్య‌క్షుడిగా రేవంత్ రెడ్డి నియామ‌కం". Namasthe Telangana. Archived from the original on 26 June 2021. Retrieved 26 June 2021.
  2. Eenadu (10 November 2023). "సీఎం కేసీఆర్‌ సమక్షంలో.. భారాసలో చేరిన కాంగ్రెస్‌ నేతలు". Archived from the original on 10 November 2023. Retrieved 10 November 2023.