సండ్ర వెంకటవీరయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సండ్ర వెంకటవీరయ్య
సండ్ర వెంకటవీరయ్య


పదవీ కాలం
1994-1999, 2009 - 2023 డిసెంబర్ 03
ముందు జలగం వెంకటరావు
తరువాత మట్టా రాగమయి
నియోజకవర్గం సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1968-08-15) 1968 ఆగస్టు 15 (వయసు 55)
రాజుపేట, కుసుమంచి మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత్ రాష్ట్ర సమితి
తల్లిదండ్రులు బిక్షం - లక్ష్మి
జీవిత భాగస్వామి మహాలక్ష్మి
సంతానం ఇద్దరు కుమారులు

సండ్ర వెంకటవీరయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ తరపున సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1] మొదటిసారి సి.పి.ఎం. తరపున శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు. తరువాత తెలుగుదేశం పార్టీ నుంచే వ‌రుస‌గా మూడుసార్లు శాసనసభ్యునిగా విజ‌యం సాధించాడు. 2018లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు.[2]

జననం, విద్య[మార్చు]

వెంటకవీరయ్య 1968, ఆగస్టు 15న బిక్షం - లక్ష్మి దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో జన్మించాడు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు.

వ్యక్తిగత జీవితం[మార్చు]

వెంకటవీరయ్యకు మహాలక్ష్మితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాజకీయ జీవితం[మార్చు]

  • అతను 1994లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు నియోజకవర్గం నుండి సి.పి.ఎం అభ్యర్థిగా గెలుపొందాడు.[3]
  • 1999లో అతను పాలేరు నియోజకవర్గంలో సి.పి.ఎం పార్టీ ఇన్‌ఛార్జ్ గా భాద్యతలు చేపట్టాడు.
  • 2004లో పాలేరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఇన్‌చార్జ్ గా వ్యవహరించాడు.
  • వీరు ఖమ్మం జిల్లాకి చెందిన సత్తుపల్లి శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి 2009 అసెంబ్లీ ఎన్నికలలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[4]
  • 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి పోటీచేసి శాసనసభ్యునిగా ఎన్నికయ్యాడు.[5][6]
  • అతను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా మూడు సార్లు ఎన్నికయ్యాడు (2016, 2017, 2018).[7][8]
  • అతను 2018లో జాతీయ తెలుగుదేశం పార్టీకి ఉపాధ్యక్షునిగా ఉన్నాడు.
  • అతను 2018లో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా సత్తుపల్లి నియోజకవర్గం నుండి ఎన్నికయినా[6] తరువాత తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలోకి చేరాడు.
  • ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఏసీ) సభ్యుడిగా ఉన్నాడు.[9]

ఇతర విషయాలు[మార్చు]

చైనా, మలేషియా, సింగపూర్, దక్షిణ కొరియా, థాయిలాండ్ దేశాలు సందర్శించాడు.

ఎన్నికల చరిత్ర[మార్చు]

ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు % ప్రత్యర్థి పార్టీ ఓట్లు % ఫలితం
1994 ఆంధ్రప్రదేశ్ శాసనసభ పాలేరు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్టు) 63,328 సంభాని చంద్రశేఖర్ భారత జాతీయ కాంగ్రెస్ 53,172 గెలుపు
1999 40,380 51,638 ఓటమి
2004 తెలుగుదేశం పార్టీ 54,500 78,422 ఓటమి
2009 సత్తుపల్లి 79491 65,483 గెలుపు
2014 తెలంగాణ శాసనసభ 74,776 పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్ర సమితి 72,434 గెలుపు
2018 100,044 పిడమర్తి రవి తెలంగాణ రాష్ట్ర సమితి 81,042 గెలుపు

మూలాలు[మార్చు]

  1. Telangana Legislature (2018). "Member's Profile - Telangana-Legislature". Archived from the original on 13 జూలై 2021. Retrieved 13 July 2021.
  2. Batchali, Ravi (2020-06-05). "మంత్రి ప‌ద‌విపై ఆశ‌తో పార్టీ మారినా ఆ క‌ల నెర‌వేర‌లేదే?". తెలుగు పోస్ట్. Archived from the original on 2020-12-12. Retrieved 2020-06-06.
  3. "Andhra Pradesh Assembly Election Results in 1994". Elections in India. Archived from the original on 2021-11-07. Retrieved 2020-06-06.
  4. "Andhra Pradesh Assembly Election Results in 2009". Elections in India. Archived from the original on 2020-02-02. Retrieved 2020-06-06.
  5. Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
  6. 6.0 6.1 "Sathupalli Election Result 2018 Updates: Candidate List, Winner, Runner-up MLA List". Elections in India. Archived from the original on 2020-06-06. Retrieved 2020-06-06.
  7. Sakshi (28 April 2015). "ఫలించిన కల". Archived from the original on 9 జనవరి 2022. Retrieved 9 January 2022.
  8. Sakshi (20 April 2018). "తితిదే బోర్డు మెంబర్ల నియామకం." Archived from the original on 13 February 2022. Retrieved 13 February 2022.
  9. Sakshi (22 September 2019). "తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ". Archived from the original on 15 జూలై 2021. Retrieved 15 July 2021.