మరికంటి భవాని రెడ్డి
మరికంటి భవాని రెడ్డి | |
---|---|
జననం | నాగిరెడ్డిపల్లె, సిద్దిపేట జిల్లా తెలంగాణ |
నివాస ప్రాంతం | హైదరాబాద్ |
వృత్తి | రాయకీయ నాయకురాలు సామాజిక కార్యకర్త |
భార్య / భర్త | మరికంటి హన్మంత్ రెడ్డి |
మరికంటి భవాని రెడ్డి, తెలంగాణకు చెందిన రాయకీయ నాయకురాలు, సామాజిక కార్యకర్త.[1] ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.[2]
జననం, విద్య
[మార్చు]తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా నాగిరెడ్డిపల్లె గ్రామంలో భవాని రెడ్డి జన్మించారు. సిద్ధిపేటలోని సెయింట్ జాన్ పాఠశాలలో పదవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ లో ఆటోమొబైల్ డిప్లొమా పూర్తి అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తిచేశారు. ఆ తరువాత ఆర్టీసిలో మొదటి మహిళా సూపర్వైజర్ గా, ఆస్ట్రేలియాలో ఇంజనీర్ గా ఉద్యోగం చేశారు.[1]
కుంటుబం
[మార్చు]మరికంటి హనుమంత్ రెడ్డితో వివాహం జరిగింది. ఇద్దరు పిల్లలు (శ్రీ మిత్ర, శ్రీకృతి).
ఉద్యోగ జీవితం
[మార్చు]డిప్లమా పూర్తి చేసిన తరువాత ఆర్టీసీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఉద్యోగ సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆటోమొబైల్ కోర్స్ లో తొలి విద్యార్థినిగా గుర్తింపు పొందడంతోపాటు సిద్దిపేట ఆర్టీసి డిపోలో తొలి మహిళా ఛార్జ్మన్ గా ప్రత్యేక గుర్తింపు పొందారు.[1]
తెలంగాణ ఉద్యమం
[మార్చు]ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో భర్త హన్మంత్ రెడ్డితో కలిసి తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు విస్తృతంగా ప్రపంచానికి చాటారు. బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించి అక్కడ తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేశారు. ఉద్యమ నేపథ్యంలో జరిగిన సాగరహారం మిలియన్ మార్చ్, ఛలో అసెంబ్లీ లాంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
రాజకీయ జీవితం
[మార్చు]తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన మహిళా ఉద్యమ నేతగా రాజకీయ అరంగేట్రం చేసి అనతికాలంలోనే ఉన్నత పదవులు సాధించారు. 2014 టిఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో తెలంగాణ డెవలప్‌మెంట్ ఫోరమ్ నుండి కమిటీ సభ్యులుగా వున్నారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో భవాని రెడ్డి 2018లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిద్ధిపేట శాసనసభ నియోజకవర్గం నుంచి తెలంగాణ జన సమితి - కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి, 12900 ఓట్లతో రెండో స్థానంలో నిలిచారు.[3] అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి రాష్ట్ర అధికార ప్రతినిధి గా విశేష సేవలందిస్తూ ఉన్నారు.
సామాజిక కార్యక్రమాలు
[మార్చు]అట్టడుగు వర్గాల ప్రజలకు విస్తృతంగా సేవలు అందించాలనే సంకల్పంతో సేవా కార్యక్రమాలు చేపడుతూ అనేక మందికి తన వంతు సేవలు అందించారు. తాను పుట్టి పెరిగిన గ్రామంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ తన వంతు చేయూతనిస్తున్నారు.[1]
సాహిత్య, క్రీడారంగం
[మార్చు]విద్యార్థి దశలో పాఠశాలలో నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో పాల్గొని బహుమతులు సాధించారు. బ్లూమింగ్ బర్డ్స్ మ్యాగజిన్ కవితలు రాసి తన సాహితీ పటిమను చాటుకున్నారు. ఇండోర్ గేమ్స్, వాలీబాల్, కబడ్డీ లాంటి క్రీడల్లో ఛాంపియన్ గా నిలిచారు. రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి పోటీలలో పాల్గొని ఉత్తమ క్రీడాకారిణిగా గుర్తింపు పొందారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 1.3 1.4 భవాని బాట, నమస్తే తెలంగాణ జిందగీ, 2013 అక్టోబరు 1.
- ↑ Correspondent, D. C. (2023-06-23). "PCC Official Spokespersons and Media Coordinators List". www.deccanchronicle.com (in ఇంగ్లీష్). Archived from the original on 2024-01-27. Retrieved 2024-01-27.
- ↑ "టీజేఎస్ అభ్యర్థులు ఖరారు". www.andhrabhoomi.net. 2018-12-18. Archived from the original on 2024-01-27. Retrieved 2024-01-27.