తెలంగాణ సంస్కృతి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలంగాణ - Telangana
Map of India with the location of తెలంగాణ - Telangana highlighted.
Map of India with the location of తెలంగాణ - Telangana highlighted.
రాజధాని
 - అక్షాంశరేఖాంశాలు
హైదరాబాదు
 - 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
పెద్ద నగరం హైదరాబాదు
జనాభా (2011)
 - జనసాంద్రత
3,52,88,768 [1] (?)
 - 307/చ.కి.మీ
విస్తీర్ణం
 - జిల్లాలు
114840 చ.కి.మీ (?)
 - 33
సమయ ప్రాంతం IST (UTC యుటిసి+5:30)
అవతరణ
 - [[తెలంగాణ - Telangana |గవర్నరు
 - [[తెలంగాణ - Telangana |ముఖ్యమంత్రి
 - చట్టసభలు (సీట్లు)
జూన్ 2, 2014
 - ఏక్కాడు శ్రీనివాసన్ లక్ష్మీ నరసింహన్
 - కల్వకుంట్ల చంద్రశేఖరరావు
 - శాసనసభ (119)
అధికార బాష (లు) తెలుగు - ఉర్దూ
పొడిపదం (ISO) IN-TS
వెబ్‌సైటు: www.telangana.gov.in

తెలంగాణ - Telangana రాజముద్ర

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు

[మార్చు]

భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఒకటి తెలంగాణ. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా కొద్దికాలం స్వతంత్ర రాజ్యాలుగా కొనసాగిన వాటిలో హైదరాబాద్ ఒకటి. నిజాం పాలన నుంచి 1948 సెప్టెంబరు 17న విముక్తి చెంది హైదరాబాదు రాష్ట్రంగా ఏర్పడి, 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా కన్నడ, మరాఠి మాట్లాడే ప్రాంతాలు కర్ణాటక, మహారాష్ట్రలకు వెళ్ళిపోగా, తెలుగు భాష మాట్లాడే జిల్లాలు అప్పటి ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడింది.

దశాబ్దాలుగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమం 1969లో ఉధృతరూపం దాల్చగా, 2011లో మరో సారి తీవ్రరూపం దాల్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో భాగంగా వందలాది మంది ఆత్మహత్యలు చేసుకొన్నారు. 2010లో తెలంగాణ అంశంపై శ్రీకృష్ణ కమిటీని నియమించగా ఆ కమిటి ఆరు ప్రతిపాదనలు చేసింది. 2013, జూలై 30న ప్రత్యేక తెలంగాణకై కాంగ్రెస్ వర్కింగ్ కమిటి తీర్మానం చేయగా, 2013 అక్టోబరు 3న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. 2014, ఫిబ్రవరి 18న తెలంగాణ ఏర్పాటు బిల్లుకు భారతీయ జనతా పార్టీ మద్దతుతో లోక్‌సభ ఆమోదం లభించగా, ఫిబ్రవరి 20న రాజ్యసభ ఆమోదం పొందింది. 2014 మార్చి 1న బిల్లుపై రాష్ట్రపతి ఆమోదం లభించింది.[2] 2014 జూన్ 2 నాడు తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా నూతనంగా అవతరించింది.[3][4] ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 31 జిల్లాలు ఉన్నాయి.

భాష యాస

[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. తెలంగాణా వారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది.

సాహిత్యం

[మార్చు]

మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉర్దూ సాహిత్యంలో మొట్టమొదటి సాహిబ్-ఎ-దివాన్ గా ప్రఖ్యాతుడయ్యాడు. పోతన, కంచర్ల గోపన్న (భక్త రామాదాసు), మల్లియ రేచన, గోన బుద్ధారెడ్డి, పాల్కురికి సోమనాథుడు, మల్లినాథ సూరి, హుళక్కి భాస్కరుడు మొదలైనవారు తెలంగాణకు చెందిన ప్రాచీన కవులుకాగా, ఆధునికయుగ సాహిత్యకారుల్లో తొలి తెలుగు సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత సురవరం ప్రతాపరెడ్డి, పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు, సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత దాశరథి కృష్ణమాచార్యులు, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డా. సి. నారాయణరెడ్డి, భారతదేశ తొమ్మిదవ ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు వంటివారు ఉన్నారు. ఉర్దూ సాహిత్యం, ముషాయిరాల సంస్కృతి తెలంగాణలో విలసిల్లింది. ఉర్దూ విప్లవ కవి మఖ్దూం తెలంగాణకు చెందినవాడు.

తెలంగాణలో 6 వ శతాబ్దం వరకు జైన మతం ఆధిపత్య మతంగా ఉన్నప్పటికీ ప్రస్తుతం హిందూ, ఇస్లాం మతాలు ప్రధాన మతాలుగా ఉన్నాయి. నాగార్జునకొండలో మహాయాన బౌద్ధమతానికి సంబంధించిన స్మారక కట్టడాలు ఉన్నాయి. ఆచార్య నాగార్జునుడు శ్రీ పర్వతం వద్ద ఏర్పాటుచేసిన ప్రపంచ విశ్వవిద్యాలయానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 12వ శతాబ్దంలో చాళుక్యులు, కాకతీయుల కాలంలో హిందూ మతం పునరుద్ధరించబడింది. విజయనగర రాజుల పాలనలో హిందూ మతం మిక్కిలి ప్రసిద్ధి పొందింది. విజయనగర చక్రవర్తులు ప్రత్యేకంగా శ్రీకృష్ణదేవరాయలు కొత్త ఆలయాలు నిర్మించడమేకాకుండా పాత ఆలయాలను పునరుద్ధరించారు. ఇవన్ని శివ, విష్ణు, హనుమంతుడు, గణపతి మొదలైన ప్రసిద్ధ హిందూ దేవుళ్ల ఆలయాలు.

ఉత్సవాలు

[మార్చు]

అంతర్జాతీయ స్వీట్స్‌ ఫెస్టివల్‌ తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జనవరి 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానంలో నిర్వహించారు. ఇలాంటి పండుగ నిర్వహించడం దేశంలోనే ప్రథమం. [5][6]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Census of Andhra Pradesh 2011" (PDF). Andhra Pradesh state portal. Government of India. Archived from the original (PDF) on 16 May 2013. Retrieved 8 May 2013. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
  2. ఈనాడు దినపత్రిక, తేది 05-03-2014
  3. ఈనాడు దినపత్రిక, తేది:03-06-2014
  4. నమస్తే తెలంగాణ దినపత్రిక, తేది:03-06-2014
  5. ఆద్యా న్యూస్. "ఇంట‌ర్నేష‌న‌ల్ స్వీట్స్ ఫెస్టివ‌ల్‌ : మరో ఉత్స‌వంతో తెలంగాణ ప్ర‌భుత్వం సిద్ధం". www.adya.news. Retrieved 25 December 2017.
  6. నమస్తే తెలంగాణ (23 December 2017). "పతంగుల పండుగలో నోరూరించే స్వీట్లు!". Retrieved 25 December 2017.[permanent dead link]