Jump to content

పి.వి. రాజేశ్వర్ రావు

వికీపీడియా నుండి
పి.వి. రాజేశ్వర్ రావు
పార్లమెంటు సభ్యుడు
In office
1996–1998
అంతకు ముందు వారుబండారు దత్తాత్రేయ
తరువాత వారుబండారు దత్తాత్రేయ
నియోజకవర్గంసికింద్రాబాదు
వ్యక్తిగత వివరాలు
జననం
పి.వి. రాజేశ్వర్ రావు

(1946-08-14)1946 ఆగస్టు 14
వంగర, కరీంనగర్ జిల్లా, హైదరాబాదు రాష్ట్రం
మరణం2016 డిసెంబరు 11(2016-12-11) (వయసు 70)
యశోధ హాస్సిటల్, హైదరాబాదు, తెలంగాణ
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామిపి. రాధిక
సంతానంఒక కుమారుడు, ఇద్దరు కూతుళ్ళు
తల్లిసత్యమ్మ
తండ్రిపివి నరసింహారావు
నివాసంఆదర్శ్ నగర్, హైదరాబాదు
కళాశాలవివేకవర్ధిని న్యాయ కళాశాల
వృత్తిన్యాయవాది
రాజకీయ నాయకుడు

పి.వి. రాజేశ్వర్ రావు, (ఆగస్టు 14, 1946 - డిసెంబరు 11, 2016) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహించాడు.[1][2][3] ఇతను, భారతదేశ మాజీ ప్రధాని పివి నరసింహారావు కుమారుడు.[4]

జననం - విద్యాభ్యాసం

[మార్చు]

రాజేశ్వర్ రావు 1946, ఆగస్టు 14భారతదేశ మాజీ ప్రధాన మంత్రి దివంగత పివి నరసింహారావు దంపతులకు తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని వంగర గ్రామంలో జన్మించాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్, మాస్టర్ డిగ్రీలను పొందాడు. ఇతనికి ఇద్దరు తమ్ముళ్ళు (పి.వి. రంగారావు, పి.వి. ప్రభాకర్ రావు), ఐదుగురు సోదరీమణులు ఉన్నారు.

రాజకీయ ప్రస్థానం

[మార్చు]

తండ్రి బాటలో రాజకీయాల్లోకి ప్రవేశించిన రాజేశ్వర్ రావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరపున 1996 నుండి 1998 వరకు (11వ లోక్‌సభ) సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా పనిచేశాడు.

మరణం

[మార్చు]

ఇతను 2016, డిసెంబరు 11న మరణించాడు.

మూలాలు

[మార్చు]