తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2018-2019)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2018-2019)
Submitted2018 మార్చి 15
Submitted byఈటెల రాజేందర్
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2018 మార్చి 15
Parliament1వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerఈటెల రాజేందర్
Total expenditures1,74,453 కోట్లు
Tax cutsNone
‹ 2017
2019 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2018-2019), అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్.[1] తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2018 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2018 మార్చి 15న ఉదయం 11గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్, ఐదవసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు. తొలి ప్రభుత్వంలో ఇదే చివరి బడ్జెట్.[2][3] 1 గంట 22 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.

బడ్జెట్ వివరాలు[మార్చు]

  • మొత్తం బడ్జెట్‌ రూ. 1,74,453 కోట్లు
  • రెవెన్యూ వ్యయం రూ. 1,25,454 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ. 5,520 కోట్లు
  • ద్రవ్యలోటు అంచనా రూ. 29,077 కోట్లు
  • జీడీపీలో ద్రవ్యలోటు 3.45 శాతం
  • రాష్ట్ర ఆదాయం రూ. 73,751 కోట్లు
  • కేంద్రంవాటా రూ. 29,041 కోట్లు

శాఖలవారిగా కేటాయింపులు[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2018-2019)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[4][5]

  • సాంకేతిక విద్యాశాఖకు రూ. 95 కోట్లు
  • వీ హబ్ కు రూ. 15 కోట్లు
  • కొత్త కలెక్టరేట్‌లు, పోలీసు కార్యాలయాలకు రూ. 500 కోట్లు
  • పాఠశాల విద్యకు రూ. 10,830 కోట్లు
  • ఉన్నత విద్యారంగానికి రూ. 2,448 కోట్లు
  • గురులకు పాఠశాలలకు రూ. 2,823 కోట్లు
  • మైనార్టీ గురుకులాలకు రూ. 735 కోట్లు
  • ఎస్సీ రెసిడెన్షియల్ విద్యాసంస్థలకు రూ. 1,221 కోట్లు
  • ఎస్టీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 401 కోట్లు
  • బీసీ రెసిడెన్షియల్ సంస్థలకు రూ. 296 కోట్లు
  • ఆరోగ్య లక్ష్మీ పథకానికి రూ. 298 కోట్లు
  • కోళ్ళ పరిశ్రమ అభివృద్ధి కోసం రూ. 109 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమానికి రూ. 75 కోట్లు
  • న్యాయవాదుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
  • బ్రహ్మణుల సంక్షేమానికి రూ. 100 కోట్లు
  • వేములవాడ దేవాలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
  • భద్రాచలం దేవాలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు
  • బాసర దేవాలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
  • ధర్మపురి దేవాలయ అభివృద్ధికి రూ. 50 కోట్లు
  • హోంశాఖకు రూ. 5,790 కోట్లు
  • వరంగల్‌ రూ. 300 కోట్లు
  • మిగతా కార్పొరేషన్లకు రూ. 400 కోట్లు
  • సాంస్కృతిక శాఖకు రూ. 58 కోట్లు
  • యాదాద్రి అభివృద్ధికి రూ. 250 కోట్లు
  • దేవాలయాల గుడ్ ఫండ్ రూ.50 కోట్లు
  • ఆర్ అండ్ బీకి రూ. 5,575 కోట్లు
  • విద్యుత్ రంగానికి రూ. 5,650 కోట్లు
  • చేనేత జౌళి రంగానికి రూ. 1200 కోట్లు
  • పరిశ్రమల శాఖకు రూ. 1,286 కోట్లు
  • పురపాలక శాఖకు రూ. 7,251 కోట్లు
  • మైనార్టీల సంక్షేమానికి రూ. 2,000 కోట్లు
  • గురుకులాలకు రూ. 2,823 కోట్లు
  • మిషన్ భగీరథకు రూ. 1,081 కోట్లు
  • పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ. 15,563 కోట్లు
  • ఎస్సీ ప్రగతి నిధికి రూ. 16,453 కోట్ల
  • ఎస్టీ ప్రగతి నిధికి రూ. 9,693 కోట్లు
  • దళితులకు మూడు ఎకరాల భూ పంపిణీకి రూ. 1469 కోట్లు
  • ఎస్టీల సంక్షేమానికి రూ. 8,063 కోట్లు
  • బీసీల సంక్షేమానికి రూ. 5,920 కోట్లు
  • గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1500 కోట్లు
  • పట్టణాభివృద్ధికి రూ. 1,000 కోట్లు
  • నీటిపారుదల రంగానికి రూ. 25,000 కోట్లు
  • రైతుబంధు పథకానికి రూ. 12,000 కోట్లు
  • రైతుబీమా పథకానికి రూ. 500 కోట్లు
  • బిందుతుంపర సేద్యానికి రూ. 127 కోట్లు
  • ఐటీ శాఖకు రూ. 289 కోట్లు
  • వైద్యారోగ్య శాఖకు రూ.7,375 కోట్లు
  • డబుల్ బెడ్రూం పథకానికి రూ.2,643 కోట్లు
  • మహిళా సంక్షేమానికి రూ.1,799 కోట్లు
  • ఎంబీసీ సంక్షేమానికి రూ. 1,000 కోట్లు
  • గర్భిణీల సంక్షేమానికి రూ. 561 కోట్లు
  • వ్యవసాయ యంత్రీకరణకు రూ.522 కోట్లు
  • షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మీ పథకాలకు రూ.1,450 కోట్లు
  • పౌరసరఫరాల శాఖకు రూ. 2,946 కోట్లు
  • పాలీహౌస్, గ్రీన్ హౌస్‌కు రూ. 120 కోట్లు
  • అమ్మ ఒడి పథకానికి రూ. 561 కోట్లు
  • రజకుల ఫెడరేషన్‌కు రూ.200 కోట్లు
  • నాయి బ్రాహ్మణ ఫెడరేషన్‌కు రూ.250 కోట్లు

బడ్జెట్ ఆమోదం[మార్చు]

2018 మార్చి 14న ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశమై శాఖలవారీగా బడ్జెట్‌ ప్రతిపాదనలపై సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఏకగ్రీంగా ఆమోదించింది.

మూలాలు[మార్చు]

  1. "Telangana Budget 2018-19 Highlights". Sakshi Education (in ఇంగ్లీష్). 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  2. Maitreyi, M. l Melly (2018-03-15). "Telangana Budget 2018-19 accords priority to agriculture, irrigation and power sectors". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  3. "తెలంగాణ బడ్జెట్ కేటాయింపులివే: వ్యవసాయం-సంక్షేమం". www.telugu.oneindia.com. 2018-03-15. Archived from the original on 2018-03-15. Retrieved 2022-10-12.
  4. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  5. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు[మార్చు]