రైతుబంధు పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రైతుబంధు పథకం
ప్రాంతంధర్మరాజుపల్లి, తెలంగాణ, భారతదేశం
ప్రధాన వ్యక్తులుతెలంగాణ ప్రజలు
స్థాపనమే 10, 2018
వెబ్ సైటుhttp://rythubandhu.telangana.gov.in/
నిర్వాహకులుముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు,
తెలంగాణ ప్రభుత్వం

వ్యవసాయం కోసం పెట్టుబడిని ఋణంగా నగదు రూపంలో రైతులకు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకమే రైతుబంధు పథకం.[1][2] ఈ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మే 10, 2018కరీంనగర్‌ జిల్లా, హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని శాలపల్లి - ఇందిరానగర్‌ వద్ద ప్రారంభించారు. మొట్టమొదటి సారిగా ధర్మరాజుపల్లి వాసులు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా చెక్కులు, పట్టాదార్‌ పాసు పుస్తకాలు అందుకున్నారు.[3]

వివరాలు[మార్చు]

రైతుబంధు పథకం కింద ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున సాగుకు పెట్టుబడి సాయం చేయనుంది. ఖరీఫ్, రబీ సీజన్ లకు ఎకరానికి రూ. 5000 చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ. 10000 పెట్టుబడిగా ఇవ్వనుంది. ఈ మొత్తాన్ని రైతుకు చెక్కుల రూపంలో ఇవ్వనున్నారు. అదే విధంగా ఈ పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. ఆరు నెలల తర్వాత అనగా 181 వ రోజు నుంచి 270 వ రోజు వరకు వారు తీసుకున్న రుణంపై 12 శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు పెట్టుబడిసాయం అందిస్తుంది. ( గిరిజనభూములు కలిపి మొత్తం కోట్ల ఎకరాలకు )[4] ఈ పథకం అమలుకోసం బడ్జెట్‌లో రూ.12 వేల కోట్లు కేటాయించారు. తెలంగాణా రాష్ట్ర గణాంక సంకలనం 2020 ఉన్న వివరములను పరిశీలిస్తే , రైతుబంధు పథకం కింద పొందిన వ్యవసాయదారులలో 90% చిన్నరైతులు , సన్నకారు రైతులే ఉన్నారు . ఈ పథకం మొత్తం లబ్ది పొందిన వాటిలో నల్గొండ జిల్లాలోని 4,32,059 రైతులు ఈ పథకం ద్వారా ప్రయోజనము పొందినారు. రాష్ట్రము మొత్తములో ఎక్కువ మొత్తంలోరైతుబంధు పథకం ప్రయోజనం పొందిన రైతులలో నల్గొండ జిల్లా ప్రథమ స్థానం లో ఉన్నది, తర్వాతి స్థానాలలో సంగారెడ్డి, రంగారెడ్డి, ఖమ్మం, నాగర్ కర్నూల్ జిల్లాలు ఉన్నవి . రైతుబంధు లబ్దిదారులను క్రింది పట్టిక ద్వారా చూడ వచ్చును [5]

లబ్ది దారులు
క్రమ సంఖ్య రైతులు ప్రయోజనం పొందినవారు
1 సన్నకారు 2-47 ఎకరాలలో ఉన్నవారు 40,46,969
2 చిన్న రైతులు 2-48- 4-94 ఎకరాలలో ఉన్నవారు 11,33,829
3 తక్కువ , మధ్య తరగతి రైతులు 4-95 - 9-88 ఎకరాలలో ఉన్నవారు 5,01,994
4 మధ్య తరగతి రైతులు 9-89 -24-78 ఎకరాలలో ఉన్నవారు 92,997
5 పెద్ద రైతులు 24-79 ఎకరాల పైన ఉన్నవారు 6,099
భూ కమతాలు రైతుల సంఖ్య
2 ఎకరాల లోపు 42 లక్షలు (90%)
5 ఎకరాల లోపు 11 లక్షలు
5-10 ఎకరాల లోపు 4.4 లక్షలు
> 10 ఎకరాల కంటే ఎక్కువ 94,000
> 25 ఎకరాల కంటే ఎక్కువ 6488

విమర్శలు[మార్చు]

2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తమ ప్రభుత్వం నడిపించిన రైతు బంధు పథకాన్ని తమ సానుకూలాంశంగా ప్రచారం చేసుకుంది. అయితే విపక్షాలు మాత్రం ఈ పథకం కేవలం పెద్ద రైతులకు, భూస్వాములకు లాభం చేకూర్చడానికే నడిచిందనీ, అసలు వ్యవసాయం చేసి కష్టనష్టాలు అనుభవించే కౌలు రైతులకు దీని వల్ల రూపాయి కూడా లాభం లేదని విమర్శించారు.[6]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "రైతు బంధు పథకానికి నిధులు విడుదల". నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.[permanent dead link]
  2. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 జూన్ 2019. Retrieved 15 June 2019.
  3. Namasthe Telangana (15 June 2021). "తొలిరోజు రూ.65.26 కోట్లు జమ". Archived from the original on 5 జూలై 2021. Retrieved 5 July 2021.
  4. "పంట నిల్వకు రైతు బంధు పథకం." నమస్తే తెలంగాణ. www.ntnews.com. Retrieved 12 April 2018.[permanent dead link]
  5. "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2020-10-28.
  6. శాండిల్య, అరుణ్ (4 December 2018). "టీఆర్ఎస్, మహాకూటమి ముందున్న సవాళ్లు". BBC News తెలుగు. Retrieved 9 December 2018.