Jump to content

రబీ పంట

వికీపీడియా నుండి
(రబీ నుండి దారిమార్పు చెందింది)
గోధుమ
బార్లీ

రబీ పంట శరదృతువులో నాటిన, శీతాకాలం సీజన్ లో కోతకు వచ్చే వ్యవసాయ పంటలను సూచిస్తుంది. రబీ అనే పదం అరబిక్ పదమైన వసంతరుతువు (spring) నుండి ఉద్భవించింది. ఈ పదాన్ని భారత ఉపఖండంలో ఉపయోగిస్తున్నారు.

నిర్వచనం

[మార్చు]

"రబీ" అనే పదానికి అరబిక్ అనువాదం వసంతం. ఈ పంటలు వసంతకాలంలో పండుతాయి కాబట్టి ఈ పేరు రావడం జరిగింది. రబీ సీజన్ నవంబరులో ప్రారంభమై మార్చి లేదా ఏప్రిల్ వరకు ఉంటుంది. నవంబరు నాటికి రుతుపవనాలు ముగియడంతో రబీ పంట సాగు ప్రధానంగా నీటి పారుదల ద్వారా జరుగుతుంది. రైతులు శరదృతువు ప్రారంభంలో విత్తనాలను నాటడం, పంటలు వసంత కాలంలో రావడం జరుగుతుంది.[1]

అవలోకనం

[మార్చు]

భారతదేశంలో  వివిధ కాలాల ఆధారంగా వ్యవసాయ పంటలు మారుతూ ఉంటాయి, పంటలు పెరగడానికి,సరియైన పంటలు రావడానికి నిర్దిష్ట, సరైన వాతావరణ పరిస్థితులు  అవసరం.  ఖరీఫ్, రబీ అనే రెండు పంటలను ఆసియా దేశాలు ప్రధానంగా వర్షాకాలంలో వేయడం జరుగుతుంది. ఖరీఫ్ పంటల సాగు వేయడం  వర్షాకాలం ప్రారంభంతో ప్రారంభమై, అయిపోయే వరకు, రబీ పంటలు  శీతాకాలంలో  నాటు వే సి వసంతకాలం వచ్చే వరకు ఆ పంటలు రావడం జరుగుతుంది. ఆ పంటలలో  గోధుమ, బార్లీ, శనగలు, బఠానీలు పంటలను కలిగి ఉంటాయి. రబీ పంటలు ప్రధానంగా రుతుపవనాల వర్షాలు ముగిసిన తరువాత, నవంబరు మధ్యలో సాగు చేయబడి, ఆ పంటలు  ఏప్రిల్ / మేలో కోతలు ప్రారంభమవుతాయి.  ఈ రబీ పంటలు భూమిలో ఉండే ఇంకిన వర్షపు నీటితో లేదా నీటి పారుదల పద్ధతులను ఉపయోగించి పంటలు పండిస్తారు రబీ పంటలను శీతాకాల పంటలు అని కూడా అంటారు. అక్టోబర్, మార్చి నెలల్లో మొదలయ్యే శీతాకాలంలో ఇవి పెరుగుతాయి. అరబిక్ పదం 'రబీ' వసంతాన్ని సూచిస్తుంది. అందువల్ల, రబీ పంటల కోత సమయం వసంతకాలంలో ప్రారంభమవుతుంది. ఖరీఫ్ పంటల మాదిరిగా కాకుండా, రబీ పంటలు పండించడానికి తక్కువ నీరు అవసరం. అందువల్ల, అవి మంచి  వృద్ధి చెందడానికి సాధారణ నీటి పారుదల సహాయంతో సులభంగా పెరుగుతాయి. రబీ పంటలలో గోధుమ, బార్లీ, పప్పుధాన్యాలు, శనగలు, రైతులు ఈ సమయంలో ఆవాలు, జీలకర్ర, పొద్దుతిరుగుడు, రాప్సీడ్, మరెన్నో విత్తనాలను కూడా నాటువేయడం వంటివి జరుగుతాయి.[2]

సమస్యలు

[మార్చు]

భారతీయ వ్యవసాయ భూమిలో సగం వర్షాధారంగా ఉంటుంది, కాబట్టి రబీ పంట దిగుబడులకు సకాలంలో,తగినంత వర్షాలు కీలకం గా ఉంటాయి. రబీ పంటల సాగులో అకాల వర్షములు రావడం ,రబీ పంటలకు నష్టం జరుగు తాయి ,కొన్ని రాష్ట్రాల్లో వర్షాలు కూరగాయలు, మామిడి పంటలకు మేలు చేయగా, కొన్ని రాష్ట్రాల్లో గోధుమలు, లిచీ పంటలు దెబ్బతినే అవకాశం ఉంది, మొత్తానికి రబీ పంటకు సరియైన వర్ష పాతం, నిరంతరం విద్యుత్ ఉంటడం, అకాల వర్షాలు రాకపోతే రబీ పంటలు రైతులకు మేలుచేస్తాయని అనడంలో సందేహం లేదు.[3]

కొన్ని రబీ పంటలు

[మార్చు]

ఇవి కూడా చూడండి

[మార్చు]

ఖరీఫ్

మూలాలు

[మార్చు]
  1. "Types of Crops". https://www.toppr.com/. Retrieved 01 April 2023. {{cite web}}: Check date values in: |access-date= (help); External link in |website= (help)
  2. "Types of Crops - Rabi and Kharif Crop Seasons in India". Tractorgyan (in English). Retrieved 2023-04-01.{{cite web}}: CS1 maint: unrecognized language (link)
  3. "Drenching damages some rabi crops". CRISIL. Retrieved 2023-04-01.

బయటి లింకులు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=రబీ_పంట&oldid=4334892" నుండి వెలికితీశారు