తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2017-2018)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
 () తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2017-2018)
Submitted2017 మార్చి 13
Submitted byఈటెల రాజేందర్
(తెలంగాణ ఆర్థిక శాఖామంత్రి)
Submitted toతెలంగాణ శాసనసభ
Presented2017 మార్చి 13
Parliament1వ శాసనసభ
Partyతెలంగాణ రాష్ట్ర సమితి
Finance ministerఈటెల రాజేందర్
Total expenditures1,49,446 కోట్లు
Tax cutsNone
‹ 2016
2018 ›

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2017-2018), అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్. తెలంగాణ శాసనసభ సమావేశాల్లో భాగంగా 2017 మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరిగాయి. 2017 మార్చి 13న ఉదయం 11.35 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖామంత్రి ఈటెల రాజేందర్ నాలుగవసారి అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టాడు.[1] నాలుగోసారి తనపై నమ్మకంతో ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ధన్యవాదాలు తెలిపాడు.[2] 1 గంట 8 నిముషాలపాటు బడ్జెట్ ప్రసంగం చదివాడు.

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కొత్త విధానంలో 2017-18 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. గతంలో ఉన్న ప్రణాళికా బడ్జెట్‌, ప్రణాళికేతర బడ్జెట్‌ పద్దులను రద్దుచేసి రెవెన్యూ ఖాతా, మూలధన ఖాతా కింద బడ్జెట్‌ పద్దులు చూపారు.[3]

బడ్జెట్ వివరాలు

[మార్చు]
  • రాష్ట్ర బడ్జెట్ రూ. 1,49,446 కోట్లు
  • నిర్వహణ వ్యయం రూ. 61,607 కోట్లు
  • ప్రగతి పద్దు రూ. 88,038 కోట్లు
  • ద్రవ్య లోటు రూ. 26,096 కోట్లు
  • రెవెన్యూ మిగులు రూ. 4,571 కోట్లు

కేటాయింపుల వివరాలు

[మార్చు]

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ (2017-2018)లో వివిధ శాఖలకు కేటాయించబడిన నిధుల వివరాలు:[4]

  • వ్యవసాయ రుణాలు రూ. 46,946 కోట్లు
  • వ్యవసాయ రంగం రూ. 5,942 కోట్లు
  • సాగినీటి ప్రాజెక్టులకు రూ. 25వేల కోట్లు
  • తెలంగాణకు హరితహారం రూ.50 కోట్లు
  • రైతు రుణమాఫీ రూ. 4వేల కోట్లు.
  • వరంగల్‌ మహానగర పాలక సంస్థ రూ. 300 కోట్లు
  • శాంతి భద్రతలు రూ. 4,828 కోట్లు
  • పాఠశాల విద్య రూ. 12,705 కోట్లు
  • బీసీల సంక్షేమం రూ. 5070.36 కోట్లు
  • ఎస్సీల అభివృద్ధి రూ. 14,375 కోట్లు
  • ఎస్టీల అభివృద్ధి రూ. 8,165 కోట్లు
  • బ్రాహ్మణుల సంక్షేమం రూ. 100 కోట్లు
  • నాయీ బ్రాహ్మణులు, రజకుల అభివృద్ధి రూ. 500 కోట్లు
  • చేనేత కార్మికుల సంక్షేమం రూ. 1200 కోట్లు
  • మైనార్టీల సంక్షేమం రూ. 1,249 కోట్లు
  • జర్నలిస్టుల సంక్షేమం రూ. 30 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం రూ. 1,731 కోట్లు
  • పారిశ్రామిక రంగం రూ.985 కోట్లు
  • ఐటీ రంగం రూ. 252 కోట్లు
  • ఎంబీసీల అభివృద్ధి రూ. 1000 కోట్లు
  • పంచాయతీ రాజ్‌ శాఖ రూ. 14,723 కోట్లు
  • మిషన్ భగీరథ రూ.3వేల కోట్లు
  • జీహెచ్‌ఎంసీ రూ.1000 కోట్లు
  • వైద్య, ఆరోగ్య శాఖ రూ. 5,976 కోట్లు
  • ఫీజు రీయింబర్స్‌మెంటు రూ. 1,939 కోట్లు
  • విద్యారంగం రూ. 12,705 కోట్లు
  • విద్యుత్ రంగం రూ. 4203 కోట్లు
  • పట్టణాభివృద్ధి రూ. 5,599 కోట్లు
  • ఆసరా ఫించన్లు రూ. 5,330 కోట్లు
  • పర్యాటకం, సాంస్కృతిక రంగాలు రూ. 198 కోట్లు
  • రహదారుల అభివృద్ధికి రూ. 5,033 కోట్లు
  • కేసీఆర్ కిట్ పథకం రూ. 605 కోట్లు
  • మూసీనది ఆధునీకరణ రూ. 305 కోట్లు
  • ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు రూ. 200 కోట్ల
  • చివరి విడత రైతుల రుణమాఫీ రూ. 4000 కోట్లు
  • నీటి పారుదల రూ. 26,652 కోట్లు
  • మిగతా కార్పొరేషన్లు రూ. 400 కోట్లు

ఇతర వివరాలు

[మార్చు]
  • ఈ బడ్జెటులో కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌కు రూ. 51 వేల నుంచి రూ. 75,116కు పెంచబడింది.

మూలాలు

[మార్చు]
  1. Rahul, N. (2017-03-13). "Rs 19,000-crore jump in Telangana Budget". The Hindu. ISSN 0971-751X. Archived from the original on 2020-11-11. Retrieved 2022-07-25.
  2. "తెలంగాణ బడ్జెట్‌ హైలైట్స్‌ 2017-18". Sakshi. 2017-03-13. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
  3. "తెలంగాణకు ఈ బడ్జెట్ ప్రత్యేకం!". Samayam Telugu. 2021-03-13. Archived from the original on 2022-07-25. Retrieved 2022-07-25.
  4. "తెలంగాణ బడ్జెట్ 2017-18 ముఖ్యాంశాలు". Samayam Telugu. 2017-03-13. Archived from the original on 2017-10-01. Retrieved 2022-07-25.

బయటి లింకులు

[మార్చు]