Jump to content

వీ హబ్

వికీపీడియా నుండి
వీ హబ్‌
వీ హబ్‌ ప్రారంభోత్సవం
స్థాపనమార్చి 8, 2018
కేంద్రీకరణస్టార్టప్ ఇంక్యుబేటర్
కార్యస్థానం
నాయకుడుహైదరాబాద్, తెలంగాణ
జాలగూడువీ హబ్‌ వెబ్సైట్

తెలంగాణ రాష్ట్రంలోని మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహిం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన కార్యక్రమం వీ హబ్ (ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ హబ్‌). దీనిని 2018, మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవంన హైదరాబాదు అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు.[1][2][3][4]

మహిళా వ్యాపారవేత్తలు స్థాపించే స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహిస్తూ అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న వి-హబ్, అన్ని రకాల వ్యాపారాలు నిర్వహించే కంపెనీలకు సహాయాన్ని అందిస్తోంది. స్టార్టప్ లను ఇంక్యుబేట్ చేయడంతోపాటు వాటి వృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చేందుకు కూడా ప్రభుత్వం టీ- ఫండ్ పేరుతో వెంచర్ క్యాపిటల్ నిధిని ఏర్పాటు చేసింది. ఈ నిధి ద్వారా వి-హబ్ ఇప్పటికే పలు స్టార్టప్ కంపెనీల వృద్ధికి అవసరమైన పెట్టుబడి సాయం చేయనుంది.

ప్రారంభం

[మార్చు]

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2018, మార్చి 8న మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.[5][6][7] ఈ ప్రారంభ కార్యక్రమంలో మిస్సైల్ ఉమన్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొందిన డీఆర్‌డీవో ప్రాజెక్ట్ డైరెక్టర్ టెస్సీ థామస్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్, సీఐఐ చైర్మన్ వీ రాజన్న, కలారీ క్యాపిటల్ సంస్థ ఎండీ వాణి కోలా, వీహబ్ సీఈవో దీప్తి రావుల, ఫిక్కి మహిళా విభాగం, కోవె సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.[8][9]

ఉద్దేశ్యం

[మార్చు]
  1. మహిళల్లో ఉన్న సృజనాత్మక శక్తికి ప్రోత్సాహం అందించి వారి ప్రతిభ వెలుగులోకి తీసుకురావడం
  2. జూనియర్ కాలేజీ విద్యార్థులకు పరిశోధన చేయడానికి కావాల్సిన అవకాశం కల్పించడం

లక్ష్యాలు

[మార్చు]
  1. మార్కులకోసమే చదువు అన్నట్టు కాకుండా చిన్నతనం నుంచే ఆవిష్కరణలను కుడా పాఠ్యాంశంలో భాగం చేయడం
  2. మెరుగైన కొత్త కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి తీసుకురావడం
  3. ప్రతి మహిళను విజయవంతమైన పారిశ్రామికవేత్తగా తయారుచేయడం

ఒప్పంద సంస్థలు

[మార్చు]

ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థ యూఎన్‌డీపీ, సీఐఐ-ఇండియా ఉమెన్ నెట్‌వర్క్, సేల్స్‌ఫోర్స్, ఐఐఎం బెంగళూరు, ఎన్‌ఐడియా, పీడబ్ల్యూఎల్ మొదలైన ఆరు సంస్థల ప్రతినిధులు వీ హబ్ తో ఒప్పందాలు కుదుర్చుకున్నారు.[10][11][12]

డేటా సైన్స్ రంగం

[మార్చు]

డేటా సైన్స్ రంగంలో బాలికల నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో ఉమెన్ ఇన్ డేటా సైన్స్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం, మ్యాథ్‌వర్క్స్ భాగస్వామ్యంతో వి హబ్ ఆధ్వర్యంలో సరికొత్త కార్యక్రమాన్ని ప్రారంభించబడింది. బాలికా విద్యార్ధుల నైపుణ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా ఏడు వారాల కార్యక్రమంలో ఎంపిక చేసిన పాఠశాలల నుండి 100 మంది బాలికలకు (ప్రతి పాఠశాల నుండి 12-13 మంది బాలికలు) డేటా సైన్స్ రంగంలో నైపుణ్యాలను పొందే అవకాశాన్ని అందిస్తుంది.[13]

ఫలితాలు

[మార్చు]

2021 డిసెంబరు నాటికి రెండు బ్యా బేలో స్టార్టప్ కంపెనీలను ఇంక్యుబేట్ చేసి, మూడో బ్యాచ్ లో సహకారం కావాల్సిన కంపెనీల నుంచి దరఖాస్తులు ఆహ్వానించి 26 స్టార్టప్ ను ఎంపికచేశారు. ఈ వి-హబ్ ఇంక్యుబేట్ చేసిన కంపెనీలు వాణిజ్యపరంగా అనేక రంగాలలో విజయాలు సాధించాయి. హైదరాబాద్ కు చెందిన వైద్య పరికరాలు తయారు చేసే కంపెనీ స్టార్టూన్ ల్యాబ్స్ రూపొందించిన ఫీజ్ అనే పరికరం కార్పోరేట్ ఆస్పత్రుల దృష్టిని ఆకర్షిస్తోంది. హైదరాబాద్ కు చెందిన శాంతాబయోటెక్ అధినేత వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ ఆర్థో డాక్టర్, సన్‌షైన్ ఆస్పత్రి ఎండీ గురువారెడ్డిల సమక్షంలో ఫిజ్ పరికరాన్ని లాంచ్ చేశారు. ఫిజియోథెరపీ అసెస్మెంట్ డివైజ్ గా పేరొందిన ఈ పరికరం ఆర్థో లేదా న్యూరో సమస్యల బారిన పడ్డ వారు చికిత్స తర్వాత ఫిజియోథెరపీ తీసుకుంటున్న సమయంలో ఎంత వరకు కోలుకుంటున్నరాన్న దానిపై క్లినికల్ రిపోర్ట్స్ ను తయారు చేస్తుంది. దీంతో పేషెంట్ రికవరీ ఎలా ఉందన్న విషయం తెలుసుకోవడం చికిత్స అందించిన డాక్టర్లకు సులువవుతుంది.

బడ్జెట్ వివరాలు

[మార్చు]

వీ హబ్ కు 2018 తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో 15 కోట్ల రూపాయలు కేటాయించారు.[14][15]

చిత్రమాలిక

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 10టీవీ న్యూస్ (9 March 2018). "టీసాట్ కార్యాలయంలో వీహబ్‌..." Retrieved 12 April 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]
  2. సాక్షి, తెలంగాణ, హైదరాబాద్ (9 March 2018). "వనితకు వరం.. 'వీ హబ్‌'". Retrieved 12 April 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  3. మనం న్యూస్ (9 March 2018). "టీ హబ్‌లా వీ హబ్ ఎదగాలి". Archived from the original on 13 ఏప్రిల్ 2018. Retrieved 12 April 2018.
  4. నవ తెలంగాణ, హోం, తాజా వార్తలు (8 March 2018). "వీహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్". Retrieved 12 April 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)
  5. తెలంగాణ మ్యాగజైన్. "వీహబ్‌తో నవశకం!". www.magazine.telangana.gov.in. Retrieved 12 April 2018.
  6. The Hindu, Telangana (9 March 2018). "WE Hub: game plan for women with potential". Retrieved 12 April 2018.
  7. The Hans India, Telangana (9 March 2018). "Start-up incubator for women 'We-Hub' launched in Telangana". Retrieved 12 April 2018.
  8. నేటి ఏపి, తెలంగాణ వార్తలు (9 March 2018). "టీహబ్ తెలుసు ఈ వీహాబ్ ఏంటీ కొత్తగా..?". Retrieved 12 April 2018.[permanent dead link]
  9. "T gifts 'We-Hub' to women entrepreneurs". The Times of India. 9 March 2018. Retrieved 12 April 2018.
  10. The New Indian Express, Telangana (9 March 2018). "WE-Hub ties up with technology majors; women entrepreneurs can apply from today". xpress News Service. Retrieved 12 April 2018.
  11. Deccan Chronicle (9 March 2018). "We-Hub launched on women's day". Retrieved 12 April 2018.
  12. Telangana Today, Telangana (8 March 2018). "Telangana rolls out women-only incubator WE-Hub". Telangana Today. Retrieved 12 April 2018.
  13. "WE Hub to train 100 girl students in data science". Telangana Today (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-12-23. Archived from the original on 2021-12-23. Retrieved 2021-12-23.
  14. "తెలంగాణ బడ్జెట్ 2018: ఈటల ప్రసంగం". Samayam Telugu. 2018-03-15. Archived from the original on 2022-10-12. Retrieved 2022-10-12.
  15. Mar 15, TIMESOFINDIA COM / Updated:; 2018; Ist, 13:23 (2018-03-15). "Telangana Budget 2018: Highlights of Telangana budget 2018-19 | Hyderabad News - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 2018-04-17. Retrieved 2022-10-12. {{cite web}}: |last2= has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.
"https://te.wikipedia.org/w/index.php?title=వీ_హబ్&oldid=3865699" నుండి వెలికితీశారు