ఆరోగ్య లక్ష్మి పథకం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరోగ్య లక్ష్మి పథకం
పథకం రకంమాతాశిశు పౌష్టికాహార కార్యక్రమం
రాష్ట్రంతెలంగాణ
ముఖ్యమంత్రికల్వకుంట్ల చంద్రశేఖరరావు
మంత్రిత్వ శాఖరాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ
ప్రారంభం1 జనవరి 2015 (2015-01-01)
తెలంగాణ
బడ్జెట్రూ. 850 కోట్లు (సంవత్సరానికి)
స్థితిఅమలులోవున్నది
వెబ్ సైటుఅధికారిక వెబ్ సైట్

ఆరోగ్య లక్ష్మి పథకం, తెలంగాణ రాష్ట్రంలోని బాలెంతలకు, గర్భిణిలకు పౌష్టిక ఆహారం అందజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పథకం. సమీకృత బాలల అభివృద్ధి పథకం (ICDS)[1] కొరకు 1975 నుండి కేంద్రం ప్రభుత్వం రాష్ట్రప్రభుత్వాలు ఉమ్మడిగా నడుపుతున్న పథకానికి అనుబంధంగా తెలంగాణ రాష్ట్రం ఈ పథకాన్ని అందిస్తోంది. ఐసిడ్ఎస్ పథకంలో ఆదాయంతో సంబంధం లేకుండా లబ్దిదారులందరికీ పౌష్టిక ఆహారం (గర్భిణీలకు, బాలెంతలకు రేషన్ గా) అందజేయబడుతుండగా, ఈ పథకంలో దారిద్య్రరేఖకు దిగువలో ఉన్న కుటుంబాల బాలబాలికలకు,మహిళలకు పౌష్టిక ఆహారం భోజనం, రేషన్ రూపంలో అందజేయబడుతున్నది.[2] ఈ పథకం ద్వారా అంగన్వాడి కేంద్రాల నుండి గర్బిణి స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు ప్రతిరోజూ గుడ్లు పాలుతోపాటు మంచి ఆహారం ను ప్రభుత్వం అందిస్తుంది. ఇది ప్రయోగాత్మకంగా 01.01.2013 న ప్రారంభమై, తెలంగాణా ఏర్పడిన తర్వాత విస్తరించబడింది.[3]

ప్రభుత్వం నిరంతర పర్యవేక్షణ, పారదర్శక విధానాల ఫలితంగా పోషకాహార పంపిణీలో ఆర్థిక నష్టాలతో పాటు, అనారోగ్య ముప్పు ను తప్పించడంలో ముందు వరుసలో నిలిచిందని, గర్భిణీలు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొంటున్న చర్యలు ఇతర రాష్ర్టాలకు స్ఫూర్తిగా నిలిచాయని, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పంపిణీ చేస్తున్న పౌష్టికాహారానికి అదనపు విలువలను జోడించి తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తున్నదని నీతి ఆయోగ్‌ తన నివేదికలో పేర్కొన్నది.[4]

ప్రారంభం

[మార్చు]

రాష్ట్రంలోని తల్లి, బిడ్డలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యం ప్రకటిస్తూ 2015, జనవరి 1న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం ప్రారంభిచబడింది.[5] మహిళలు, పిల్లలకు పోషకాహారంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల తరహాలో ఇది రూపొందించబడింది. తెలంగాణ పోర్టల్‌ ద్వారా రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ పారదర్శక పద్ధతిలో ఆన్‌లైన్‌ ద్వారా పాలు, కందిపప్పు, కోడిగుడ్లు, నూనె, బాలామృతం, బాలామృతం ప్లస్‌ను రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన తెలంగాణ ఆయిల్‌ ఫెడరేషన్‌ అండ్‌ ఫుడ్స్‌ నుంచి కొనుగోలు చేస్తున్నది.

పథకం వివరాలు

[మార్చు]
  • 2.71 లక్షల మంది గర్భిణీ స్త్రీలు, 2.03 లక్షల మంది పాలిచ్చే తల్లులకు రాష్ట్రంలోని 35,000 అంగన్‌వాడీ కేంద్రాలలో ఒక పూట పూర్తి భోజనం అందించడం[6]
  • గర్భిణులకు ఇవ్వనున్న గుడ్ల సంఖ్యను 16 నుంచి 30 పెంచడంతోపాటు వారికి ఒకపూట భోజనం అందించడం
  • కిషోర బాలికలకు 16 గుడ్లను ఇవ్వడంతోపాటూ బియ్యం, కంది పప్పు, మంచినూనె, ఐరన్ ఫోలిక్ ఆసిడ్ టాబ్లెడ్స్ అందించడం
  • 6నెలల నుంచి 6ఏండ్ల వయసున్న బాలబాలికలకు 2.5 కిలోల బాలామృతం (తెలంగాణ ఫుడ్ కార్పొరేషన్ సరఫరా చేసే విటమినైజ్‌డ్ స్నాక్స్), ప్రతినెల 6 నెలల నుంచి 3 ఏండ్ల వయసున్న బాలబాలికలకు 16 గుడ్లను, 3 నుంచి 6 ఏండ్ల వయసున్న వారికి 30 గుడ్లను ప్రతినెలా అందించడం[7]
  • గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ప్రతి రోజు ఒక గుడ్డు, నెలలో 25 రోజుల పాటు 200 మి.లీ పాలు అందించడం
  • గర్భిణీ లేదా బాలింతలకు నెలలో 25 రోజుల పాటు ప్రతిరోజూ ఒక పూట భోజనం అందించడం

బడ్జెటు వివరాలు

[మార్చు]
  • ఈ పథకానికి ప్రభుత్వం 2015-16 బడ్జెటులో రూ.327.69 కోట్లు, 2016-17 బడ్జెటులో రూ. 451.85కోట్లు కేటాయించింది. పౌష్టికాహారం సరఫరాకు 2017-18 బడ్జెటులో రూ.429 కోట్లు కేటాయించారు. 2018-19 బడ్జెటులో రూ.298 కోట్లు కేటాయించారు.[8]
  • 2021 ఆగస్టు నెలవరకు తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య లక్ష్మి పథకం కోసం 1110.89 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. తెలంగాణ ఆరోగ్య లక్ష్మి పథకం 4,65,805 మంది గర్భిణీ స్త్రీలు-కొత్త తల్లులు, 10,43,419 మంది 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల పిల్లలు, అలాగే 3-6 సంవత్సరాల వయస్సు గల 6,74,336 పిల్లలకు ఈ పథకం ప్రయోజనాలను అందిస్తోంది.

నీతి ఆయోగ్‌ ప్రశంస

[మార్చు]

సమీకృత శిశు అభివృద్ధి కోసం వివిధ రాష్ర్టాల్లో అమలవుతున్న ఉత్తమ పద్ధతులను క్రోడీకరించి ‘వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రాం టేక్‌హోం రేషన్‌’ పేరుతో నీతి ఆయోగ్‌ విడుదలచేసిన నివేదికలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, శిశు సంక్షేమశాఖ అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బాలింతలు, 7 నెలల నుంచి ఆరేండ్లలోపు చిన్నారులకు అందజేస్తున్న పౌష్ఠికాహార పంపిణీ విధానం అద్భుతంగా ఉన్నదని ప్రశంసించింది.[4]

మూలాలు

[మార్చు]
  1. "INTEGRATED CHILD DEVELOPMENT SERVICES (ICDS) SCHEME". Government of India. Retrieved 18 February 2019.
  2. నమస్తే తెలంగాణ (2 January 2016). "'ఆరోగ్యలక్ష్మి'కి ఏడాది పూర్తి". Retrieved 30 April 2018.[permanent dead link]
  3. "Arogya Lakshmi". Retrieved Mar 19, 2018.
  4. 4.0 4.1 telugu, NT News (2022-07-09). "ఆరోగ్యలక్ష్మి అద్భుతం". Namasthe Telangana. Archived from the original on 2022-07-09. Retrieved 2022-07-09.
  5. Telangana State Portal, Government Initiatives. "Arogya Lakshmi". www.telangana.gov.in. Retrieved 30 April 2018.
  6. District Collector warns government doctors
  7. నమస్తే తెలంగాణ, బతుకమ్మ (ఆదివారం సంచిక) (2 June 2019). "మన తెలంగాణ ఘన తెలంగాణ". Archived from the original on 2 June 2019. Retrieved 15 June 2019.
  8. "మహిళా-శిశు సంక్షేమానికి పెద్దపీట". Namasthe Telangana (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-06-02. Archived from the original on 2021-08-12. Retrieved 2021-11-28.