దాస్యం వినయ్‌భాస్కర్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాస్యం వినయ్‌భాస్కర్‌
దాస్యం వినయ్‌భాస్కర్‌


ఎమ్మెల్యే
నియోజకవర్గము పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1964-11-22) 1964 నవంబరు 22 (వయస్సు: 54  సంవత్సరాలు)
వరంగల్, తెలంగాణ
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
నివాసము వడ్డేపల్లి, వరంగల్
మతం హిందూ

దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకులు. పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్ర సమితి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.[1] 2015 నుండి ముఖ్యమంత్రి కార్యాలయపు పార్లమెంటరీ కార్యదర్శిగా ఉన్నారు.[2]

జననం[మార్చు]

వినయ్‌భాస్కర్‌ 1964, నవంబరు 22 న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా లోని పరకాలలో జన్మించారు. వీరి అన్న దాస్యం ప్రణయ్ భాస్కర్ ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.

రాజకీయ జీవితం[మార్చు]

వినయ్‌భాస్కర్‌ 2004 లో హనుమకొండ శాసనసభ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి మందాడి సత్యనారాయణ రెడ్డి చేతిలో ఓడిపోయారు.

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం నుండి 2009, 2014లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు.

2015 జనవరిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు చే తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) పార్లమెంటరీ కార్యదర్శిగా నియమితులయ్యారు.[2]

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ ప్రభుత్వ అధికారిక జాలగూడు. "Members of the Legislative Assembly". www.telangana.gov.in.
  2. 2.0 2.1 http://www.aponline.gov.in/tgportal/Parliamentarysecretaries.aspx Telangana Parliamentary Secretaries