రేవూరి ప్రకాష్ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రేవూరి ప్రకాష్ రెడ్డి

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
1994 - 2004, 2009 - 2014
ముందు కంభంపాటి లక్ష్మారెడ్డి
తరువాత దొంతి మాధవ రెడ్డి
నియోజకవర్గం నర్సంపేట నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం 1963
కేశ్వాపూర్ గ్రామం, దుగ్గొండి మండలం, వరంగల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం
జాతీయత  భారతదేశం
రాజకీయ పార్టీ Bharatiya Janata Party logo.svg భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు నారాయణ రెడ్డి
జీవిత భాగస్వామి సునంద దేవి

రేవూరి ప్రకాష్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన నర్సంపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.

జననం, విద్యాభాస్యం[మార్చు]

రేవూరి ప్రకాష్ రెడ్డి 1963లో తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లా, దుగ్గొండి మండలం, కేశ్వాపూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన ఆదిలాబాద్ జిల్లా, కాగజ్‌నగర్‌ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలో 1974లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి వరంగల్ లోని చందా కాంతయ్య మెమోరియల్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీలో డిగ్రీలో చేరి మధ్యలోనే ఆపేసాడు.

రాజకీయ జీవితం[మార్చు]

రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి నర్సంపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.[1] ఆయన పొత్తుల్లో భాగంగా 2018లో పశ్చిమ వరంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయి, 4 సెప్టెంబర్ 2019లో టీడీపీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరాడు.[2]

సంవత్సరం నియోజక వర్గం గెలుపొందిన అభ్యర్థి పేరు పార్టీ ప్రత్యర్థి పేరు పార్టీ
2018 వరంగల్ పశ్చిమ దాస్యం వినయ్‌భాస్కర్‌ తెలంగాణ రాష్ట్ర సమితి రేవూరి ప్రకాష్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2014 నర్సంపేట దొంతి మాధవ రెడ్డి స్వతంత్ర పెద్ది సుదర్శన్‌ రెడ్డి టిఆర్ఎస్
2009 నర్సంపేట రేవూరి ప్రకాష్ రెడ్డి తె.దే.పా దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2004 నర్సంపేట కంభంపాటి లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ రేవూరి ప్రకాష్ రెడ్డి తె.దే.పా
1999 నర్సంపేట రేవూరి ప్రకాష్ రెడ్డి తె.దే.పా దొంతి మాధవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1994 నర్సంపేట రేవూరి ప్రకాష్ రెడ్డి తె.దే.పా మద్దికాయల ఓంకార్ ఎంసీపీఐ

మూలాలు[మార్చు]

  1. Sakshi (9 November 2018). "విభిన్న రాజకీయం". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.
  2. Sakshi (5 September 2019). "బీజేపీలో చేరిన రేవూరి ప్రకాశ్‌". Archived from the original on 13 December 2021. Retrieved 13 December 2021.