చల్లా ధర్మారెడ్డి
చల్లా ధర్మారెడ్డి | |||
| |||
తెలంగాణ శాసనసభ్యుడు
| |||
పదవీ కాలం 2014 - ప్రస్తుతం | |||
ముందు | ఎం.బిక్షపతి | ||
---|---|---|---|
నియోజకవర్గం | పరకాల శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1967, మే 25 వరంగల్లు | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | మల్లారెడ్డి, సమ్మక్క | ||
జీవిత భాగస్వామి | జ్యోతి | ||
సంతానం | ఇద్దరు కుమార్తెలు (మానస, జాహ్నవి) | ||
నివాసం | హైదరాబాదు |
చల్లా ధర్మారెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.[1] ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున పరకాల శాసనసభ నియోజకవర్గం నుండి శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[2]
జననం
[మార్చు]ధర్మారెడ్డి 1967, మే 25న మల్లారెడ్డి, సమ్మక్క దంపతులకు వరంగల్లు లో జన్మించాడు. 2018లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి బిఏ విద్య పూర్తిచేశాడు.[3] వ్యవసాయంతోపాటు వ్యాపారం కూడా చేశాడు.[4]
వ్యక్తిగత జీవితం
[మార్చు]ధర్మారెడ్డికి జ్యోతితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమార్తెలు (మానస, జాహ్నవి) ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ధర్మారెడ్డి, 2014 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో టీడీపీ తరపున పరకాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి ముద్దసాని సహోదర్ రెడ్డిపై 9108 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5][6] 2018లో టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ తో పరకాల శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖపై 46,519 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[7][8][9][10]
చల్లా ధర్మారెడ్డి 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయాడు.[11]
ఇతర వివరాలు
[మార్చు]ధర్మారెడ్డి ఆస్ట్రేలియా, చైనా, మలేషియా, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ "Challa . Dharma Reddy(TRS):Constituency- PARKAL(WARANGAL RURAL) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-08-20.
- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-08-20. Retrieved 2021-08-20.
- ↑ Eenadu (17 November 2023). "ప్రధాన అభ్యర్థులు విద్యావంతులే". Archived from the original on 17 November 2023. Retrieved 17 November 2023.
- ↑ "Challa Dharma Reddy | MLA | Parkal | Hanamkonda | TRS". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-27. Retrieved 2021-08-20.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-09-20. Retrieved 2019-06-04.
- ↑ Sakshi (12 December 2018). "'చల్ల'గా చరిత్ర తిరగరాశారు." Archived from the original on 4 June 2022. Retrieved 4 June 2022.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-04-01. Retrieved 2019-06-04.
- ↑ Mayabrahma, Roja (2018-12-11). "Konda Surekha lost to TRS candidate Challa Dharma Reddy". www.thehansindia.com (in ఇంగ్లీష్). Retrieved 2021-08-20.
- ↑ Namasthe Telangana (4 November 2023). "Telangana Challa Dharma Reddy". Archived from the original on 4 November 2023. Retrieved 4 November 2023.
- ↑ telugu, NT News (22 August 2023). "వరంగల్ ఉమ్మడి జిల్లా బరిలో వీరే.. బీఆర్‌ఎస్ అభ్యర్థుల బయోడేటా." www.ntnews.com. Archived from the original on 14 April 2024. Retrieved 14 April 2024.