దాస్యం ప్రణయ్ భాస్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దాస్యం ప్రణయ్ భాస్కర్
దాస్యం ప్రణయ్ భాస్కర్


శాసనసభ

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-06) 1956 జులై 6
పరకాల, వరంగల్ జిల్లా, తెలంగాణ, భారతదేశం
మరణం 1999 జులై 6 (1999-07-06)(వయసు 43)
తెలంగాణ, భారతదేశం
రాజకీయ పార్టీ
తెలుగుదేశం పార్టీ
(1982–1996)
జీవిత భాగస్వామి సబితా భాస్కర్
సంతానము అభినయ భాస్కర్, అపూర్వ భాస్కర్
పూర్వ విద్యార్థి వరంగల్
మతం హిందూ

దాస్యం ప్రణయ్ భాస్కర్ (జూలై 6, 1956 - జూలై 6, 1999) తెలంగాణ రాష్ట్రంకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి. 1994లో తెలుగుదేశం పార్టీ తరపున హన్మకొండ శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించాడు.

జీవిత విషయాలు[మార్చు]

ప్రణయ్ భాస్కర్ 1956, జూలై 6న తెలంగాణ రాష్ట్రం, వరంగల్ జిల్లాలోని పరకాలలో జన్మించాడు.[1]

రాజకీయ ప్రస్థానం[మార్చు]

1989లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున హనుమకొండ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పి.వి. రంగారావు చేతిలో ఓడిపోయాడు. 1994లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీచేసి గెలుపొందాడు. ఎన్.టి.ఆర్. మంత్రివర్గంలో క్రీడలు, యువజన సేవలు, యువజన సంక్షేమం, ఎన్.సి.సి. స్వయం ఉపాధి శాఖల మంత్రిగా పనిచేశాడు.

తెలంగాణ ఉద్యమంలో పాత్ర[మార్చు]

ప్రణయ్ భాస్కర్ అప్పటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నాడు. కుందూరు జానారెడ్డి ఏకగ్రీవంగా సిరికొండ మధుసూధనాచారిని స్పీకర్‌గా ప్రకటించిన తరువాత, అన్ని రాజకీయ పార్టీల శాసనసభ్యులు చారి ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. 90ల చివరలో ప్రణయ్ భాస్కర్ తెలంగాణ గురించి ప్రస్తావించడం శాసనసభ రికార్డుల నుండి తొలగించబడిందని, ఆ సభ్యుడిని అప్పటి స్పీకర్ అడ్డుకున్నారని ముఖ్యమంత్రి కెసీఆర్ గుర్తుచేశాడు.[2]

మరణం[మార్చు]

ప్రణయ్ భాస్కర్ 1999, జూలై 6న మరణించాడు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 The Hans India, Telangana (7 July 2017). "Pranay Bhasker an inspiration to Telangana movement". Archived from the original on 24 March 2018. Retrieved 28 June 2020.
  2. Deccan Chronicle, Telangana (11 June 2014). "First Telangana assembly speaker appointed; historic moment, says KCR". Archived from the original on 22 ఆగస్టు 2018. Retrieved 28 June 2020. Check date values in: |archivedate= (help)