Jump to content

పి.మహేందర్ రెడ్డి

వికీపీడియా నుండి
(పట్నం మహేందర్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
పి.మహేందర్ రెడ్డి
పి.మహేందర్ రెడ్డి


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 జూన్ 2019 - ప్రస్తుతం
ముందు పట్నం నరేందర్‌ రెడ్డి
నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల

వ్యక్తిగత వివరాలు

జననం (1956-07-07) 1956 జులై 7 (వయసు: 70)
వికారాబాద్ జిల్లా , తెలంగాణ రాష్ట్రం, భారతదేశం
రాజకీయ పార్టీ కాంగ్రెస్
ఇతర రాజకీయ పార్టీలు భారత్ రాష్ట్ర సమితి
తెలుగుదేశం పార్టీ)
తల్లిదండ్రులు పట్నం మల్లారెడ్డి, రుక్కమ్మ
జీవిత భాగస్వామి పట్నం సునీతా రెడ్డి [1]
బంధువులు సబితా ఇంద్రారెడ్డి (మేనత్త), పట్నం నరేందర్ రెడ్డి (తమ్ముడు)
సంతానం పట్నం రినీష్‌ రెడ్డి (కుమారుడు), మనీషా రెడ్డి (కుమారై)
నివాసం బంజారాహిల్స్‌. హైదరాబాద్

పట్నం మహేందర్‌ రెడ్డి తెలంగాణ కు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన ప్రస్తుతం తెలంగాణ శాసనమండలిలో సభ్యుడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

మహేందర్ రెడ్డి వెటర్నరీ సైన్సులో డిగ్రీ పూర్తిచేశాడు. ఇతనికి ఒక కుమారుడు, ఒక కుమారై. మహేందర్ రెడ్డి భార్య పట్నం సునీతా రెడ్డి 2001-06 కాలంలో రంగారెడ్డి జిల్లా పరిషత్తు చైర్‌పర్సన్‌గా పనిచేసింది. ఈమె బంట్వారం నుంచి జడ్పీటీసిగా ఎన్నికైంది.[2]

రాజకీయ జీవితం

[మార్చు]

పట్నం మహేందర్‌రెడ్డి 1994లో తాండూరు అసెంబ్లీ స్థానం నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1999లో వరుసగా రెండవసారి గెలిచి, 2004లో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావు చేతిలో ఓటమి పాలయ్యాడు. పట్నం మహేందర్‌రెడ్డి 2009లో మాజీ మంత్రి ఎం.మాణిక్ రావు కుమారుడు ఎం.రమేష్‌పై 13205 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి మూడవసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరి,రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాడు.[3] 2019 లో కాంగ్రెస్ కు చెందిన పైలెట్ రోహిత్ రెడ్డి చేతిలో పరాజయం పొందినాడు. ఆయనకు 31 మే 2019లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచాడు.[4] ఆయన ఎమ్మెల్సీగా 19 జూన్ 2019న ప్రమాణ స్వీకారం చేశాడు.[5] ఆయన ఈ పదవిలో 4 జనవరి 2022 వరకు కొనసాగి[6], తిరిగి రెండవసారి 27 జనవరి 2022న ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాడు.[7]

పట్నం మహేందర్‌రెడ్డి 2023 ఆగస్ట్ 24న రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై మహేందర్‌రెడ్డితో ప్రమాణస్వీకారం చేయించగా,[8] ఆయనకు గనులు, భూగర్భ వనరులు, సమాచార, పౌర సంబంధాల శాఖలను కేటాయించారు.[9][10] ఆయన ఆగష్టు 30న సచివాలయం మొదటి అంతస్థులోని కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించాడు.[11][12]

పట్నం మహేందర్ రెడ్డిని శాసనమండలి చీఫ్‌ విప్‌గా బాధ్యతలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2024 అక్టోబర్ 1న ఉత్తర్వులు జారీ చేసింది.[13]

మూలాలు

[మార్చు]
  1. Sakshi (14 July 2014). "పట్టం పట్నంకే." Sakshi. ఒరిజినల్ నుండి 18 July 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2021.
  2. Handbook of Statistics, Rangareddy Dist, 2007-08, PNo 12
  3. Nava Telangana (14 May 2017). "రహదారుల అభివృద్ధికి కృషి". Nava Telangana. ఒరిజినల్ నుండి 18 జూలై 2021 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2021.{{cite news}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Sakshi (4 June 2019). "'పట్నం'కే పట్టం". ఒరిజినల్ నుండి 18 July 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2021.
  5. Zee News Telugu (19 June 2019). "కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారం పూర్తి". ఒరిజినల్ నుండి 16 May 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2021.
  6. News18 Telugu (31 May 2019). "కాసేపట్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. మూడు స్థానాలకు పోటీ." ఒరిజినల్ నుండి 18 July 2021 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 18 July 2021.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  7. Namasthe Telangana (27 January 2022). "ఎమ్మెల్సీలుగా ప్రమాణం స్వీకారం చేసిన పట్నం మహేందర్‌ రెడ్డి, యాదవరెడ్డి". ఒరిజినల్ నుండి 27 జనవరి 2022 న ఆర్కైవు చెయ్యబడింది చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 27 January 2022.
  8. Namasthe Telangana (25 August 2023). "పండుగలా ప్రమాణ స్వీకారం". the original నుండి 26 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 26 August 2023.
  9. Eenadu (25 August 2023). "గనుల శాఖ మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి". the original నుండి 30 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 August 2023.
  10. Andhrajyothy (24 August 2023). "గనులు, సమాచారశాఖ మంత్రిగా మహేందర్‌రెడ్డి". the original నుండి 30 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 30 August 2023.
  11. Namasthe Telangana (31 August 2023). "మంత్రిగా పట్నం బాధ్యతలు". the original నుండి 31 August 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 31 August 2023.
  12. Eenadu (29 October 2023). "అంచెలంచెలుగా.. అత్యున్నతంగా." the original నుండి 29 October 2023 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 29 October 2023.
  13. Andhrajyothy (1 October 2024). "MLC: ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డికి ఎస్కార్ట్‌ కేటాయింపు." the original నుండి 4 October 2024 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 4 October 2024.