పట్నం నరేందర్‌ రెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పట్నం నరేందర్‌ రెడ్డి
పట్నం నరేందర్‌ రెడ్డి


పదవీ కాలం
2018- ప్రస్తుతం
ముందు రేవంత్ రెడ్డి
నియోజకవర్గం కొడంగల్ శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం జనవరి 22, 1970
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి శృతి
నివాసం కొడంగల్, తెలంగాణ

పట్నం నరేందర్‌ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1] అతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందినవాడు.[2]

జీవిత విశేషాలు[మార్చు]

పట్నం నరేందర్ రెడ్డి షాబాద్ మండలంలోని గొల్లుర్‌దుర్గ గ్రామంలో 1970 జనవరి 22న జన్మించాడు. అతని తండ్రి మల్లారెడ్డి. అతను ఉమ్మడి మహాబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం నుండి ఎన్నికై మంత్రిగా పనిచేసిన పట్నం మహేందర్ రెడ్డి అతని సోదరుడు. [3] తెలంగాణ ఆవిర్భావం తరువాత అతను కొడంగల్ నుండి మరలా శాసన మండలి సభ్యునిగా ఎన్నికైనాడు.

1991 బి.ఎస్సీ(అగ్రికల్చర్) ను మహారాష్ట్రలోని అకోలా లో ఉన్న పి.కె.వి. విశ్వవిద్యాలయం నుంచి చేసాడు. అతను తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరాడు. 2009 నుండి 2014 వరకు కొడంగల్ నుండి టి.ఆర్.ఎస్ పార్టీ తరపున శాసనమండలి సభ్యునిగా 2014-15 కాలంలో పనిచేసాడు. అతను శాసన మండలి సభ్యునిగా 2016 నుండి 2018 వరకు పనిచేసి 2018లో శాసన సభ ఎన్నికలలో కొడంగల్ నియోజకవర్గం నుండి పోటీ చేసాడు. [4]

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీ చేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి పై 9319 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. అనంతరం తన ఎం.ఎల్.సి పదవికి రాజీనామా చేసాడు.[5]

ఆరోపణలు[మార్చు]

అతను తెలంగాణ షాబాద్ లో నరేందర్ రెడ్డి పేరు మీద పెట్రోల్ పంపు ఉందని, తనకు పెట్రోల్ పంపు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొనకుండా నరేందర్ రెడ్డి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చార‌ని రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేసాడు. ఎన్నికల ఖర్చులకు విదేశాల నిధులు తీసుకోవడం నిషేధం. ఆ విరాళాలు తీసుకున్నట్లయితే పోటీ కి వాళ్ళు అనర్హులు. అమెరికా నుంచి ఎన్నికల ఖర్చుకోసం 5లక్షలు వచ్చినట్లు అఫిడవిట్ లో చూపించాడు. ఈ ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకుని నరేందర్ రెడ్డి ని అనర్హుడిగా ప్రకటించాలని రేవంత్ రెడ్డి కోరాడు.[6]

మూలాలు[మార్చు]

  1. https://www.cnbctv18.com/politics/kodangal-election-2018-results-patnam-narendra-reddy-of-trs-defeats-a-revanth-reddy-of-congress-1661161.htm/amp
  2. "Patnam Narender Reddy(TRS):Constituency- KODANGAL(VIKARABAD) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2020-06-22.
  3. "రేవంత్ రెడ్డిపై పోటీ చేసే టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరో తెలుసా?". Asianet News Network Pvt Ltd. Retrieved 2020-06-22.
  4. "Patnam Narender Reddy | MLA | TRS | Kodangal | Vikarabad | Telangana". theLeadersPage | the Leaders Page (in ఇంగ్లీష్). 2020-05-05. Retrieved 2020-06-22.
  5. shivakumar (2019-02-24). "స్థానిక 'మండలి' పోరుకు వేళాయె". Telangana తాజా వార్తలు | Latest Telugu Breaking News (in ఇంగ్లీష్). Retrieved 2020-06-22.
  6. Harikrishna (2019-01-24). "ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని అన‌ర్హుడిగా ప్ర‌క‌టించాలి..! హైకోర్ట్ లో రేవంత్ రెడ్డి పిటీష‌న్..!!". https://telugu.oneindia.com. Retrieved 2020-06-22. External link in |website= (help)

బాహ్య లంకెలు[మార్చు]