అక్షాంశ రేఖాంశాలు: Coordinates: Unknown argument format

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
(కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
కొడంగల్
—  శాసనసభ నియోజకవర్గం  —
కొడంగల్ is located in Telangana
కొడంగల్
కొడంగల్
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
దేశం భారతదేశం
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
ప్రభుత్వం
 - శాసనసభ సభ్యులు

కొడంగల్ శాసనసభ నియోజకవర్గం. నారాయణపేట, వికారాబాద్ జిల్లాల పరిధిలో ఉంది.2007లో చేయబడిన నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం ఈ శాసనసభ నియోజకవర్గంలో 5 మండలాలు ఉన్నాయి.[1] ఈ శాసనసభ నియోజక వర్గం మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగం. పునర్విభజనకు పూర్వం అసంపూర్తిగా ఉన్న మద్దూరు మండలం ప్రస్తుతం పూర్తిగా ఈ నియోజకవర్గంలో చేరగా, ఇదివరకు ఈ నియోజకవర్గంలో ఉన్న దామరగిద్ద మండలం కొత్తగా ఏర్పాటైన నారాయణపేట శాసనసభ నియోజకవర్గంలో కలిసింది.[2]

ఈ నియోజకవర్గం పరిధిలోని మండలాలు

[మార్చు]
మండలం జిల్లా
కోస్గి నారాయణపేట జిల్లా
మద్దూరు
గుండుమాల్
కొత్తపల్లి
కొడంగల్ వికారాబాదు జిల్లా
దౌల్తాబాద్
బొమ్రాస్‌పేట
దుద్యాల్

నియోజకవర్గపు గణాంకాలు

[మార్చు]
  • 2001 లెక్కల ప్రకారము జనాభా: 2,50,792.
  • ఓటర్ల సంఖ్య (2008 ఆగస్టు నాటికి): 1,92,937.[3]
  • ఎస్సీ, ఎస్టీల శాతం: 16.32%, 10.54

నియోజకవర్గపు భౌగోళిక సరిహద్దులు

[మార్చు]

మహబూబ్ నగర్ జిల్లాలో వాయవ్యాన ఉన్న ఈ నియోజకవర్గానికి తూర్పున రంగారెడ్డి జిల్లాకు చెందిన పరిగి శాసనసభ నియోజకవర్గం, ఉత్తరాన రంగారెడ్డి జిల్లాకే చెందిన తాండూర్ శాసనసభ నియోజకవర్గం ఉండగా, వాయవ్యాన, దక్షిణాన నారాయణపేట శాసనసభ నియోజకవర్గం ఉంది. పశ్చిమాన కర్ణాటక రాష్ట్రం సరిహద్దుగా ఉంది.

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
[4]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952[5] వీరాస్వామి కాంగ్రెస్ ఏకగ్రీవ ఎన్నిక[1][6] -
అనంతరెడ్డి కాంగ్రెస్ బి.జాన్ గోపాల్ ఆర్.పి.ఐ
1957 కె. అచ్యుతరెడ్డి కాంగ్రెస్ విఠల్‌ రావు పి.డి.ఎఫ్
1962 రుక్మారెడ్డి స్వతంత్ర పార్టీ కె. అచ్యుతరెడ్డి కాంగ్రెస్
1967 కె. అచ్యుతరెడ్డి కాంగ్రెస్ మల్లారెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1972 నందారం వెంకటయ్య స్వతంత్ర అభ్యర్థి కె.ఎస్.రెడ్డి స్వతంత్ర అభ్యర్థి
1978 రావులపల్లి గురునాథ్ రెడ్డి ఇండిపెండెంట్ (స్వతంత్ర అభ్యర్థి) చిన్న వీరన్న (పులి) భారత జాతీయ కాంగ్రెస్
1983 రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ నందారం వెంకటయ్య ఇండిపెండెంట్ (స్వతంత్ర అభ్యర్థి)
1985 నందారం వెంకటయ్య తెలుగుదేశం పార్టీ రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1989 రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ రతన్‌లాల్ లాహోటి తెలుగుదేశం పార్టీ
1994 నందారం వెంకటయ్య తెలుగుదేశం పార్టీ రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1996[7] నందారం సూర్యనారాయణ తెలుగుదేశం పార్టీ రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్
1999 రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ డి.శారద తెలుగుదేశం పార్టీ
2004 రావులపల్లి గురునాథ్ రెడ్డి భారత జాతీయ కాంగ్రెస్ ఎం.అనురాధ తెలుగుదేశం పార్టీ
2009 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రావులపల్లి గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2014 రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ రావులపల్లి గురునాథ్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి
2018 పట్నం నరేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2023[8][9] రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్

వివిధ పార్టీల పరిస్థితి

[మార్చు]

ఈ నియోజకవర్గంలో మొదటి నుంచి భారత జాతీయ కాంగ్రెస్ ఆధిపత్యం వహిస్తున్నది. 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తరువాత ఆ పార్టీ కూడా ఈ నియోజకవర్గంలో ఉనికిని చూపుతోంది. ఇప్పటివరకు జరిగిన శాసనసభ ఎన్నికలలో 4 సార్లు కాంగ్రెస్ విజయం సాధించగా, తెలుగుదేశం రెండు సార్లు విజయం సాధించింది. 1985 తరువాత విజయం సాధించిన అభ్యర్థులకు పోలైన ఓట్లలో 50% మించి ఓట్లు రావడం విశేషం. దీనికి ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో మూడో పార్టీ బలంగా లేకపోవడం. ఈ నియోకవర్గం నుంచి ప్రస్తుతం శాసనసభ్యుడిగా కొనసాగుతున్న గురునాథ్ రెడ్డి ఐదోసారి విజయం సాధించాడు. మొదటిసారి 1978లో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి గెలవగా ఆ తరువాత 4 సార్లు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి విజయం సాధించాడు.

1999 ఎన్నికలు

[మార్చు]

1999 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్.గురునాథ్ రెడ్డి తన ప్రత్యర్థి అయిన తెలుగుదేశం పార్టీకి చెందిన డి.శారదపై 13702 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు. గురునాథ్ రెడ్డికి 59624 ఓట్లు రాగా, శారద 45922 ఓట్లు సాధించింది.

2004 ఎన్నికలు

[మార్చు]

2004 శాసనసభ ఎన్నికలలో కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి చెందిన గురునాథ్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన ఎన్.ఎం.అనురాధపై 5965 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. గురునాథ్ రెడ్డి 61452 ఓట్లు సాధించగా, అరుణకు 55487 ఓట్లు లభించాయి.

2004 ఎన్నికల గణాంకాలు
ఓట్లు
పోలైన ఓట్లు
  
116939
గురునాథ్ రెడ్డి*
  
52.55%
అనురాధ*
  
47.45%
* చెల్లిన ఓట్లలో గెలుచుకున్న ఓట్లు
2004 ఎన్నికల గణాంకాలు
మొత్తం ఓట్లు 177327
పోలై చెల్లిన ఓట్లు 116939
ఓటింగ్ శాతం 65.97%
పోటీపడిన అభ్యర్థులు 2
పోలింగ్ కేంద్రంల సంఖ్య 188
అభ్యర్థి పేరు పార్టీ పొందిన ఓట్లు
గురునాథ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 61452
ఎం.ఎన్.అనురాధ తెలుగుదేశం పార్టీ 55487

2009 ఎన్నికలు

[మార్చు]

2009 ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ నాయకుడు ఆర్.గురునాథ్ రెడ్డి పోటీ చేయగా, తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ అయిన రేవంత్ రెడ్డి పోటీచేశాడు. భారతీయ జనతా పార్టీ నుండి అనంతరామచందర్, లోకసత్తా పార్టీ తరఫున ఎస్.జయప్రకాష్, ప్రజారాజ్యంతో పొట్టు పెట్టుకున్న మనపార్టీ తరఫు నుండి సావిత్రి పోటీచేశారు. ప్రధాన పోటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల మధ్య జరుగగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేవంత్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురునాథరెడ్డిపై 6989 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు.[10]

2009 ఎన్నికలలో వివిధ రాజకీయ పార్టీలు పొందిన ఓట్ల వివరాలు
క్రమసంఖ్య రాజకీయ పార్టీ పొందిన ఓట్లు
1 తెలుగుదేశం పార్టీ 61685
2 కాంగ్రెస్ పార్టీ 54696
3 భారతీయ జనతా పార్టీ 3172
4 ప్రజారాజ్యం పార్టీ 2784
5 లోక్‌సత్తా పార్టీ 884
6 ఇతరులు 9568

నియోజకవర్గపు ప్రముఖులు

[మార్చు]
ఆర్.గురునాథ్ రెడ్డి
మహబూబ్ నగర్ జిల్లాలోని సీనియర్ కాంగ్రెస్ నేతలలో ఒకడైన రావులపల్లి గురునాథ్ రెడ్డి మొత్తం 5 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యాడు. మధ్యలో రెండు సార్లు తెలుగుదేశం పార్టీకి చెందిన నందారం వెంకటయ్య చేతిలో పరాజయం పొందిననూ నియోజకవర్గంలో పట్టు కోల్పోలేడు. ఇతని కుమారుడు ముద్దయ్య దేశ్‌ముఖ్ కొడంగల్ మండల అధ్యక్షుడిగా పనిచేశాడు. 2009 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ పోటీ చేసిననూ [11] తెలుగుదేశం అభ్యర్థి రేవంత్ రెడ్డి చేతిలో సుమారు ఏడువేల ఓట్ల తేడాతో పరాజయం పొంది హాట్రిక్ అవకాశం కోల్పోయాడు.[12]
నందారం వెంకటయ్య
ఈ నియోజకవర్గం నుంచి మూడు సార్లు గెలుపొందిన నందారం వెంకటయ్య 1972లో స్వతంత్ర అభ్యర్థిగాను, 1985 , 1994లలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైనాడు.
అనుముల రేవంత్ రెడ్డి
2006లో మిడ్జిల్ మండలం జడ్పీటీసి సభ్యుడుగా విజయం సాధించి, ఆ తర్వాత రాజీనామా చేసి శాసనసభ ఉప ఎన్నికలలో గెలుపొందినాడు. 2009లో కొడంగల్ నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీచేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రావులపల్లి గుర్నాథరెడ్డిపై విజయం సాధించాడు. నాగం జనార్థన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయిన పిదప రేవంత్ రెడ్డి జిల్లాలోనే కాకుండా తెలంగాణ ప్రాంతంలోనే పార్టీ తరఫున ప్రముఖ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు. ఇతని దూకుడు స్వభావం వలన మీడియా లో ప్రముఖునిగా పేరు పొందాడు.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 Eenadu (3 November 2023). "నువ్వా.. నేనా?". Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.
  2. Eenadu (21 November 2023). "పాలమూరు పందెం కోళ్లు". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  3. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, పేజీ 1, తేది 01-10-2008.
  4. Eenadu (28 October 2023). "ఆసక్తికరం.. తీర్పు విభిన్నం". Archived from the original on 28 October 2023. Retrieved 28 October 2023.
  5. ద్విసభ్య నియోజకవర్గము
  6. Sakshi (26 October 2023). "చివరిసారిగా ఏకగ్రీవం ఎప్పుడు జరిగిందంటే." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
  7. శాసనసభ్యుడు నందారం వెంకటయ్య మరణించడంతో ఉపఎన్నికలు జరిగాయి
  8. Eenadu (4 December 2023). "కొడంగల్‌ చరిత్రలో భారీ మెజార్టీ". Archived from the original on 4 December 2023. Retrieved 4 December 2023.
  9. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  10. ఈనాడు దినపత్రిక, తేది 17-05-2009
  11. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 22-03-2009
  12. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా ఎడిషన్, తేది 17-05-2009