దౌలతాబాద్ (వికారాబాద్)
దౌలతాబాద్, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లా, దౌలతాబాద్ మండలానికి చెందిన గ్రామం.[1]
| దౌలతాబాద్ దేవగిరి |
|
| — రెవెన్యూ గ్రామం — | |
|
[[Image: |
|
| తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
| అక్షాంశరేఖాంశాలు: 17°00′00″N 77°34′00″E / 17.000°N 77.5667°E | |
|---|---|
| రాష్ట్రం | తెలంగాణ |
| జిల్లా | వికారాబాదు |
| మండలం | దౌలతాబాద్ |
| ప్రభుత్వం | |
| - Type | కాంగ్రెస్ |
| - సర్పంచి | బత్తుల శ్రీనివాస్ రెడ్డి |
| వైశాల్యము ref>"Doulathabad Village Census 2011". Census 2011.</ref> | |
| - మొత్తం | 89.67 km² (34.6 sq mi) |
| ఎత్తు [2] | 533 m (1,781 ft) |
| జనాభా (2011) | |
| - మొత్తం | 8,170 |
| - సాంద్రత | 94/km2 (243.5/sq mi) |
| - 1569 | 40.17% |
| [3] | |
| పిన్ కోడ్ | 509336 |
| ఎస్.టి.డి కోడ్ | |
ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 45 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత మహబూబ్ నగర్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది. ఇది గ్రామం మరియు మండలం కూడా ఏ మండలం కింద సుమారు 25 గ్రామాలు ఉన్నాయి. కామంతో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. రోడ్డు విస్తీర్ణం, దౌల్తాబాద్ లో పెద్ద చెరువు ఉంది నాయణపేట కొడంగల్ పట్ఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కింద కూడా దీనికి నీరు రాబోతుంది.
చరిత్ర
[మార్చు]పూర్వం ఈ ప్రాంతము కర్ణాటక రాష్ట్రములోని గుల్బర్గా జిల్లాలో భాగంగా ఉండేది. 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా తెలుగు మాట్లాడే ప్రాంతాలు తెలంగాణలో భాగమైనాయి. అప్పటినుంచి ఈ ప్రాంతము మహబూబ్ నగర్ జిల్లాలో . 1986లో మండలాల వ్యవస్థ ప్రకారం ఇది ప్రత్యేకంగా మండలంగా ఏర్పడి కొనసాగుతోంది.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1598 ఇళ్లతో, 8170 జనాభాతో 2587 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 4025, ఆడవారి సంఖ్య 4145. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 1203 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 180. గ్రామ జనగణన లొకేషన్ కోడ్ . ప్రస్తుతం 2025లో చేసిన కులగణం కల ప్రకారం 10500 జనాభా దాటి ఉందని అంచనా.
దేవాలయాలు
[మార్చు]File:గుట్టల మల్లన్న ఆలయం దౌల్తాబాద్.jpg
గ్రామంలో పలు హిందూ దేవాలయాలు ఉన్నాయి. ముఖ్యమైన దేవాలయాలు ఇవి:
- గుట్టల మల్లన్న దేవాలయం – గ్రామ పరిసర గుట్ట ప్రాంతంలో ఉన్న ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా ఘనంగా వేడుకలు నిర్వహించబడతాయి. ఈ సందర్భంగా డోలు వాయిద్యాలతో ఊరేగింపులు, అన్నదానం మరియు స్వామివారి కళ్యాణం నిర్వహించబడతాయి.గుట్టల మల్లన్న ఆలయం.
- శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం – ఈ దేవాలయానికి 100 సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్నట్లు స్థానికంగా భావించబడుతుంది. చెరువు సమీపంలో విస్తార ప్రాంగణంలో ఉంది. ప్రస్తుతం దేవాలయ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టబడ్డాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో రథోత్సవం నిర్వహించబడుతుంది.
- శ్రీ రామాలయం మరియు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం – ఈ దేవాలయాలు ఒకే ప్రాంగణంలో ఉన్నాయి. గ్రామంలో జరిగే శుభకార్యాల సందర్భంగా భజనలు మరియు ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.
- శ్రీ విదమ్మ దేవాలయం – ఈ దేవాలయం గ్రామానికి ముఖ్యమైన ఆధ్యాత్మిక కేంద్రంగా భావించబడుతుంది. ప్రతి సంవత్సరం జరిగే జాతర సందర్భంగా చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు మరియు జిల్లాల నుండి భక్తులు హాజరవుతారు. బోనాలు మరియు ఇతర సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించబడుతాయి.
- శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం – గ్రామంలో పూజలు నిర్వహించబడే దేవాలయం.
- భీమరాయ దేవాలయం – స్థానికంగా పూజలు జరిగే దేవాలయం.
విద్యా సౌకర్యాలు
[మార్చు]ప్రాథమిక విద్య
[మార్చు]- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (GPS)
- ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల
- ఉర్దూ ప్రాథమిక పాఠశాల
- వాగ్దేవి కాన్సెప్ట్ స్కూల్ (నర్సరీ నుండి 7వ తరగతి వరకు)
- అక్షర ప్లే స్కూల్ (నర్సరీ నుండి 7వ తరగతి వరకు)
ఉన్నత పాఠశాల విద్య
[మార్చు]- జడ్పీ హైస్కూల్ (ZPHS)
- ఉర్దూ హైస్కూల్
- కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం (KGBV) – బాలికల కోసం
- మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర వసతి విద్యాలయం (MJPBWERS) – బాలుర కోసం
జూనియర్ కళాశాలలు
[మార్చు]- ప్రభుత్వ జూనియర్ కళాశాల
- గ్రూపులు: MPC, BiPC, MEC, CEC, HEC - మాధ్యమం: తెలుగు మరియు ఇంగ్లీష్[1]
- కస్తూర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాల
- MJPBWERS బాలుర జూనియర్ కళాశాల
- శ్రీ వివేకానంద జూనియర్ కళాశాల (2005–06లో స్థాపితం, ప్రస్తుతం కార్యకలాపాలు లేవు)
డిగ్రీ విద్య
[మార్చు]- కోస్గి ప్రభుత్వ డిగ్రీ కళాశాల – సుమారు 20 కి.మీ
- కొడంగల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల – సుమారు 20 కి.మీ
- నారాయణపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల – సుమారు 45 కి.మీ
- మహబూబ్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల – సుమారు 55 కి.మీ
మెడికల్ విద్య
[మార్చు]- నారాయణపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల – సుమారు 45 కి.మీ
- కొడంగల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల – సుమారు 20 కి.మీ
- మహబూబ్‌నగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాల – సుమారు 55 కి.మీ
ఇంజనీరింగ్ విద్య
[మార్చు]- కోస్గి ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల – సుమారు 20 కి.మీ
- కొడంగల్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల – సుమారు 20 కి.మీ
- నారాయణపేట ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల – సుమారు 45 కి.మీ
- మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల – సుమారు 55 కి.మీ
వైద్య సౌకర్యం
[మార్చు]ప్రభుత్వ వైద్య సౌకర్యం
[మార్చు]దౌలతాబాద్లో ఉన్న ఒకప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ముగ్గురు డాక్టర్లు, ఐదుగురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు. ఒక ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో డాక్టర్లు లేరు. ఒకరు పారామెడికల్ సిబ్బంది ఉన్నారు. ఒక పశు వైద్యశాలలో ఇద్దరు డాక్టర్లు, ముగ్గురు పారామెడికల్ సిబ్బందీ ఉన్నారు.
సమీప సామాజిక ఆరోగ్య కేంద్రం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, టి. బి వైద్యశాల గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి. అలోపతి ఆసుపత్రి, ప్రత్యామ్నాయ ఔషధ ఆసుపత్రి, డిస్పెన్సరీ, సంచార వైద్య శాల, కుటుంబ సంక్షేమ కేంద్రం గ్రామం నుండి 10 కి.మీ. కంటే ఎక్కువ దూరంలో ఉన్నాయి.
ప్రైవేటు వైద్య సౌకర్యం
[మార్చు]గ్రామంలో 8 ప్రైవేటు వైద్య సౌకర్యాలున్నాయి. ఎమ్బీబీయెస్ డాక్టర్లు ఇద్దరు, ఎమ్బీబీయెస్ కాకుండా ఇతర డిగ్రీ చదివిన డాక్టర్లు ఇద్దరు, డిగ్రీ లేని డాక్టర్లు నలుగురు ఉన్నారు. మూడు మందుల దుకాణాలు ఉన్నాయి.
తాగు నీరు
[మార్చు]గ్రామంలో కుళాయిల ద్వారా రక్షిత మంచినీటి సరఫరా జరుగుతోంది. గ్రామంలో ఏడాది పొడుగునా చేతిపంపుల ద్వారా నీరు అందుతుంది. బోరుబావుల ద్వారా కూడా ఏడాది పొడుగునా నీరు అందుతుంది. చెరువు ద్వారా గ్రామానికి తాగునీరు లభిస్తుంది.
వ్యాపారాలు మరియు వాణిజ్యా
[మార్చు]సమాచార సౌకర్యాలు
[మార్చు]దౌలతాబాద్ లో పోస్టాఫీసు సౌకర్యం, సబ్ పోస్టాఫీసు సౌకర్యం ఉన్నాయి. పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్ ఆఫీసు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. లాండ్ లైన్ టెలిఫోన్, పబ్లిక్ ఫోన్ ఆఫీసు, మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ కెఫె / సామాన్య సేవా కేంద్రం, ప్రైవేటు కొరియర్ మొదలైన సౌకర్యాలు ఉన్నాయి.
ప్రయాణ సౌకర్యాలు
[మార్చు]కోడంగల్, కోస్గి, నారాయణపేట నుంచి బస్సు సౌకర్యం ఉంది. కర్ణాటక సరిహద్దులో జిల్లా కేంద్రానికి చాలాదూరంలో ఉండుటచే, ప్రధాన రహదారిపై లేకుండుటచే ప్రయాణ వసతులు అంతంతమాత్రముగానే ఉన్నాయి. హైదరాబాదు-బీజాపూర్ ప్రధాన రహదారి రావల్‌పల్లి నుంచి పైవేటు జీపులు, ఆటోల ద్వారా మండల కేంద్రానికి చేరుకోవచ్చు.గ్రామానికి సమీప ప్రాంతాల నుండి ప్రభుత్వ రవాణా సంస్థ బస్సులుప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. సమీప గ్రామాల నుండి ఆటో సౌకర్యం కూడా ఉంది. వ్యవసాయం కొరకు వాడేందుకు గ్రామంలో ట్రాక్టర్లున్నాయి. రైల్వే స్టేషన్ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.ప్రధాన జిల్లా రహదారి, జిల్లా రహదారి గ్రామం గుండా పోతున్నాయి. రాష్ట్ర రహదారి గ్రామం నుండి 5 నుండి 10 కి.మీ. దూరంలో ఉంది. జాతీయ రహదారి గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. గ్రామంలో తారు రోడ్లు, కంకర రోడ్లు, మట్టిరోడ్లూ ఉన్నాయి.
మార్కెటింగు, బ్యాంకింగు
[మార్చు]గ్రామంలో ఏటీఎమ్, వాణిజ్య బ్యాంకు, సహకార బ్యాంకు ఉన్నాయి. గ్రామంలో స్వయం సహాయక బృందం, పౌర సరఫరాల కేంద్రం, వారం వారం సంత ఉన్నాయి.వ్యవసాయ పరపతి సంఘం గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది. వ్యవసాయ మార్కెటింగ్ సొసైటీ గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
ఆరోగ్యం, పోషణ, వినోద సౌకర్యాలు
[మార్చు]గ్రామంలో సమీకృత బాలల అభివృద్ధి పథకం, అంగన్ వాడీ కేంద్రం, ఇతర పోషకాహార కేంద్రాలు, ఆశా కార్యకర్త ఉన్నాయి. గ్రామంలో ఆటల మైదానం, గ్రంథాలయం, పబ్లిక్ రీడింగ్ రూం ఉన్నాయి. గ్రామంలో వార్తాపత్రిక పంపిణీ జరుగుతుంది. అసెంబ్లీ పోలింగ్ కేంద్రం, జనన మరణాల నమోదు కార్యాలయం ఉన్నాయి. సినిమా హాలు గ్రామం నుండి 10 కి.మీ.కి పైబడిన దూరంలో ఉంది.
విద్యుత్తు
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. రోజుకు 7 గంటల పాటు వ్యవసాయానికి, 10 గంటల పాటు వాణిజ్య అవసరాల కోసం కూడా విద్యుత్ సరఫరా చేస్తున్నారు.
భూమి వినియోగం
[మార్చు]దౌలతాబాద్ (వికారాబాద్)లో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 120 హెక్టార్లు
- వ్యవసాయం సాగని, బంజరు భూమి: 900 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక ప్రాంతాలు, ఇతర మేత భూమి: 190 హెక్టార్లు
- వ్యవసాయం చేయదగ్గ బంజరు భూమి: 952 హెక్టార్లు
- నికరంగా విత్తిన భూమి: 425 హెక్టార్లు
- వివిధ వనరుల నుండి సాగునీరు లభిస్తున్న భూమి: 425 హెక్టార్లు
నీటిపారుదల సౌకర్యాలు
[మార్చు]దౌలతాబాద్లో వ్యవసాయానికి నీటి సరఫరా కింది వనరుల ద్వారా జరుగుతోంది.మండలంలో 10 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 949 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[6]
- బావులు/బోరు బావులు: 160 హెక్టార్లు* చెరువులు: 245 హెక్టార్లు* వాటర్‌షెడ్ కింద: 20 హెక్టార్లు
ఉత్పత్తి
[మార్చు]దౌలతాబాద్ (వికారాబాద్)లో ఈ కింది వస్తువులు ఉత్పత్తి అవుతున్నాయి.
ప్రధాన పంటలు
[మార్చు]భౌగోళికం (Geography)
[మార్చు]దౌల్తాబాద్ 17.05°N 77.56°E వద్ద ఉంది. ఇది సముద్ర మట్టానికి సగటున 543 మీటర్ల (1784 అడుగులు) ఎత్తులో ఉంది.
గ్రామ పంచాయతీ మరియు అభివృద్ధి
[మార్చు]దౌల్తాబాద్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామం ఆధునీకరణ దిశగా అడుగులు వేస్తోంది:
- మౌలిక సదుపాయాలు: గ్రామంలో అంతర్గత రోడ్ల నిర్మాణం మరియు పాత రోడ్ల పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి.
- మాస్టర్ ప్లాన్: పట్టణీకరణకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ రూపొందించి, డ్రైనేజీ వ్యవస్థ మరియు క్రమబద్ధమైన నివాస స్థలాల అభివృద్ధిపై దృష్టి సారించారు.
- వీధి దీపాలు: ప్రధాన వీధులన్నింటిలో ఎల్‌ఈడీ (LED) వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరిగింది.
విద్యుత్ శక్తి
[మార్చు]గ్రామంలో గృహావసరాల నిమిత్తం నిరంతర విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం, వ్యవసాయానికి రోజుకు 7 గంటలు మరియు వాణిజ్య అవసరాలకు 10 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయబడుతోంది. [7]
భూ వినియోగం
[మార్చు]దౌల్తాబాద్ మండలంలో భూ వినియోగం కింది విధంగా ఉంది:
- అడవి: 120 హెక్టార్లు
- వ్యవసాయేతర/బంజరు భూమి: 900 హెక్టార్లు
- శాశ్వత పచ్చిక బయళ్ళు: 190 హెక్టార్లు
- నికర సాగు భూమి: 425 హెక్టార్లు
నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం (NKLIS)
[మార్చు]తెలంగాణ ప్రభుత్వం సుమారు ₹4,350 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకాన్ని చేపట్టింది. [8]
- దౌల్తాబాద్ ప్రాముఖ్యత: ఈ ప్రాజెక్టు రెండవ దశలో భాగంగా దౌల్తాబాద్ పెద్ద చెరువును కృష్ణా జలాలతో నింపడం ద్వారా మండలంలోని సుమారు 53,745 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
- త్రాగునీరు: ఈ పథకం ద్వారా 0.38 టీఎంసీల నీటిని త్రాగునీటి అవసరాలకు కేటాయించారు.
రవాణా మరియు రైల్వే
[మార్చు]వికారాబాద్ – కృష్ణా నూతన రైల్వే లైన్
[మార్చు]కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ రైల్వే లైన్ దౌల్తాబాద్ మీదుగా వెళ్లనుంది. [9]
- దౌల్తాబాద్ రైల్వే స్టేషన్: ఈ గ్రామంలో కొత్త రైల్వే స్టేషన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి, ఇది స్థానిక రైతులు తమ పంటలను ఎగుమతి చేయడానికి మరియు ప్రయాణ సౌకర్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.
రాబోయే అభివృద్ధి పనులు (Upcoming Developments)
[మార్చు]- నాలుగు వరుసల రహదారి: రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడానికి ప్రధాన రహదారిని 4-లైన్ రోడ్డుగా విస్తరిస్తున్నారు.
- ప్రభుత్వ జూనియర్ కళాశాల: నూతన ప్రభుత్వ కళాశాల భవన నిర్మాణం సుమారు 70% పూర్తయింది.
- గ్రంథాలయం: విద్యార్థుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కొత్త గ్రంథాలయం (Public Library) ప్రారంభించబడింది.
స్థానిక వ్యాపారం మరియు ఆర్థిక వ్యవస్థ
[మార్చు]గ్రామంలో వాణిజ్య రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది:
- 20కి పైగా కిరాణా దుకాణాలు, 2 హోల్‌సేల్ షాపులు ఉన్నాయి.
- 6 దాబాలు, 5 హోటళ్లు, మరియు 1 పెట్రోల్ బంక్ అందుబాటులో ఉన్నాయి.
- మీ-సేవా కేంద్రాలు, డిజిటల్ సెంటర్లు మరియు మొబైల్ రిపేర్ షాపులు స్థానికులకు సేవలు అందిస్తున్నాయి.
ఆధారాలు
[మార్చు]- ↑ 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "Doultabad Geographical Profile".
- ↑ "Doulathabad Population Data". Census 2011.
- ↑ "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
- ↑ Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79
- ↑ Census of India 2011, Village Amenities of Telangana.
- ↑ Telangana Irrigation Department - NKLIS Project Report
- ↑ Indian Railways - New Line Projects South Central Railway
