కోస్గి

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
కోస్గి
—  మండలం  —
మహబూబ్ నగర్ జిల్లా పటములో కోస్గి మండలం యొక్క స్థానము
మహబూబ్ నగర్ జిల్లా పటములో కోస్గి మండలం యొక్క స్థానము
కోస్గి is located in Telangana
కోస్గి
తెలంగాణ పటములో కోస్గి యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°59′02″N 77°43′10″E / 16.983905°N 77.719345°E / 16.983905; 77.719345
రాష్ట్రం తెలంగాణ
జిల్లా మహబూబ్ నగర్
మండల కేంద్రము కోస్గి
గ్రామాలు 24
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 57,495
 - పురుషులు 28,575
 - స్త్రీలు 28,920
అక్షరాస్యత (2011)
 - మొత్తం 45.50%
 - పురుషులు 59.39%
 - స్త్రీలు 31.85%
పిన్ కోడ్ 509339

కోస్గి, తెలంగాణ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము మరియు అదే పేరు కల ఒక గ్రామము. పిన్ కోడ్: 509339. ఇది జిల్లా కేంద్రమైన మహబూబ్ నగర్ నుండి రంగారెడ్డి జిల్లా తాండూర్ వెళ్ళు మార్గములో ఉంది. జిల్లా కేంద్రం నుండి ఈ గ్రామము 45 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామము నారాయణ పేట రెవెన్యూ డివిజన్ లో భాగం.

కోస్గి గ్రామము బస్టాండు వెలుపలి దృశ్యం

జనాభా[మార్చు]

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 57418. ఇందులో పురుషుల సంఖ్య 28575, స్త్రీల సంఖ్య 28843. అక్షరాస్యుల సంఖ్య 27400.[1]

విద్యాసంస్థలు[మార్చు]

  • ప్రభుత్వ జూనియర్ కళాశాల (స్థాపన : 1982-83
  • ప్రజ్ఞ జూనియర్ కళాశాల (స్థాపన : 2001-02
  • స్కాలర్స్ జూనియర్ కళాశాల (స్థాపన : 2005-06

నీటిపారుదల[మార్చు]

మండలంలో 16 చిన్ననీటిపారుదల వనరుల ద్వారా 1321 హెక్టార్ల ఆయకట్టు వ్యవసాయ భూములున్నాయి.[2]

పశుసంపద[మార్చు]

2007 నాటి పశుగణన ప్రకారం మండలంలో 46వేల గొర్రెలు, 24వేల మేకలు, 17 గాడిదలు, 940 పందులు, 3600 కుక్కలు, 35 కుందేళ్ళు, 32వేల కోళ్ళు, 12వేల దున్నపోతులు ఉన్నాయి.

కొన్ని విషయాలు[మార్చు]

  • అసెంబ్లీ నియోజకవర్గం : కొడంగల్.
  • పార్లమెంటు నియోజకవర్గం : మహబూబ్ నగర్.
  • జడ్పీటీసి : ఎన్.వెంకటమ్మ.
  • మండల అధ్యక్షుడు : నవరతన్ రెడ్డి.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుతోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
  2. Handbook of Statistics, Mahabubnagar, 2008, Page No 79


"https://te.wikipedia.org/w/index.php?title=కోస్గి&oldid=1980659" నుండి వెలికితీశారు