బాజిరెడ్డి గోవర్దన్
బాజిరెడ్డి గోవర్ధన్ | |||
| |||
పదవీ కాలం 2014–18, 2018 - ప్రస్తుతం | |||
నియోజకవర్గం | నిజామాబాదు (గ్రామీణ) శాసనసభ నియోజకవర్గం | ||
---|---|---|---|
పదవీ కాలం 2021 సెప్టెంబరు 16 - 2023 అక్టోబరు 05 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
జీవిత భాగస్వామి | వినోద,కీ. శే. శోభ [1] |
బాజిరెడ్డి గోవర్దన్ (Bajireddy Goverdhan) తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి తరపున నిజామాబాద్ రూరల్ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.
జననం, విద్య
[మార్చు]గోవర్ధన్ దిగంబర్, శాంతమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లా, సిరికొండ మండలంలోని చిమన్‌పల్లె గ్రామంలో జన్మించాడు.[2] అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం నుండి 1992లో బిఏ పూర్తిచేశాడు. ఆ తరువాత కొంతకాలం వ్యవసాయం చేశాడు.[3]
వ్యక్తిగత జీవితం
[మార్చు]గోవర్ధన్ కు వినోద, శోభారాణితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు
[మార్చు]గోవర్ధన్ స్వతంత్రంగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. 1973లో పోలీస్ పటేల్‌గా పనిచేసి, 1981లో చిమన్‌పల్లి సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. ఆ తరువాత 1986లో సిరికొండ మండల పరిషత్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.[4] 1986లో ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్ డైరెక్టర్ అయ్యాడు. 1994లో ఆర్మూర్ శాసనసభ నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణ దేవి చేతిలో 14,043 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. ఆ తరువాత అతను పిఏసిఎస్ ఛైర్మన్‌గా పనిచేశాడు. హౌసింగ్ బోర్డు కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.
గోవర్ధన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో చేరి, 1999–2004 వరకు ఆర్మూర్ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా,[5] 2004–2009 వరకు బాన్సువాడ నియోజకవర్గం శాసనసభ సభ్యుడిగా పనిచేశాడు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరాడు.[6] 2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డి. శ్రీనివాస్ పై 26,000 వేలకు పైగా ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[7][8] 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేకుల భూపతిరెడ్డి పై 29,855 ఓట్ల అధిక్యంతో గెలుపొందాడు.[9][10] 2015–2018 వరకు, తెలంగాణ శాసనసభ వక్ఫ్ భూములపై హౌస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.
బాజిరెడ్డి గోవర్దన్ 2021 సెప్టెంబరు 16న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) చైర్మన్‌గా నియమితుడై,[11] సెప్టెంబరు 20న బాధ్యతలు చేపట్టాడు.[12]
హోదాలు
[మార్చు]- సర్పంచ్, చిమ్మన్‌పల్లి గ్రామ పంచాయతీ
- ప్రెసిడెంట్, ఎంపిపి, సిరికొండ మండలం (రెండుసార్లు)
- ఛైర్మన్, పిఏసిఎస్, సిరికొండ
- డైరెక్టర్, ఎపి స్టేట్ ఫైనాన్స్ కార్పోరేషన్
- చైర్మన్, హౌసింగ్ బోర్డు కమిటీ
- ఛైర్మన్, వక్ఫ్ భూములపై హౌస్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర శాసనసభ (10.01.2015 - 06.09.2018)
- తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ (2021 సెప్టెంబరు 16 - 2023 అక్టోబరు 05)
ఇతర వివరాలు
[మార్చు]చైనా, ఇజ్రాయెల్, జపాన్, కువైట్, మలేషియా, నేపాల్, ఖతర్, సింగపూర్, దక్షిణ కొరియా, శ్రీలంక, థాయ్‌లాండ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు మొదలైన దేశాలు సందర్శించాడు.
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (7 July 2021). "ఎమ్మెల్యే బాజిరెడ్డికి సతీవియోగం". Archived from the original on 7 July 2021. Retrieved 7 July 2021.
- ↑ admin (2019-01-10). "Nizamabad Rural MLA Bajireddy Govardhan". Telangana data (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-08-23.
- ↑ Sakshi (22 November 2018). "బరిలో ఇంజినీర్లు". Archived from the original on 26 November 2021. Retrieved 26 November 2021.
- ↑ Eenadu (26 October 2023). "ఎంపీపీల నుంచి ఎమ్మెల్యేలుగా." Archived from the original on 26 October 2023. Retrieved 26 October 2023.
- ↑ Sakshi (3 November 2018). "నిజామాబాద్ నియోజకవర్గా ఎన్నికల రివ్యూ". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
- ↑ Sakshi (13 November 2018). "సర్పంచ్ నుంచి చట్ట సభకు..!". Archived from the original on 25 November 2021. Retrieved 25 November 2021.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ Sakshi (19 November 2018). "అభ్యర్థుల ప్రొఫైల్". Archived from the original on 27 November 2021. Retrieved 27 November 2021.
- ↑ "Nizamabad Urban Assembly (Vidhan Sabha) (MLA) Elections Result Live". www.news18.com. Retrieved 2021-08-23.
- ↑ "Nizamabad (Urban) Assembly Election result 2018: TRS' Bigala Ganesh wins". www.timesnownews.com. Retrieved 2021-08-23.
- ↑ 10TV (16 September 2021). "Bajireddy Govardhan : తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్" (in telugu). Archived from the original on 16 September 2021. Retrieved 16 September 2021.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Namasthe Telangana (20 September 2021). "ఆర్టీసీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన బాజిరెడ్డి గోవర్దన్". Archived from the original on 20 September 2021. Retrieved 20 September 2021.
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- CS1 maint: unrecognized language
- జీవిస్తున్న ప్రజలు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- 1953 జననాలు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- నిజామాబాదు జిల్లా వ్యక్తులు
- నిజామాబాదు జిల్లా రాజకీయ నాయకులు
- నిజామాబాదు జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- నిజామాబాదు జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు