Jump to content

రావులపల్లి గుర్నాథరెడ్డి

వికీపీడియా నుండి

రావులపల్లి గుర్‌నాథ్‌రెడ్డి 1944, ఫిబ్రవరి 15న మహబూబ్ నగర్ జిల్లా కోడంగల్ మండలం రావులపల్లిలో జన్మించాడు.[1] 1972లో రాజకీయరంగ ప్రవేశం చేసి కోడంగల్ గ్రామపంచాయతి సర్పంచిగా ఎన్నికయ్యాడు. 1978లో తొలిసారిగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పులివీరన్నపై విజయం సాధించాడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో ఇండిపెండెంట్ అభ్యర్థి నందారం వెంకటయ్యపై గెలుపొందినాడు. 1989, 1999, 2004లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులపై విజయం సాధించి మొత్తం 5 సార్లు శాసనసభకు ఎన్నికయ్యాడు. 2009లో తెలుగుదేశం పార్టీ యువనాయకుడు రేవంత్ రెడ్డి చేతిలో పరాజయం పొందినాడు.[2]

మూలాలు

[మార్చు]
  1. ఈనాడు దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 22-03-2009
  2. సూర్య దినపత్రిక, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, తేది 17-05-2009