మద్దూర్ మండలం (నారాయణపేట జిల్లా)
మద్దూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నారాయణపేట జిల్లా, మద్దూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°52′00″N 77°37′00″E / 16.8667°N 77.6167°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నారాయణపేట జిల్లా |
మండల కేంద్రం | మద్దూరు |
గ్రామాలు | 17 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 231 km² (89.2 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 67,395 |
- పురుషులు | 33,583 |
- స్త్రీలు | 33,812 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 33.56% |
- పురుషులు | 46.13% |
- స్త్రీలు | 20.95% |
పిన్‌కోడ్ | 509411 |
మద్దూర్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన నారాయణపేట నుండి 30 కి. మీ. దూరంలో కోస్గి-నారాయణపేట ప్రధాన రహదారిపై ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నారాయణపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[3][4]
గణాంకాలు
[మార్చు]2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 67470. ఇందులో పురుషుల సంఖ్య 33686, స్త్రీల సంఖ్య 33784. అక్షరాస్యుల సంఖ్య 27920.[5]
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 231 చ.కి.మీ. కాగా, జనాభా 67,395. జనాభాలో పురుషులు 33,583 కాగా, స్త్రీల సంఖ్య 33,812. మండలంలో 13,172 గృహాలున్నాయి.[6]
మహబూబ్ నగర్ జిల్లా నుండి మార్పు
[మార్చు]గతంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ మండలాన్ని 2019 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన నారాయణపేట జిల్లాలోకి చేర్చారు.[7]
మండల విశేషాలు
[మార్చు]ఈ మండలంలోని తిమ్మారెడ్డిపల్లెలో బాబాజి మఠం ఉంది. ఇక్కడి దేవుడు గిరిజనులు కొలిచే దైవంగా ప్రసిద్ధి కెక్కింది.
పశుసంపద గణాంకాలు
[మార్చు]2007 నాటి పశుగణన ప్రకారం మండలంలో 79వేల గొర్రెలు, 11వేల మేకలు, 67 గాడిదలు, 338 పందులు, 844 కుక్కలు, 9900 కోళ్ళు, 4వేల దున్నపోతులు ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- లక్కాయిపల్లి
- నందిపహాడ్
- జాదవ్‌రావ్‌పల్లి
- పల్లెర్ల
- పర్సాపురం
- దమగాన్‌పూర్
- ఖాజీపూర్
- నాగిరెడ్డిపల్లి
- చింతలదిన్నె
- దోరెపల్లి
- మద్దూరు
- పెద్రిపహాడ్
- చెన్‌రెడ్డిపల్లి
- మోమినాపూర్
- రేనివట్ల
- చన్వార్
- మన్నాపూర్
కొత్తపల్లి మండలం ఏర్పాటు
[మార్చు]2022 జూలై 22న కొత్తపల్లి మండలం మద్దూరు నుంచి కొత్త రెవెన్యూ మండలంగా ఏర్పడింది.[8]
కొత్తపల్లి మండలంలో విలీనమైన గ్రామాలు
[మార్చు]- కొత్తపల్లి
- నిడ్జింత
- భూనీద్
- దుప్పట్‌ఘాట్
- గోకుల్నగర్
- తిమ్మారెడ్డిపల్లి
- పెద్దాపూర్
- లింగాల్చెడ్
- నందిగామ
- అల్లీపూర్
- ఈ మండలం నుండి కొమ్మూరు, వీరారాం అనే 2 గ్రామాలు 2022 జూలై 22న కొత్తగా ఏర్పడిన గుండుమాల్ మండలానికి, అలాగే 10 గ్రామాలు కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి మండలంలో విలీనం చేయబడ్డాయి.
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నారాయణపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-29. Retrieved 2021-01-06.
- ↑ "Villages & Towns in Maddur Mandal of Mahbubnagar, Andhra Pradesh". www.census2011.co.in. Retrieved 2022-09-26.
- ↑ "Villages and Towns in Maddur Mandal of Mahbubnagar, Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2022-09-26. Retrieved 2022-09-26.
- ↑ Census of India 2011, Provisional Population Totas, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.126
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.
- ↑ "మరో 2 కొత్త జిల్లాలు". ఈనాడు. Archived from the original on 12 April 2019. Retrieved 5 March 2019.
- ↑ telugu, NT News (2021-07-23). "కొడంగల్‌లో మూడు కొత్త మండలాలు". www.ntnews.com. Retrieved 2023-08-17.