కాలే యాదయ్య
కాలే యాదయ్య | |||
![]()
| |||
పదవీ కాలం 2014 - 2018, 2018 - ప్రస్తుతం | |||
ముందు | కోరాని సాయన్న రత్నం | ||
---|---|---|---|
నియోజకవర్గం | చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1962, మే 16 చించల్‌పేట్, నవాబ్‌పేట్ మండలం, వికారాబాదు జిల్లా, తెలంగాణ రాష్ట్రం, | ||
రాజకీయ పార్టీ | భారత్ రాష్ట్ర సమితి | ||
తల్లిదండ్రులు | మల్లయ్య - లక్ష్మమ్మ | ||
జీవిత భాగస్వామి | జయమ్మ | ||
సంతానం | ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె |
కాలే యాదయ్య, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ప్రస్తుతం భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరపున చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[1]
జననం, విద్య[మార్చు]
యాదయ్య 1962, మే 16న మల్లయ్య - లక్ష్మమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని, నవాబ్‌పేట్ మండలంలోని చించల్‌పేట్ గ్రామంలో జన్మించాడు.[2] వ్యవసాయ కుటుంబానికి చెందిన యాదయ్య మార్పల్లిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి 1986లో ఇంటర్మీడియట్ పూర్తిచేశాడు.
వ్యక్తిగత జీవితం[మార్చు]
యాదయ్యకు జయమ్మతో వివాహం జరిగింది. వారికి ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు.
రాజకీయ విశేషాలు[మార్చు]
యాదయ్య కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎంపీపీ, జెడ్పీటీసీ పని చేసి, 2009లో చేవెళ్ల నియోజకవర్గం ఎస్సీకి రిజర్వు కావటంతో కాంగ్రెస్ పార్టీ నుండి పోటిచేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నం చేతిలో ఓడిపోయాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 781 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[3][4] తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై చేవెళ్ళ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోరాని సాయన్న రత్నంపై 33,552 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[5]
హోదాలు[మార్చు]
- ప్రాథమిక వ్యవసాయ క్రెడిట్ సొసైటీ (పిఏసిఎస్) చైర్మన్
- ఎంపిపి, నవాబుపేట మండలం
- జెడ్‌పిటిసి, నవాబుపేట మండలం
- టిటిడి బోర్డు సభ్యుడు
- 22.09.2019 నుండి షెడ్యూల్డ్ కులాల సంక్షేమంపై కమిటీ చైర్మన్
మూలాలు[మార్చు]
- ↑ "Member's Profile - Telangana-Legislature". www.telanganalegislature.org.in. Archived from the original on 2021-05-27. Retrieved 2021-09-07.
- ↑ "Kale Yadaiah | MLA | TRS | Chevella | Ranga Reddy | Telangana". the Leaders Page (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-04-21. Retrieved 2021-09-07.
- ↑ Sakshi (16 May 2014). "తెలంగాణలో విజేతలు". Archived from the original on 14 April 2022. Retrieved 14 April 2022.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2019-05-24. Retrieved 2019-05-24.
- ↑ "Kale Yadaiah(TRS):Constituency- CHEVELLA (SC)(RANGA REDDY) - Affidavit Information of Candidate:". myneta.info. Retrieved 2021-09-07.
- CS1 అమెరికన్ ఇంగ్లీష్-language sources (en-us)
- జీవిస్తున్న ప్రజలు
- 1962 జననాలు
- తెలంగాణ రాజకీయ నాయకులు
- తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు
- తెలంగాణ శాసన సభ్యులు (2014)
- తెలంగాణ శాసన సభ్యులు (2018)
- రంగారెడ్డి జిల్లా వ్యక్తులు
- రంగారెడ్డి జిల్లా రాజకీయ నాయకులు
- పార్టీలు ఫిరాయించిన రాజకీయ నాయకులు
- రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన ఆంధ్రప్రదేశ్ శాసన సభ్యులు
- రంగారెడ్డి జిల్లా నుండి ఎన్నికైన శాసన సభ్యులు