Jump to content

పాలెం చెన్నకేశవరెడ్డి

వికీపీడియా నుండి
(పి. చెన్నకేశవరెడ్డి నుండి దారిమార్పు చెందింది)
పాలెం చెన్నకేశవరెడ్డి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
పదవీ కాలం
1985 – 1985
ముందు కోకా రామచంద్రరావు
తరువాత కె. భాస్కరన్

వ్యక్తిగత వివరాలు

జననం (1924-11-03)1924 నవంబరు 3
మరణం 2020 ఫిబ్రవరి 14

జస్టిస్ పాలెం చెన్నకేశవరెడ్డి (1910–1973) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి[1]

చెన్నకేశవరెడ్డి 1924, నవంబరు 2వ తేదీన, కడప జిల్లా, తాటిమాకులపల్లెలో జన్మించాడు. ఈయన విద్యాభ్యాసం పులివెందుల బోర్డు ఉన్నత పాఠశాలలో, అనంతపురంలోని సి.డి.కళాశాలలో సాగింది. ఆ తర్వాత మద్రాసు న్యాయకళాశాలలో న్యాయశాస్త్ర పట్టభద్రుడయ్యాడు.

1952, జూలై 28న మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా వృత్తిజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన, ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తి అయిన ఎం.ఎస్.రామచంద్రరావు వద్ద అప్రెంటీసుగా పనిచేశాడు. ఆ తర్వాత క్రిమినల్ బార్‌లో ప్రసిద్ధి చెంది, ఆ తర్వాత 1957లో బెంచికి పదవోన్నతి పొందిన పి.బసిరెడ్డి వద్ద పనిచేశాడు. 1957 నుండి సొంతగా ప్రాక్టీసు పెట్టాడు.[2]

1952 మద్రాసు ఉన్నత న్యాయస్థానంలో న్యాయవాదిగా ప్రారంభమై, 1953లో గుంటూరులో హైకోర్టు ప్రారంభించినప్పుడు అక్కడికి మారాడు. 1956లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటుతో, హైదరాబాదు ఉన్నత న్యాయస్థానానికి మారాడు.[3]

చెన్నకేశవరెడ్డి ముఖ్యంగా, సివిల్, క్రిమినల్, రాజ్యాంగ వ్యాజ్యాలను చేపట్టాడు. 1961 నుండి 1964 వరకు రాష్ట్ర బార్ కౌన్సిల్, బార్ కౌన్సిల్ క్రమశిక్షణా వ్యవహారాల సంఘంలో సభ్యుడిగా పనిచేశాడు. 1970 జనవరి నుండి ప్రత్యేక పోలీసు కేసులలో కేంద్ర ప్రభ్యుతం తరఫున న్యాయవాదిగా పనిచేశాడు. కొన్ని ప్రముఖ ప్రభుత్వరంగ పరిశ్రమలకు న్యాయసలహాదారుగా ఉన్నాడు.[2]

1972, మే 10న రెండు సంవత్సరాల పర్యాయానికి, ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానానికి అదనపు న్యాయమూర్తిగా నియమితుడయ్యాడు. 1973, జూన్ 10న శాశ్వత న్యాయవాదిగా నియతుడయ్యాడు.[2]

చెన్నకేశవరెడ్డి 1984 నుండి 1985 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నత న్యాయస్థానపు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. ఆ తర్వాత గౌహాతీ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ అయ్యి 1986లో అక్కడే పదవీవిరమణ పొందాడు.

చెన్నకేశవరెడ్డి, హైదరాబాదులోని బంజారా హిల్స్ ప్రాతంలోని తన స్వగృహంలో 2020, ఫిబ్రవరి 14న 96 ఏళ్లవయసులో మరణించాడు. ఈయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె. ఆయన అంత్యక్రియలు పంజాగుట్ట శ్మశానవాటికలో నిర్వహించారు.[4][5]

మూలాలు

[మార్చు]
  1. "Former Judges List". tshc.gov.in. Retrieved 2022-07-24.
  2. 2.0 2.1 2.2 "THE HONOURABLE SRI JUSTICE P.CHENNAKESAV REDDI". High Court for the State of Telangana. Retrieved 24 July 2022.
  3. "Former Andhra Pradesh Chief Justice passes away at 96". The New Indian Express. 15 February 2020. Retrieved 24 July 2022.
  4. "Former Andhra HC Chief Justice Chennakesava Reddi passes away in Hyderabad". The News Minute. Retrieved 24 July 2022.
  5. "Hyderabad: Former Chief Justice Palem Chennakesava Reddi passes away at 96". Mumbai Mirror. Retrieved 24 July 2022.