పి. చంద్రారెడ్డి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పి. చంద్రారెడ్డి
P. Chandra Reddy

పదవీ కాలము
1958 – 1964
ముందు కోకా సుబ్బారావు
తరువాత పి. సత్యనారాయణ రాజు

పదవీ కాలము
1964 – 1966

వ్యక్తిగత వివరాలు

జననం (1904-07-01) 1904 జూలై 1
మరణం 1976 అక్టోబరు 7

జస్టిస్ పి. చంద్రారెడ్డి లేదా పలగాని చంద్రారెడ్డి (జూలై 1, 1904 - అక్టోబర్ 7, 1976) ప్రముఖ న్యాయమూర్తి.

వీరు నెల్లూరులోని వి.ఆర్. ఉన్నత పాఠశాలలో చదివి తర్వాత మద్రాసులోని పచియప్ప కళాశాలలో ఉన్నత విద్యనభ్యసించారు.

వీరిని మద్రాసు హైకోర్టు న్యాయవాదిగా 1928 ఆగస్టు 13 తేదీన నియమించింది. ఇతడు సివిల్ మరియూ క్రిమినల్ కేసులను వాదించేవారు. ఇతడు అదే కోర్టులో 1949 జూలై 16 అదనపు న్యాయమూర్తిగా నియమించబడ్డాడు. వీరు ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టులో శాశ్వత న్యాయమూర్తిగా నియమించబడి తదనంతరం ప్రధాన న్యాయమూర్తిగా పదవోన్నతి పొందాడు.

వీరు ఆంధ్ర ప్రదేశ్ మరియు తమిళనాడు రాష్ట్రాల ఆపద్ధర్మ గవర్నరుగా కొద్దికాలం పనిచేశారు. వీరు 1964 డిసెంబరు 23 తేదీన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడ్డారు. వీరు 1966 జనవరి 7 తేదిన పదవీ విరమణ చేశారు. వీరు అక్టోబర్ 7 1976 తేదీన పరమపదించారు.[1] [2][3]

మూలాలు[మార్చు]

  1. HON'BLE SRI JUSTICE P.CHANDRA REDDI (High Court of Andhra Pradesh, Hyderabad, 20 September 2008)
  2. Sixth Assembly First Session–First Meeting (Tamil Nadu Legislative Assembly, 21 September 2008)
  3. Past Governors (Raj Bhavan, Chennai, 20 September 2008)