పింగళి జగన్మోహన్ రెడ్డి

వికీపీడియా నుండి
(పి. జగన్ మోహన్ రెడ్డి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పింగళి జగన్మోహన్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి
పదవీ కాలం
1966 – 1969
ముందు ఎన్.డి.కృష్ణారావు
తరువాత ఎన్.కుమారయ్య

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
1969 – 1975

వ్యక్తిగత వివరాలు

జననం (1910-01-23)1910 జనవరి 23

జస్టిస్ పింగళి జగన్మోహన్ రెడ్డి (1910 జనవరి 23 – 1999 మార్చి 09) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధానన్యాయమూర్తి.[1] 1937 నుండి 1846 వరకు బొంబాయి, మద్రాసు, హైదరాబాదు హైకోర్టులో వకీలుగా పనిచేసాడు.

హైదరాబాదు ప్రభుత్వంలో డిప్యుటీ సెక్రటరీగా పనిచేశాడు. ఆ తర్వాత అదనపు న్యాయమూర్తి, జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి, హైకోర్టుకు అదనపు న్యాయమూర్తిగా 1945, ఫిబ్రవరి 25 నుండి 1946, నవంబరు 16 వరకు పనిచేశాడు. 1952, ఫిబ్రవరి 16 నుండి హైదరాబాదు హైకోర్టు న్యాయమూర్తిగా, 1956 నుండి 1966 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా, 1966 నుండి 1969 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశాడు. 1969 నుండి 1975 వరకు భారత సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.

ఉస్మానియా విశ్వవిద్యాలయపు సిండికేటు సభ్యుడిగా, అధ్యాపకబృంద సభ్యుడిగా, లా కాలేజీ డీన్ గా 1952–59 వరకు పనిచేశాడు. 1975లో ఉస్మానియా విశ్వవిద్యాలయపు ఉపసంచాలకుడిగా ఉన్నాడు.

జీవితం[మార్చు]

ప్రారంభ జీవితం[మార్చు]

చాలా మటుకు జగన్మోహన్ రెడ్డి ప్రారంభజీవితం 1993లో ఆయన ప్రచురించిన ఆత్మకథ "ది రెవల్యూషన్ ఐ హావ్ లివిడ్ త్రూ" (నేను చూసిన ఉద్యమాలు) ద్వారా తెలుస్తున్నది.[2]

జగన్మోహన్ రెడ్డి 1910, జనవరి 23న, అప్పటి హైదరాబాదు సంస్థానంలోని వడ్డేపల్లిలో జన్మించాడు.[3] ఈయన తాత నరసింహారెడ్డికి ముగ్గురు కుమారులు: జగన్మోహన్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి, కృష్ణారెడ్డి, రంగారెడ్డి. వెంకట్రామరెడ్డిని ఆయన చిన్నాన్న రామచంద్రారెడ్డి దత్తత తీసుకున్నాడు. రామచంద్రారెడ్డి కొడుకు పదకొండేళ్ళవయసులో మరణించాడు.[4] వెంకట్రామరెడ్డి తండ్రి, దత్తతు తీసుకొన్న చిన్నాన్న ఇరువురూ చిన్నవయసులోనే మరణించడంతో, 15 సంవత్సరాల వయసులోనే కుటుంబ బాధ్యతలు చేపట్టాడు.[5] నల్గొండ జిల్లాలో పన్ను ఆదాయాన్ని వసూలు చేసే ఉద్యోగాన్ని చేపట్టి, 1898లో వివాహం చేసుకున్నాడు. పెళ్ళి నాటికి దంపతుల వయసు 16, 13 సంవత్సరాలే.[6] జగన్మోహన్ రెడ్డి తండ్రి స్వతహాగా చదువుకున్నాడు. అందుకే విద్యకు అత్యంత విలువనిచ్చాడు. ఈ విధంగా హైదరాబాదులో రెడ్డీ బాలికలకు హాస్టలు, బాలికల పాఠశాలను నెలకొల్పాడు. అంతేకాక బంధువులలో అనేక మంది అమ్మాయిల విద్యాభ్యాసానికి సహాయం చేశాడు.[7]

జగన్మోహన్ రెడ్డికి ఐదుగురు సోదరసోదరీమణులు. ఈయన అందరికంటే చిన్నావాడు. ఈయన పెద్దక్క కమల, పెద్దన్న మన్మోహన్ రెడ్డి చిన్నతనంలోనే మరణించారు.[3] ఆ తర్వాత అక్క, కుముదినీ, ఇద్దరన్నలు, జనార్ధన్, మధుసూదన్.[3] సోదరసోదరీమణులు హైదరాబాదులో చదువుతుండగా, రెడ్డి బాల్యమంతా వడ్డేపల్లిలోనే సాగింది.[8] ప్రభుత్వంతో ఎక్సైజు పన్నుతో సహా వివిధ పన్నులు సేకరించే కాంట్రాక్టులే కాకుండా, ప్రత్తి జిన్నింగ్ పరిశ్రమలు, షెల్ పెట్రోలు, ఆయిల్ ఏజెన్సీ తదితర అనేక వ్యాపారాలతో కుటుంబాన్ని పోషిస్తుండేవాడు.[9]

జగన్మోహన్ రెడ్డి, 25 ఏళ్ల వయసులో, 1935లో 16 ఏళ్ల సీతను వివాహం చేసుకున్నాడు.[10] పెళ్ళైన తర్వాత ఆమె పేరు ప్రమీలగా మార్చుకొంది.[10] భర్త ఇంగ్లాండులో ఎల్.ఎల్.బి చదువుతుండగా, తన పాఠశాల విద్యాభ్యాసం పూర్తిచేసింది.[11] ఈ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు అజిత్, 1939లో జన్మించాడు.[12] వీరి కూతురు ఊర్మిళ 1946లో జన్మించింది.[13]

విద్య[మార్చు]

రెడ్డి ప్రాథమిక విద్య ఈయన స్వగ్రామం వడ్డేపల్లి గ్రామంలోని పాఠశాలలో ప్రారంభమై, హైదరాబాదులో కొనసాగింది.[14] ఈయన కొంతకాలం ఒక పొగాకు నశ్యం దుకాణపు యజమాని వద్ద, పొగాకు నశ్యం తయారుచేసే కళతో పాటు, తెలుగు భాషను కూడా నేర్చుకున్నాడు.[15] ఆ తర్వాత విద్యను ప్రైవేటు శిక్షకుల వద్ద, హైదరబాదు నగర ఉన్నత పాఠశాలలో, హైదరాబాదు సెయింట్ జార్జ్ బాలుర గ్రామర్ స్కూల్‌లో కొనసాగించి అక్కడ సీనియర్ కేంబ్రిడ్జి పరీక్ష పూర్తిచేశాడు.[16] అప్పట్లో మద్రాసు విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న నిజాం కళాశాలలో కూడా కొంతకాలం పాటు చదివాడు.[17]

వైద్యుడవ్వలనే ఉద్దేశంతో ఇంగ్లాడుకు వెళ్లి, తొలుత సర్రీలోని బాడింగ్‌హాం కళాశాలలో మెట్రిక్యులేషన్‌కై చదివాడు. ఆ తర్వాత, లీడ్స్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న తన సోదరునికి దగ్గరగా ఉండటానికి, లీడ్సులోని ఒక పాఠశాలకు బదిలీ అయ్యాడు.[18] ఆ తర్వాత లీడ్స్ విశ్వవిద్యాలయంలో చేరి, కామర్స్‌లో డిగ్రీపొందాడు.[19] ఆ తదనంతరం తన జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల న్యాయశాస్త్రం చేపట్టాలని నిశ్చయించుకున్నట్టు రెడ్డి చెప్పాడు. అందులో, హైదరాబాదును సందర్శించినప్పుడు నిజాం న్యాయస్థానంలో కేసులు వాదించడాన్ని చూడటం, మహమ్మదలీ జిన్నాను కలిసినప్పుడు ఆయన న్యాయవాద ప్రాక్టీసును ఎలా స్థాపించాలో ఇచ్చిన సూచనలు తన నిర్ణయానికి దోహదం చేశాయి.[20] 1932లో లింకన్ ఇన్లో బారిస్టరుగా ఉన్న బాబాయిని కలవటానికి వెళ్ళి, అనేక విందులలో పాల్గొన్నాడు.[21] ఈయన కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాలలో న్యాయవాద విద్య అభ్యసించి బి.ఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.[22]

వ్యాసంగం[మార్చు]

న్యాయవాద వృత్తి[మార్చు]

బారిస్టరుగా గ్రేస్ ఇన్ నుండి ఆహ్వానం అందుకొని, ఒక సంవత్సరం పాటు పి.బి.మోర్లే చాంబర్స్‌లో చదివాడు.[23] 1937లో భారతదేశం తిరిగివచ్చి, బొంబాయిలో జంషెడ్జీ పి.కంగా చేంబర్సులో చేరాడు.[24] 1938లో ప్రాక్టీసును మద్రాసు హైకోర్టుకు మార్చి దురైస్వామి అయ్యర్ చేంబర్సులో చేరాడు.[25] ఆ తర్వాత స్వతంత్రంగా ప్రాక్టీసు ఏర్పాటుచేసి, క్రిమినల్, సివిల్ కేసులు చేపట్టాడు.[26] 1940లో హైదరాబాదు తిరిగివచ్చి తన ప్రాక్టీసును కొనసాగించాడు.[27]

హైదరాబాదులో, హైకోర్టుతో పాటు, చిన్న న్యాయస్థానాలు, రెవెన్యూ, అతియత్ కోర్టుల్లో కూడా ప్రాక్టీసు చేశాడు. ముఖ్యంగా వాణిజ్య, వ్యాపార సంబంధ కేసులను వాదించాడు.[28] రెడ్డి, హైదరాబాదు ప్రభుత్వానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదు ఏర్పాటులో సలహాదారుగా ఉన్నాడు. అంతేకాక, హైదరాబాదు స్టేట్ బ్యాంక్ చట్టాన్ని కూడా రూపొందించాడు.[29] ఈయన ప్రభుత్వానికి అనేక ఇతర విషయాల్లో సలహాదారుగా పనిచేశాడు. హైదరాబాదు కమర్షియల్ కార్పోరేషన్[30], డెక్కన్ ఎయిర్‌వేస్.[31]

విద్యారంగంలో[మార్చు]

1940లో అప్పటి ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపసంచాలకుడు కాజీ మహమ్మద్ హుస్సేన్, రెడ్డిని పార్ట్‌టైం లెక్చరర్గా ఉస్మానియాలో న్యాయవిద్య బోధించడానికి ఆహ్వానించాడు.[32] తొలుత ఉర్దూలో లా ఆఫ్ టార్ట్స్ ను బోధించాడు కానీ ఆ తర్వాత బోధనకు సమయాన్ని కేటాయించేందుకు వీలకాక, తన ప్రాక్టీసుమీద దృష్టిపెట్టేందుకై, బోధనను ఆపివేశాడు.[33] ఈయన కొంతకాలం రాజా బహద్దూర్ వెంకట్రామిరెడ్డి స్థాపించిన రెడ్డి హాస్టలుకు కార్యదర్శిగా కూడా పనిచేశాడు.[34]

న్యాయసంస్కరణలు, ప్రభుత్వ పేషీ[మార్చు]

1946లో, హైదరాబాదు రాష్ట్రం, చట్ట, న్యాయ వ్యవహారాలను చూసుకొంటున్న జ్యుడీషియల్ శాఖతో సహా తన పాలనా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడం ప్రారంభించింది.[35] పదవి జ్యుడిషియల్ ఆఫీసుతోసరిసమానంగా ఉండేట్టు చూసిన తర్వాత, 1946 ఏప్రిల్లో ఈ శాఖకు ఉపకార్యదర్శిగా పనిచేయటానికి రెడ్డిని ఆహ్వానించారు.[36] 1947లో న్యాయశాఖ కార్యదర్శిగా నియమించబడిన వ్యక్తి లేనిసమయంలో ఒక నెలరోజుల పాటు అపద్ధర్మ న్యాయశాఖ కార్యదర్శిగా వ్యవహరించాడు.[37] న్యాయశాఖలో పనిచేస్తుండగా, రెడ్డి హైదరాబాదు ఆదాయపన్ను చట్టం, హైదరాబాదు కంపెనీల చట్టాల రూపకల్పనలో ఈయన పాల్గొన్నాడు.[37]

1971 నగర్‌వాలా స్కాండల్[మార్చు]

1971లో జరిగిన నగర్‌వాలా స్కాండల్ పై విచారణ జరపటానికి, జనతా ప్రభుత్వం 1977న జూన్ 9 న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక విచారణా సంఘాన్ని ఏర్పాటు చేసింది.

ప్రచురణలు[మార్చు]

 • The Hyderabad Excess Profits Tax Act
 • Quest of Justice.

నివేదికలు[మార్చు]

 • Report on the 1969 Gujarat riots
  • Pingle Jagamohan Reddy, Nusserwanji K Vakil and Akbar S Sarela, Pingle Jaganmohan (1973). Report: Inquiry into the communal disturbances at Ahmedabad and other places in Gujarat on and after 18th September 1969. Commission of Inquiry on Communal Disturbances at Ahmedabad and at Various Places in the State of Gujarat on and after 18 September 1969, Home Department, Government of Gujarat. ISBN 9788125016175.

స్వీయచరిత్రలు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Profile of Sri Honourable Justice P.Jaganmohan Reddy at Andhra Pradesh High Court". Archived from the original on 2016-03-03. Retrieved 2017-11-23.
 2. Reddy, P. Jaganmohan (1993-01-01). The Revolution I Have Lived Through (in ఇంగ్లీష్). Printwell. ISBN 9788170443056.
 3. 3.0 3.1 3.2 Reddy 1993, p. 26
 4. Reddy, P. Jaganmohan (1993-01-01). The Revolution I Have Lived Through (in ఇంగ్లీష్). Printwell. p. 20. ISBN 9788170443056.
 5. Reddy 1993, p. 22.
 6. Reddy 1993, p. 23
 7. Reddy 1993, p. 24
 8. Reddy 1993, p. 29
 9. Reddy 1993, p. 79
 10. 10.0 10.1 Reddy 1993, p. 162.
 11. Reddy 1993, p. 174
 12. Reddy 1993, p. 242.
 13. Reddy 1993, p. 293.
 14. Reddy 1993, p. 30
 15. Reddy 1993, p. 35.
 16. Reddy 1993, p. 37.
 17. Reddy 1993, p. 70
 18. Reddy 1993, p. 89.
 19. Reddy 1993, p. 97.
 20. Reddy 1993, p. 123-4.
 21. Reddy 1993, p. 124.
 22. Reddy 1993, p. 132
 23. Reddy 1993, p. 184.
 24. Reddy 1993, p. 190.
 25. Reddy 1993, p. 212-213.
 26. Reddy 1993, p. 225.
 27. Reddy 1993, p. 246.
 28. Reddy 1993, p. 252.
 29. Reddy 1993, p. 258.
 30. Reddy 1993, p. 261.
 31. Reddy 1993, p. 270.
 32. Reddy 1993, p. 253.
 33. Reddy 1993, p. 256.
 34. Reddy 1993, p. 274.
 35. Reddy 1993, p. 287.
 36. Reddy 1993, p. 289.
 37. 37.0 37.1 Reddy 1993, p. 300.

బయటి లింకులు[మార్చు]