ఎన్.డి.కృష్ణారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నందలికే దేవరావు కృష్ణారావు

పదవీ కాలం
8 జూలై 1966 – 19 జూలై 1966
ముందు మనోహర్ ప్రసాద్
తరువాత పింగళి జగన్మోహన్ రెడ్డి

వ్యక్తిగత వివరాలు

జననం 19 జూలై 1904
నందలికే గ్రామం, కార్కళ తాలూకా, ఉడిపి జిల్లా, కర్ణాటక
మరణం 21 ఫిబ్రవరి 1971

జస్టిస్ నందలికే దేవరావు కృష్ణారావు (1904 జూలై 19 – 1971 ఫిబ్రవరి 21) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి.

కృష్ణారావు, 1904, జూలై 19న ప్రస్తుత కర్ణాటకలోని ఉడిపి జిల్లా, కార్కళ తాలూకా, నందలికే గ్రామంలో నందలికే దేవరావు, తుంగమ్మ దంపతులకు జన్మించాడు.[1][2] కృష్ణారావు తండ్రి దేవరావు, కన్నడ మహాకవి ముద్దన్న సహాధ్యాయి.[2] కృష్ణారావు పాఠశాల విద్యాభ్యాసం మంజేశ్వర్ లోని ప్రాథమిక పాఠశాలలో, ఉడిపి క్రైస్తవ ఉన్నత పాఠశాల, మంగులూరులోని గణపతి సెకండరీ పాఠశాలల్లో సాగింది. ఆ తర్వాత మంగులూరు ప్రభుత్వ కళాశాలలో, మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ప్రథముడిగా నిలచి రసాయన శాస్త్రంలో బి.ఎస్.సీ (హానర్స్) తో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత ఉన్నత విద్యకై ఇంగ్లాండు వెళ్ళాడు. అక్కడ లండన్ స్కూల్ ఆఫ్ ఎకానామిక్స్, ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న బ్రేస్నోస్ కళాశాలలో చదివాడు. 1928 సెప్టెంబరు 28న ఇండియన్ సివిల్ సర్వీసులో చేరాడు. 1928లో ఇంగ్లాండులో నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలో కూడా ప్రథమ స్థానం పొందాడు.[1]

ఆంధ్ర రాష్ట్రం ఏర్పడే వరకు మద్రాసు రాష్ట్రంలో వివిధ హోదాల్లో పనిచేశాడు. 1928 నవంబరు 22 నుండి 1935 జూలై 18 వరకు సహాయ కలెక్టరు, సబ్‌ కలెక్టరుగా పనిచేశాడు. 1935 జూలై 19 నుండి 1937, జనవరి 18 వరకు జిల్లా మున్సిఫ్ గా, 1937 జనవరి 23 నుండి 1937, జూన్ 13 వరకు జిల్లా జడ్జి, సబ్‌కలెక్టరుగా పనిచేశాడు. పాలనాధికారిగా ఆరుసంవత్సరాలు పనిచేసిన త్గర్వాత, న్యాయ శాఖను ఎంచుకొని, 1936లో లండన్ లోని లింకన్ ఇన్‌లో న్యాయవాది అయ్యాడు.[1] 1937, జూన్ 14 నుండి 1940 అక్టోబరు 20 వరకు జిల్లా జడ్జి, కలెక్టరుగా పనిచేశాడు. 1940, అక్టోబరు 31 నుండి 1955 ఫిబ్రవరి 20 వరకు జిల్లా న్యాయమూర్తిగా ఉన్నాడు. 1941, జూన్ 18న జిల్లా న్యాయమూర్తి గ్రేడ్ 2 గా నిశ్చయించబడి, 1952, మే నుండి జిల్లా న్యాయమూర్తి గ్రేడ్ 1గా ఉన్నాడు.

1955, ఫిబ్రవరి 21న ఆంధ్ర రాష్ట్ర హైకోర్టుకు న్యాయమూర్తిగా నియమించడి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా కొనసాగాడు. పదవీ విరమణ పొందే పది రోజుల ముందే 1966, జూలై 8న, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించబడి, 1966, జూలై 19న పదవీ విరమణ పొందాడు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అత్యంత స్వల్పకాలం ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన రికార్డు ఈయనదే. కృష్ణారావును ప్రధాన న్యాయమూర్తిగా నియమించడం వెనుక అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి, తన అనుకూలమైన కొన్ని పనులు చేయించుకోవటానికి నియమింపజేశాడని, పింగళి జగన్మోహన్ రెడ్డి తన జీవితచరిత్ర "ద జ్యుడీషియరీ, ఐ సర్వ్‌డ్"లో వ్రాశాడు.[3]

కృష్ణారావు, 1971, ఫిబ్రవరి 21న మరణించాడు.

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "N.D.K.Kalayana Mandira - About". ndkkalyanamandira.com. Archived from the original on 23 జనవరి 2018. Retrieved 26 November 2017.
  2. 2.0 2.1 Moodubelle, Eugene D’Souza. "Belle Padmavati Vittal Rao: A Legendary Teacher and Great Administrator". daijiworld.com. Retrieved 26 November 2017.
  3. Pingali, Jaganmohan Reddy. The Judiciary I Served. 1999: Orient Blackswan. p. 127. ISBN 9788125016175. Retrieved 26 November 2017.{{cite book}}: CS1 maint: location (link)

బయటి లింకులు[మార్చు]