ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం

వికీపీడియా నుండి
(ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం
High Court of Andhra Pradesh, Amaravati (May 2019) 1.jpg
అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థాన భవనం
స్థాపితం1 జనవరి 2019[1]
దేశం India
ప్రదేశంఅమరావతి, ఆంధ్రప్రదేశ్
భౌగోళికాంశాలు16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E / 16.5195; 80.4856అక్షాంశ రేఖాంశాలు: 16°31′10″N 80°29′08″E / 16.5195°N 80.4856°E / 16.5195; 80.4856
సంవిధాన పద్ధతిసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సంబంధిత రాష్ట్ర గవర్నరుల సలహా మేరకు రాష్ట్రపతి చే నియామకం. .
అధికారం పొందినదిభారత రాజ్యాంగం
తీర్పులపై ఉత్తరాభియోగంభారత అత్యున్నత న్యాయస్థానం
న్యాయమూర్తుల పదవీ కాలం62 సంవత్సరాల వయసులో తప్పనిసరి పదవీ విరమణ
స్థానాల సంఖ్య37
{Permanent 28 ; Addl. 9}
వెబ్‌సైట్hc.ap.nic.in
ఛీఫ్ జస్టిస్
ప్రస్తుతంప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా
అప్పటినుండి13 అక్టోబరు 2021


ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం 2019 లో అవశేష ఆంధ్రప్రదేశ్ కొరకు ఏర్పాటు చేసిన ఉన్నత న్యాయస్థానం. అంతకుముందు హైదరాబాదులోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుగా పనిచేసేది. ఇది అమరావతిలో నెలకొని ఉంది.[2] ప్రస్తుతం హైకోర్టు కోసం ఉపయోగిస్తున్న కోర్టు కాంప్లెక్స్‌కు "జ్యుడిషియల్ కాంప్లెక్స్" అని పేరు పెట్టారు. శాశ్వత హైకోర్టు భవనం ప్రారంభించిన తరువాత "సిటీ సివిల్ కోర్టు" కోసం ఈ జ్యూడీషియల్ కాంప్లెక్స్ వాడతారు.

చరిత్ర[మార్చు]

1954 సంవత్సరంలో మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి విడిపోయి, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దీన్ని స్థాపించారు. 1956 నాటికి ఆంధ్ర హైకోర్టు గుంటూరులో ఉండేది. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం తర్వాత కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాకా దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌కు తరలించారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లుగా విడిపోయాకా, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధప్రదేశ్‌కు ప్రత్యేకించి హైకోర్టు ఏర్పాటుచేసేదాకా, హైదరాబాద్‌లోని హైకోర్టు ఉమ్మడి న్యాయస్థానంగా కొనసాగింది. రాష్ట్రపతి ఉత్తర్వులతో 2019 జనవరి 1న ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏర్పాటైంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నెలకొల్పారు. సి. ప్రవీణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ (విభజన తర్వాత) ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు తొలి తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా 2019 జనవరి 1 న నియమించబడ్డాడు.[3] 2019 అక్టోబరు 7 న నేలపాడు లో కొత్తగా నిర్మించిన హైకోర్ట్, న్యాయమూర్తులతో కొలువుదీరిన తరువాత, గవర్నర్ ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ మహేశ్వరి తో ప్రమాణం చేయించాడు. 2021 జనవరి 6న అరూప్ కుమార్ గోస్వామి మూడవ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశాడు.[4]

భౌగోళికం[మార్చు]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో అంతర్భాగమైన నేలపాడు వద్ద నెలకొంది.[5] కృష్ణా నదికి 6.4 కిలోమీటర్ల దూరంలో ఉంది.[6]

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు[మార్చు]

హైకోర్టు న్యాయమూర్తులు[మార్చు]

మాజీ న్యాయమూర్తులు[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు కొత్త న్యాయవాదుల పేర్లను సిఫారసు చేసిన సుప్రీంకోర్టు కొలీజియం[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "New Andhra High Court to function at Amaravati from Jan 1, President issues notification". Thenewsminute.com. Retrieved 28 December 2018.
  2. "CJI Ranjan Gogoi to open Judicial Complex, lay stone for permanent HC in Amaravati today". The New Indian Express. 3 February 2019. Retrieved 25 August 2019.
  3. "కొలువుదీరిన కొత్త హైకోర్ట్.. న్యాయమూర్తులతో ప్రమాణం చేయించిన గవర్నర్". BBC. 1 January 2019. Retrieved 7 April 2019.
  4. "రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణస్వీకారం చేసిన జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి" (PDF). I&PR,AP. 2021-01-06. Retrieved 2021-01-23.
  5. Reporter, Staff (2019-02-02). "CJI to inaugurate judicial complex today". The Hindu (in ఇంగ్లీష్). ISSN 0971-751X. Retrieved 2019-02-03.
  6. Google (28 January 2019). "Distance between High Court and Krishna river". Google Maps (Map). https://www.google.com/maps/@16.5442862,80.4880183,7185m/data=!3m1!1e3. 
  7. Andhra Jyothy (14 February 2022). "ఏడుగురు నూతన న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం". Archived from the original on 14 February 2022. Retrieved 14 February 2022.

ఇవి కూడా చూడండి.[మార్చు]


వెలుపలి లంకెలు[మార్చు]