Jump to content

అషానుద్దీన్ అమానుల్లా

వికీపీడియా నుండి
అషానుద్దీన్ అమానుల్లా
అషానుద్దీన్ అమానుల్లా


భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
6 ఫిబ్రవరి 2023
సూచించిన వారు డి.వై. చంద్రచూడ్
నియమించిన వారు ద్రౌపది ముర్ము

పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
20 జూన్ 2022 – 6 ఫిబ్రవరి 2023
సూచించిన వారు ఎన్. వి. రమణ
నియమించిన వారు రాం నాథ్ కోవీంద్

పదవీ కాలం
10 అక్టోబర్ 2021 – 20 జూన్ 2022
సూచించిన వారు ఎన్. వి. రమణ
నియమించిన వారు రాం నాథ్ కోవీంద్

పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
పదవీ కాలం
20 జూన్ 2011 – 10 అక్టోబర్ 2021
సూచించిన వారు ఎస్.హెచ్. కపాడియా
నియమించిన వారు ప్రతిభా పాటిల్

వ్యక్తిగత వివరాలు

జననం (1963-05-11) 1963 మే 11 (వయసు 61)

అషానుద్దీన్ అమానుల్లా భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాడు.[1]

జననం,విద్యాభాస్యం

[మార్చు]

అసనుద్దీన్‌ అమానుల్లా 1963 మే 11లో నెహాలుద్దీన్, ఇష్రతి అమానుల్లా దంపతులకు బీహార్‌ జన్మించాడు. ఆయన పాట్నా లా కాలేజీ నుండి ఎల్.ఎల్.బీ పూర్తి చేసి 1991 సెప్టెంబరు 27న బీహార్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నాడు.[2]

వృత్తి జీవితం

[మార్చు]

అసనుద్దీన్‌ అమానుల్లా న్యాయవాదిగా ప్రాక్టీస్ మొదలు పెట్టి రాజ్యాంగ, సివిల్, క్రిమినల్, సర్వీస్, టాక్సేషన్, కో-ఆపరేటివ్, లేబర్‌లో భారత అత్యున్నత న్యాయస్థానం, ఢిల్లీ హైకోర్టు, కలకత్తా హైకోర్టు, జార్ఖండ్ హైకోర్టులో కేసులను వాదించాడు. ఆయన 2010 ఆగస్టులో బీహార్ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిగా నియమితుడయ్యాడు. అసనుద్దీన్‌ అమానుల్లా 2011 జూన్ 20 నుండి పాట్నా హైకోర్టు న్యాయమూర్తిగా, పాట్నా హైకోర్టు లీగల్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్‌గా పనిచేశాడు.

పాట్నా హైకోర్టు నుండి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు న్యాయమూర్తిగా బదిలీపై వచ్చిన జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా 2021 అక్టోబరు 10న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన చేత జస్టిస్ అరుప్ కుమార్ గోస్వామి ప్రమాణం చేయించాడు.[3]

మూలాలు

[మార్చు]
  1. Namasthe Telangana (5 October 2021). "ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా అషానుద్దీన్ అమానుల్లా". Archived from the original on 12 October 2021. Retrieved 12 October 2021.
  2. Sakshi Education (11 October 2021). "రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ అమానుల్లా ప్రమాణం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.
  3. Namasthe Telangana (10 October 2021). "న్యాయమూర్తిగా జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా ప్రమాణస్వీకారం". Archived from the original on 15 October 2021. Retrieved 15 October 2021.